News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

RR Vs DC Highlights: రాజస్తాన్‌పై రెచ్చిపోయిన మార్ష్ - రాయల్స్‌పై ఢిల్లీ విక్టరీ - మెరుగైన ప్లేఆఫ్స్ అవకాశాలు!

ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

FOLLOW US: 
Share:

ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు మరో ఓటమి. బుధవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ 18.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిషెల్ మార్ష్ (89: 62 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా... డేవిడ్ వార్నర్ (52 నాటౌట్: 41 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీ సాధించాడు. ఈ విజయంతో ఢిల్లీ ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగయ్యాయి.

పడుతూ, లేస్తూ...
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న జోస్ బట్లర్ (7: 11 బంతుల్లో, ఒక ఫోర్) మూడో ఓవర్లోనే అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే యశస్వి జైస్వాల్ (19: 19 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) కూడా పెవిలియన్ బాట పట్టాడు. వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్ (50: 38 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), దేవ్‌దత్ పడిక్కల్ (48: 30 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 53 పరుగులు జోడించారు.

వీరి తర్వాత వచ్చిన వారంతా విఫలం కావడంతో రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా, ఆన్రిచ్ నోర్జే, మిషెల్ మార్ష్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.

ఎక్కడా తడబడకుండా...
161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మొదటి ఓవర్లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండో బంతికే ఓపెనర్ కేఎస్ భరత్‌ను (0: 2 బంతుల్లో) అవుట్ చేసి బౌల్ట్ మొదటి వికెట్‌ను దక్కించుకున్నాడు. అయితే ఇక్కడ మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు మిషెల్ మార్ష్ జతకలిశాడు.

మిషెల్ మార్ష్ ఒక ఎండ్‌లో వేగంగా ఆడగా... మరోవైపు డేవిడ్ వార్నర్ తనకు చక్కటి సహకారాన్ని అందించాడు. వీరిద్దరూ రాజస్తాన్ బౌలర్లకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. రెండో వికెట్‌కు 144 పరుగులు జోడించాక విజయానికి చేరువలో మిషెల్ మార్ష్ అవుటయ్యాడు. అయితే రిషబ్ పంత్ (13 నాటౌట్: 4 బంతుల్లో, రెండు సిక్సర్లు) రెండు సిక్సర్లతో మ్యాచ్‌ను మరింత తొందరగా ముగించాడు. యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్ చెరో వికెట్ తీసుకున్నారు.

Published at : 11 May 2022 11:17 PM (IST) Tags: IPL Delhi Capitals DC IPL 2022 RR Rajasthan Royals rr vs dc rr vs dc highlights RR Vs DC Match Highlights

ఇవి కూడా చూడండి

R Ashwin: 'ఐపీఎల్‌ వార్‌ఫేర్‌'పై స్పందించిన యాష్‌ - NO 4పై చర్చే వద్దన్న లెజెండ్‌

R Ashwin: 'ఐపీఎల్‌ వార్‌ఫేర్‌'పై స్పందించిన యాష్‌ - NO 4పై చర్చే వద్దన్న లెజెండ్‌

Gautam Gambhir: లక్నో స్ట్రాటజిక్‌ కన్సల్టెంట్‌గా ఎమ్మెస్కే! మెంటార్‌ పదవికి గంభీర్ రిజైన్‌ చేస్తున్నాడా!

Gautam Gambhir: లక్నో స్ట్రాటజిక్‌ కన్సల్టెంట్‌గా ఎమ్మెస్కే! మెంటార్‌ పదవికి గంభీర్ రిజైన్‌ చేస్తున్నాడా!

IPL 2024: 2024 ఐపీఎల్ విదేశాల్లో జరుగుతుందా? - లోక్‌సభ ఎన్నికలే కారణమా?

IPL 2024: 2024 ఐపీఎల్ విదేశాల్లో జరుగుతుందా? - లోక్‌సభ ఎన్నికలే కారణమా?

Yuzvendra Chahal: ఆర్సీబీ మీద చాలా కోపమొచ్చింది, నమ్మించి మోసం చేశారు: చాహల్ సంచలన వ్యాఖ్యలు

Yuzvendra Chahal: ఆర్సీబీ మీద చాలా కోపమొచ్చింది, నమ్మించి మోసం చేశారు: చాహల్ సంచలన వ్యాఖ్యలు

MS Dhoni: న్యూ లుక్‌లో ధోని - ఐపీఎల్ గెలిచాక తొలిసారి చెన్నైకి తలా - ఆ సినిమా ప్రమోషన్ కోసమేనా?

MS Dhoni: న్యూ లుక్‌లో ధోని - ఐపీఎల్ గెలిచాక తొలిసారి చెన్నైకి తలా - ఆ సినిమా ప్రమోషన్ కోసమేనా?

టాప్ స్టోరీస్

Supreme Court: చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో మరో బెంచ్‌కు

Supreme Court: చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో మరో బెంచ్‌కు

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌కు పోలీసుల నుంచి నోటీసులు

Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌కు పోలీసుల నుంచి నోటీసులు

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో