అన్వేషించండి
Advertisement
Jos Buttler: భాయ్ రికార్డు బద్దలు కొట్టిన బట్లర్ - కింగ్ మాత్రం సేఫ్!
ఐపీఎల్ 2022 సీజన్‌లో జోస్ బట్లర్... డేవిడ్ వార్నర్ రికార్డును బద్దలు కొట్టాడు.
ఐపీఎల్ 2022 ఫైనల్లో జోస్ బట్లర్ మరో రికార్డు బద్దలు కొట్టాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఐపీఎల్ 2016 సీజన్‌లో డేవిడ్ వార్నర్ చేసిన 848 పరుగుల రికార్డును బట్లర్ దాటేశాడు.
ఈ మ్యాచ్ మొదలయ్యేసరికి 824 పరుగుల మీద ఉన్న బట్లర్ 25 పరుగులు మార్కును చేరుకోగానే వార్నర్ భాయ్ రికార్డును దాటాడు. అలాగే 850 పరుగుల మైలురాయిని కూడా దాటేశాడు. అయితే ఒక్క సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. ఐపీఎల్ 2016 సీజన్‌లోనే కింగ్ కోహ్లీ ఏకంగా 973 పరుగులు చేశాడు.
39 పరుగులకు రాగానే బట్లర్ అవుట్ కావడంతో విరాట్ కోహ్లీ 973, నాలుగు సెంచరీల రికార్డు సేఫ్‌గా ఉన్నాయి. అయితే క్వాలిఫయర్-2లో సెంచరీ చేయడంతో బట్లర్ సెంచరీల సంఖ్య నాలుగుకు చేరుకుంది. దీంతో కోహ్లీ రికార్డును సమం చేశాడు.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion