KKR Vs RR: ఇన్నాళ్లూ ఎక్కడున్నావ్ బ్రో - సైలెంట్‌గా వచ్చి వయొలెంట్‌గా ఫినిష్ చేసిన రింకూ - రాజస్తాన్‌పై కోల్‌కతా విన్!

ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏడు వికెట్లతో విజయం సాధించింది.

FOLLOW US: 

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఊరట లభించింది. వరుసగా ఐదు ఓటముల తర్వాత సోమవారం రాత్రి రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్ సంజు శామ్సన్ (54: 49 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం కోల్‌కతా 19.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. నితీష్ రాణా (48 నాటౌట్: 37 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా... రింకూ సింగ్ (42: 23 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) చివర్లో వేగంగా ఆడాడు. 2018లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రింకూ సింగ్‌కు ఇప్పటి వరకు 13 మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడే అవకాశం లభించింది. ఇన్నాళ్లు తను ఒక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా తనకే దక్కింది.

వేగంగా ఆడలేకపోయిన రాజస్తాన్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ (2: 5 బంతుల్లో) ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. మొదటి వికెట్ పడిన అనంతరం ఫాంలో ఉన్న జోస్ బట్లర్ (22: 25 బంతుల్లో, మూడు ఫోర్లు), కెప్టెన్ సంజు శామ్సన్ ఇన్నింగ్స్‌ను మెల్లగా ముందుకు తీసుకెళ్లారు. వీళ్లిద్దరూ వేగంగా ఆడలేకపోవడంతో స్కోరు వేగం తగ్గిపోయింది. రెండో వికెట్‌కు 48 పరుగులు జోడించాక జోస్ బట్లర్ అవుటయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ (13: 13 బంతుల్లో, ఒక ఫోర్), రియాన్ పరాగ్ (19: 12 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) ఎంతో సేపు క్రీజులో నిలబడలేకపోయారు. ఆఖర్లో షిమ్రన్ హెట్‌మేయర్ (27 నాటౌట్: 13 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) వేగంగా ఆడినా అప్పటికే ఆలస్యం అయిపోయింది. దీంతో రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 152 పరుగులకు పరిమితం అయింది. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో టిమ్ సౌతీ రెండు వికెట్లు తీయగా... శివం మావి, అనుకుల్ రాయ్, ఉమేష్ యాదవ్‌లకు తలో వికెట్ దక్కింది.

చివర్లో ఆడేసుకున్న రింకూ...
మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కూడా ఇన్నింగ్స్‌ను పేలవంగానే ప్రారంభించింది. ఓపెనర్లు బాబా ఇంద్రజిత్ (15: 16 బంతుల్లో, రెండు ఫోర్లు), ఆరోన్ ఫించ్ (4: 7 బంతుల్లో) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. స్కోరు బోర్డుపై 32 పరుగులు చేరేసరికి ఓపెనర్లిద్దరూ పెవిలియన్ బాట పట్టారు.

అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (34: 32 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), నితీష్ రాణా  కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. సాధించాల్సిన స్కోరు తక్కువే కావడంతో వీరిద్దరూ నిదానంగానే ఆడారు. మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించిన అనంతరం ట్రెంట్ బౌల్డ్... శ్రేయస్ అయ్యర్‌ను అవుట్ చేశాడు. దీంతో నితీష్ రాణాకు రింకూ సింగ్ జతకలిశాడు.

ఒకవైపు నితీష్ రాణా వికెట్ పడకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తుంటే... మరోవైపు రింకూ వేగంగా ఆడాడు. విజయానికి 12 బంతుల్లో 18 పరుగులు కావాల్సిన దశలో ప్రసీద్ కృష్ణ వేసిన 19వ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్ మొదటి బంతికి సిక్సర్‌తో నితీష్ రాణా మ్యాచ్ ఫినిష్ చేశాడు.

Published at : 02 May 2022 11:32 PM (IST) Tags: IPL Shreyas Iyer IPL 2022 RR KKR Sanju Samson KKR vs RR KKR Vs RR Updates KKR Vs RR Highlights KKR Won By 7 Wickets KKR Vs RR Match Highlights

సంబంధిత కథనాలు

IPL 2022, Jos Buttler: సెంచరీ ముందు జోస్‌ బట్లర్‌ ఫెయిల్యూర్‌! కాపాడిన సంగక్కర, సన్నిహితులు!

RR vs RCB, Mohammed Siraj: ఇదేంది సిరాజ్‌ మియా! హైదరాబాదీ పేస్‌ కెరటం కెరీర్లో కోరుకోని రికార్డు

IPL 2022, Faf du Plessis: ఆర్సీబీ భవిష్యత్తు చెప్పిన డుప్లెసిస్‌ - భారత కల్చర్‌కు పెద్ద ఫ్యాన్‌ అంటూ పొగడ్త

IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !

RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!

టాప్ స్టోరీస్

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!