IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

IPL 2022 DC vs MI Preview: అన్నాదమ్ముల ఫైట్‌! మరి నెగ్గేది తమ్ముడు పంతా? అన్న రోహితా?

DC vs MI: ఐపీఎల్‌ 2022లో రెండో మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals), ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) బ్రబౌర్న్‌ స్టేడియంలో తలపడనున్నాయి. మరి ఈ సీజన్లో విన్నింగ్‌ స్టార్ట్‌ ఎవరు చేయబోతున్నారు? ఏ జట్టు బలాబలాలేంటి?

FOLLOW US: 

IPL 2022 DC vs MI match Preview: ఐపీఎల్‌ 2022లో రెండో మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals), ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) బ్రబౌర్న్‌ స్టేడియంలో తలపడనున్నాయి. ఇవి రెండూ మంచి జట్లే కావడం, ఆకర్షణీయమైన ఆటగాళ్లు ఉండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పైగా దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant), ముంబయి సారథి రోహిత్‌ శర్మది (Rohit sharma) అన్నాదమ్ముల అనుబంధం! మరి ఈ సీజన్లో విన్నింగ్‌ స్టార్ట్‌ ఎవరు చేయబోతున్నారు? ఏ జట్టు బలాబలాలేంటి? తుది జట్లలో ఎవరెవరు ఉండబోతున్నారు?

Delhi Capitas vs Mumbai Indians హోరాహోరీ

ఐపీఎల్‌లో ముంబయి, దిల్లీ మధ్య ప్రతిసారీ నువ్వా నేనా అన్నట్టే ఫైట్‌ జరుగుతుంది. ఇవి రెండు ఇప్పటి వరకు 30 మ్యాచుల్లో తలపడగా 16 సార్లు ముంబయి, 14 సార్లు దిల్లీ గెలిచింది. చివరి ఐదు మ్యాచుల్లో ముంబయి 3-2తో ఆధిక్యంలో ఉంది. కానీ 2021లో ఆడిన రెండు మ్యాచుల్లో రిషభ్‌ సేన 5 బంతులు మిగిలుండగానే విజయం సాధించడం గమనార్హం.

Delhi capitas కాస్త స్ట్రాంగే!

మైటీ ముంబయితో పోలిస్తే ఈసారి దిల్లీనే కాస్త స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది! కుర్రాళ్లు, సీనియర్ల మేళవింపుతో బాగుంది. కెప్టెన్‌ రిషభ్ పంత్‌ డిస్ట్రక్టివ్‌ ఫామ్‌లో ఉన్నాడు. పృథ్వీ షా (Prithvi Shaw) మెరుగైన ఓపెనింగ్స్‌ ఇవ్వగలడు. ఆన్రిచ్‌ నార్జ్‌ (Anrich Nortje) ఇంకా అందుబాటులోకి రాకపోవడం బలహీనతే! డేవిడ్‌ వార్నర్‌ (David Warner), మిచెల్‌ మార్ష్‌ (Mitchel Marsh) వచ్చేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. ఆ లోపు అక్షర్‌ పటేల్‌ (Axar patel), శ్రీకర్ భరత్‌, టిమ్‌ సీఫెర్ట్‌, శార్దూల్‌ ఠాకూర్‌ (Shardhul Thakur), రోమన్‌ పావెల్‌ అవసరాలు తీరుస్తారు. చేతన్‌ సకారియా, శార్దూల్‌, ముస్తాఫిజుర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌ వంటి బౌలర్లు బాగున్నారు. విదేశీ ఆటగాళ్లు వస్తే జట్టుకు సమతూకం వస్తుంది.

Mumbai Indians లోకల్‌ బాయ్స్‌!

ముంబయి ఇండియన్స్‌ పటిష్ఠంగానే కనిపిస్తున్న కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. రోహిత్‌ శర్మ కెప్టెన్సీ వీరికి అతిపెద్ద ప్లస్‌ పాయింట్‌. కీరన్‌ పొలార్డ్‌ (Pollard), జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah), ఇషాన్‌ కిషన్‌ (Ishan kishan), సూర్యకుమార్‌ యాదవ్‌ (Surya kumar yadav) వీరికి అత్యంత కీలకం. గాయం కారణంగా సూర్య అందుబాటులో ఉండటం కష్టమే! అతడి ప్లేస్‌లో తిలక్‌ వర్మ ఆడతాడు. ఒకప్పటిలా వీరి మిడిలార్డర్‌ లేదు. పాండ్య బ్రదర్స్‌ లోటును తీర్చలేరు. ఈసారి బేబీ ఏబీడీ, టిమ్‌ డేవిడ్‌, డేనియల్‌ సామ్స్‌ మిడిలార్డర్‌లో ఉంటారు. బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్లో బుమ్రా, తైమల్‌ మిల్స్‌, జయదేవ్‌ ఉనద్కత్‌ కీలకం. మురుగన్‌ అశ్విన్‌, మయాంక్‌ మార్కండె రూపంలో స్పిన్నర్లు ఉన్న వీరికి ఎక్కువ ఎక్స్‌పోజర్‌ లేదు. ప్రైస్‌ ట్యాగ్‌ ఇషాన్‌పై ప్రభావం చూపొచ్చు!

