అన్వేషించండి

IPL 2022, CSK vs RCB: 4 ఓడిన చెన్నై ఇప్పుడైనా బోణీ కొడుతుందా? బెంగళూరుకు 4 విక్టరీ దక్కుతుందా?

IPL 2022, CSK vs RCB: ఐపీఎల్‌ 2022లో 22వ మ్యాచులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Superkings), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) తలపడుతున్నాయి. మరి వీరిలో ఏ జట్టుది ఆధిపత్యం?

ఐపీఎల్‌ 2022లో 22వ మ్యాచులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Superkings), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) తలపడుతున్నాయి. డీవై పాటిల్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతోంది. ఒకవైపు చెన్నై వరుసగా నాలుగు మ్యాచులు ఓడి ఆత్మవిశ్వాసం కోల్పోయింది. మరోవైపు వరుస విజయాలతో బెంగళూరు దుమ్మురేపుతోంది. మరి వీరిలో ఏ జట్టుది ఆధిపత్యం? తుది జట్టులో ఎవరుంటారు? గెలిచేదెవరు?

డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెట్టిన చెన్నై సూపర్‌కింగ్స్‌ (CSK)కు ఈ సారి తిరుగులేదనుకున్నారు. కానీ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓడి ఆత్మవిశ్వాసం కోల్పోయింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad) పూర్తిగా విఫలమవుతున్నాడు. మధ్య ఓవర్లలో పరుగులు ఎక్కువగా చేయడం లేదు. ఒకరిద్దరు ఆటగాళ్లు ఔటైతే ఒత్తిడికి లోనవుతున్నారు. బౌలింగ్‌ లోనూ అంతే! దీపక్‌ చాహర్‌ (Deepak Chahar) లోటు బాగా తెలుస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌ ఓడిపోయిన ఆర్‌సీబీ (RCB) ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచులు గెలిచి హ్యాట్రిక్‌ అందుకుంది. బౌలింగ్, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లో దుమ్ము రేపుతోంది. ఆటగాళ్లు కసిగా ఆడుతున్నారు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో చెన్నై, బెంగళూరు (CSK vs RCB) మ్యాచులంటే అభిమానులకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే ఎంఎస్‌ ధోనీ (MD Dhoni), విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఎదురెదురుగా తలపడేవారు. ఈ రెండు జట్లలో సీఎస్‌కేదే పైచేయి. ఇప్పటి వరకు చెన్నై, బెంగళూరు 28 సార్లు తలపడితే 18సార్లు ధోనీసేనే గెలిచింది. కేవలం 9 సార్లు మాత్రమే బెంగళూరును విజయం వరించింది. చివరగా ఆడిన ఐదు మ్యాచుల్లోనూ చెన్నై 3-2తో ఆధిక్యంలో ఉంది. మానసికంగా సీఎస్‌కేదే ఆధిపత్యం అయినా ఈ సారి జోష్‌ మాత్రం బెంగళూరులో ఉంది.

CSK vs RCB Probable XI

చెన్నై సూపర్‌ కింగ్స్‌: రాబిన్‌ ఉతప్ప, రుతురాజ్‌ గైక్వాడ్‌, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోనీ, డ్వేన్‌ బ్రావో, డ్వేన్‌ ప్రిటోరియస్‌, క్రిస్‌ జోర్డాన్‌, ముకేశ్‌ చౌదరీ/ తుషార్‌ దేశ్‌పాండే

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: డుప్లెసిస్‌, అనూజ్‌ రావత్‌, విరాట్‌ కోహ్లీ, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, దినేశ్ కార్తీక్‌, షాబాజ్‌ అహ్మద్‌, డేవిడ్‌ విల్లే, వనిందు హసరంగ, సిద్ధార్థ్‌ కౌల్‌, మహ్మద్‌ సిరాజ్‌, అకాశ్‌ దీప్‌

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

దేశం గర్వించేలా చేసిన అమ్మాయిలు.. టీమిండియా విజయంపై ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్ ప్రశంసలు
దేశం గర్వించేలా చేసిన అమ్మాయిలు.. టీమిండియా విజయంపై ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్ ప్రశంసలు
KTR on Hydra Demolitions: ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లను కూడా రేవంత్ రెడ్డి కూల్చేశాడు - హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్
ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లను కూడా రేవంత్ రెడ్డి కూల్చేశాడు - హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్
Jodhpur Road Accident: లారీని ఢీకొట్టిన టెంపో.. 15 మంది మృతితో తీవ్ర విషాదం.. సీఎం భజన్‌లాల్ దిగ్భ్రాంతి
జోధ్‌పూర్‌లో లారీని ఢీకొట్టిన టెంపో.. 15 మంది మృతితో తీవ్ర విషాదం.. సీఎం భజన్‌లాల్ దిగ్భ్రాంతి
Chandrababu In London: సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
Advertisement

వీడియోలు

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటోడ్రైవర్లుకు అన్యాయం జరుగుతోందా.. వాస్తవాలేంటి..!?
బాదుడే బాదుడు.. అమ్మాయిలూ మీరు సూపర్!
India vs South Africa | Women World Cup Final | నేడే వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్
Womens World Cup Final | ఫైనల్‌కు వర్షం ముప్పు
SSMB29 Twitter | Mahesh Babu - Rajamouli | SSMB 29పై మహేష్, జక్కన్న ట్వీట్ వార్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
దేశం గర్వించేలా చేసిన అమ్మాయిలు.. టీమిండియా విజయంపై ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్ ప్రశంసలు
దేశం గర్వించేలా చేసిన అమ్మాయిలు.. టీమిండియా విజయంపై ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్ ప్రశంసలు
KTR on Hydra Demolitions: ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లను కూడా రేవంత్ రెడ్డి కూల్చేశాడు - హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్
ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లను కూడా రేవంత్ రెడ్డి కూల్చేశాడు - హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్
Jodhpur Road Accident: లారీని ఢీకొట్టిన టెంపో.. 15 మంది మృతితో తీవ్ర విషాదం.. సీఎం భజన్‌లాల్ దిగ్భ్రాంతి
జోధ్‌పూర్‌లో లారీని ఢీకొట్టిన టెంపో.. 15 మంది మృతితో తీవ్ర విషాదం.. సీఎం భజన్‌లాల్ దిగ్భ్రాంతి
Chandrababu In London: సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
Attack on BRS Office: మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
Rashmika Mandanna: శారీలో గర్ల్ ఫ్రెండ్... సారీ సారీ నేషనల్ క్రష్ రష్మిక
శారీలో గర్ల్ ఫ్రెండ్... సారీ సారీ నేషనల్ క్రష్ రష్మిక
Jogi Ramesh Arrest: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
Telugu TV Movies Today: రజనీకాంత్ ‘శివాజీ’, పవన్ కళ్యాణ్ ‘బద్రి’ TO రాజశేఖర్ ‘మా అన్నయ్య బంగారం’, రామ్ ‘రెడీ’ వరకు- ఈ సోమవారం (నవంబర్ 03) టీవీలలో వచ్చే సినిమాలివే
రజనీకాంత్ ‘శివాజీ’, పవన్ కళ్యాణ్ ‘బద్రి’ TO రాజశేఖర్ ‘మా అన్నయ్య బంగారం’, రామ్ ‘రెడీ’ వరకు- ఈ సోమవారం (నవంబర్ 03) టీవీలలో వచ్చే సినిమాలివే
Embed widget