News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

GT vs PBKS: మార్పుల్లేని జట్లు! మయాంక్‌ అంత కాన్ఫిడెంటా? టాస్‌ గెలిచిన హార్దిక్‌

IPL 2022: ఐపీఎల్‌ 2022లో 48వ మ్యాచులో పంజాబ్‌ కింగ్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ టాస్‌ గెలిచింది. వెంటనే ఆ జట్టు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.

FOLLOW US: 
Share:

IPL 2022 Gujarat Titans opt to bat against punjab kings match 48 in dy patil stadium: ఐపీఎల్‌ 2022లో 48వ మ్యాచులో పంజాబ్‌ కింగ్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ టాస్‌ గెలిచింది. వెంటనే ఆ జట్టు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. మంచు పెద్దగా ప్రభావం చేయకపోవచ్చని పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను బౌలింగ్‌ చేయగలిగే సామర్థ్యంతో ఉన్నానని వెల్లడించాడు. ఇప్పటికే జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో 2-3 మ్యాచుల వరకు బౌలింగ్‌ చేయబోనని ప్రకటించాడు.

గుజరాత్‌ టైటాన్స్‌: శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహా, సాయి సుదర్శన్‌, హార్దిక్‌ పాండ్య, డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాతియా, రషీద్‌ ఖాన్, అల్జారీ జోసెఫ్‌, లాకీ ఫెర్గూసన్‌, మహ్మద్‌ షమి, ప్రదీప్‌ సంగ్వాన్‌

పంజాబ్‌ కింగ్స్‌: శిఖర్ ధావన్‌, మయాంక్‌ అగర్వాల్‌, భానుక రాజపక్స, జానీ బెయిర్‌స్టో, లియామ్‌ లివింగ్‌స్టన్‌, జితేశ్ శర్మ, రిషి ధావన్‌, కాగిసో రబాడా, రాహుల్‌ చాహర్‌, అర్షదీప్‌ సింగ్‌, సందీప్‌ శర్మ

2 పాయింట్లు వస్తే ప్లేఆఫ్స్‌

ప్రస్తుతం గుజరాత్‌ టైటాన్స్‌ (GT) ఎదురే లేకుండా ఉంది. ఆడిన 9 మ్యాచుల్లోనే 8 గెలిచి 16 పాయింట్లతో నంబర్‌వన్‌ పొజిషన్లో ఉంది. మరో రెండు పాయింట్లు సాధిస్తే ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది. మరోవైపు పంజాబ్‌ కింగ్స్‌ 9 మ్యాచుల్లో 4 గెలిచి 5 ఓడింది. ఎనిమిదో స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్‌ చేరుకోవాలంటే ఇకపై వరుస విజయాలు అందుకోవాల్సి ఉంటుంది. ఈ సీజన్లో వీరిద్దరూ తలపడ్డ మొదటి మ్యాచులో టైటాన్స్‌ చివరి బంతికి గెలిచింది. ఆఖరి రెండు బంతుల్లో 12 పరుగులు అవసరం కాగా రాహుల్‌ తెవాతియా వరుసగా రెండు సిక్సర్లు బాదేసి పంజాబ్‌కు గుండెకోత మిగిల్చాడు.

మూమెంటమే గుజరాత్‌ బలం

ఇప్పుడున్న మూమెంటమ్‌లో గుజరాత్‌కు ఉన్న వీక్‌నెస్‌లు బయటపడటం లేదు! వాస్తవంగా బ్యాటింగ్‌ డిపార్ట్‌మెంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. శుభ్‌మన్‌ గిల్‌ ఫామ్‌లో లేడు. వన్‌డౌన్‌లో ఎవరొస్తారో తెలియడం లేదు. అయితే రాహుల్ తెవాతియా, డేవిడ్‌ మిల్లర్‌, రషీద్‌ ఖాన్‌ విలువైన ఇన్నింగ్సులు ఆడుతూ గెలిపిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా డేవిడ్‌ మిల్లర్‌ గుజరాత్‌కు ఒక ఇరుసులా పనిచేస్తున్నాడు. హ్యామ్‌స్ట్రింగ్‌ గాయంతో హార్దిక్‌ బౌలింగ్‌ చేయడం లేదు. అతడి స్థానంలో ఒక అదనపు బౌలర్‌ను తీసుకోవాల్సి రావడంతో ఒక బ్యాటర్‌ షార్ట్‌ అవుతున్నాడు. ఈ మ్యాచ్‌ గెలిచి ప్లేఆఫ్‌ కన్ఫామ్‌ అయితే బ్యాటింగ్లో చాలా ప్రయోగాలు చేసే అవకాశం ఉంది.

Published at : 03 May 2022 07:11 PM (IST) Tags: Hardik Pandya IPL 2022 Punjab Kings Mayank Agarwal Gujarat Titans IPL 2022 news dy patil IPL 2022 Live gt vs pbks preview gt vs pbks

ఇవి కూడా చూడండి

IPL 2024 Auction: ఎన్నికల ఫలితాల హీట్‌లో కూల్ న్యూస్ చెప్పిన బీసీసీఐ - ఐపీఎల్ 2024 వేలం తేదీ ప్రకటించిన బోర్డు!

IPL 2024 Auction: ఎన్నికల ఫలితాల హీట్‌లో కూల్ న్యూస్ చెప్పిన బీసీసీఐ - ఐపీఎల్ 2024 వేలం తేదీ ప్రకటించిన బోర్డు!

IPL 2024 Retention List: రాకపోకలు ముగిశాక, ప్రాంఛైజీల పరిస్థితి ఇలా ఉంది

IPL 2024 Retention List: రాకపోకలు ముగిశాక, ప్రాంఛైజీల పరిస్థితి ఇలా ఉంది

IPL 2024 : ముంబై గూటికి హార్దిక్‌ పాండ్యా , రెండు గంటల్లోఇన్ని ట్విస్ట్‌లా..?

IPL 2024 : ముంబై గూటికి హార్దిక్‌ పాండ్యా , రెండు గంటల్లోఇన్ని ట్విస్ట్‌లా..?

IPL 2024 Retentions: ఐపీఎల్‌లో జట్లు వదులుకున్న ఆటగాళ్లు , షాక్‌ ఇచ్చిన కొందరి ఆటగాళ్ల రిలీజ్‌

IPL 2024 Retentions: ఐపీఎల్‌లో జట్లు వదులుకున్న ఆటగాళ్లు , షాక్‌ ఇచ్చిన కొందరి ఆటగాళ్ల రిలీజ్‌

IPL 2024: ఐపీఎల్‌ సందడి ఎప్పటినుంచంటే.? - వేలానికి సమీపిస్తున్న గడువు

IPL 2024:  ఐపీఎల్‌ సందడి ఎప్పటినుంచంటే.? - వేలానికి సమీపిస్తున్న గడువు

టాప్ స్టోరీస్

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Telangana Cabinet :  హోంమంత్రిగా ఉత్తమ్  - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?