Brabourne stadiumలో పేసర్లదే రాజ్యం

బ్రబౌర్న్‌ లేదా సీసీఐలో 2015 నుంచి టీ20 మ్యాచులు జరగలేదు. ఇక్కడా ఎర్రమట్టితోనూ పిచ్‌ను రూపొందించారు. అయితే ఆఖరి తొమ్మిది మ్యాచుల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లే ఆరు సార్లు గెలిచాయి. తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 173. ఈ పిచ్‌ కూడా పేసర్లకు అనుకూలిస్తుంది. 2019 ఐపీఎల్‌ నుంచి చూసుకుంటే పవర్‌ప్లేలో పేసర్లు వికెట్ల పండగ చేసుకుంటారు. ఇక్కడ పేసర్లు 33 సగటుతో 44 వికెట్లు తీస్తే స్పిన్నర్లు 1 వికెట్‌ తీశారు. ఇన్నాళ్లూ ఇక్కడ మ్యాచులు జరగలేదు కాబట్టి మున్ముందు పిచ్‌ ఎలా ప్లే చేస్తుందో తెలియదు. ఎర్రమట్టి పిచ్‌ కాబట్టి పేస్‌, బౌన్స్‌ బాగుంటుంది.

Published at : 26 Mar 2022 07:56 PM (IST) Tags: IPL Rohit Sharma Rishabh Pant IPL 2022 Indian Premier League David Warner IPL 2022 Schedule IPL 2022 news ipl season 15 DC Playing XI IPL 2022 Live Delhi capitals vs mumbai indians dc vs mi dc vs mi prediction mi playing xi dc vs mi match preview

సంబంధిత కథనాలు

SRH Vs PBKS Highlights: ఐపీఎల్‌ను ఓటమితో ముగించిన రైజర్స్ - ఐదు వికెట్లతో పంజాబ్ విజయం!

SRH Vs PBKS Highlights: ఐపీఎల్‌ను ఓటమితో ముగించిన రైజర్స్ - ఐదు వికెట్లతో పంజాబ్ విజయం!

SRH Vs PBKS: తడబడ్డ సన్‌రైజర్స్ - పంజాబ్ ముందు ఈజీ టార్గెట్!

SRH Vs PBKS: తడబడ్డ సన్‌రైజర్స్ - పంజాబ్ ముందు ఈజీ టార్గెట్!

IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?

IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?

SRH Vs PBKS Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ - ఎవరికీ ఉపయోగం లేని మ్యాచ్!

SRH Vs PBKS Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ - ఎవరికీ ఉపయోగం లేని మ్యాచ్!

MI vs DC: ముంబయి గెలవగానే కోహ్లీ ఎమోషన్‌ చూడండి! ఆర్సీబీ డెన్‌లో అరుపులు, కేకలు!

MI vs DC: ముంబయి గెలవగానే కోహ్లీ ఎమోషన్‌ చూడండి! ఆర్సీబీ డెన్‌లో అరుపులు, కేకలు!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Breaking News Live Updates : మాజీ ఎంపీ రేణుక చౌదరి పై కేసు నమోదు!

Breaking News Live Updates : మాజీ ఎంపీ రేణుక చౌదరి పై కేసు నమోదు!

Whatsapp End Support: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!

Whatsapp End Support: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!

CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్‌ ఇంటలిజెన్స్‌ పాఠాలు- టెక్‌ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్‌లో బిగ్‌ డీల్

CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్‌ ఇంటలిజెన్స్‌ పాఠాలు- టెక్‌ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్‌లో బిగ్‌ డీల్

Minister Harish Rao : కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు, డబ్బులడిగిన డాక్టర్ పై వేటు!

Minister Harish Rao : కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు, డబ్బులడిగిన డాక్టర్ పై వేటు!