అన్వేషించండి

IPL 2022: ఐపీఎల్‌ బుడగ బ్రేక్‌ చేస్తే కోటి ఫైన్‌ కట్టాల్సిందే! ఇంకా ఎలాంటి శిక్షలు ఉన్నాయంటే?

IPL bubble breach: కొవిడ్‌ రూల్స్ అతిక్రమిస్తే ఈసారి కఠిన చర్యలు తప్పవు. బీసీసీఐ భారీగా ఫైన్లు వేయనుంది.

IPL Bubble breach protocols to attract serious sanctions: కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించేవారిపై బీసీసీఐ (BCCI) ఈ సారి కఠిన చర్యలు తీసుకోనుంది. ఆటగాళ్లపై ఒక మ్యాచ్‌ నిషేధం విధించడమే కాకుండా ఏడు రోజులు తిరిగి క్వారంటైన్‌కు (Re quarantine) పంపించనున్నారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులకూ ఈసారి శిక్షలున్నాయి. మార్చి 26 నుంచి ఐపీఎల్‌ 15వ సీజన్‌ మొదలవుతోంది. తొలి మ్యాచులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, రన్నరప్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడనున్న సంగతి తెలిసిందే.

ఏదైనా జట్టు ఉద్దేశపూర్వకంగా ఔట్‌సైడర్‌ను బయో బుడగలోకి  (IPL bio secure bubble) అనుమతిస్తే తొలి తప్పిదం  కింద కోటి రూపాయిలు జరిమానా విధిస్తారు. మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తే ఆ జట్టు పాయింట్లలో ఒకటి లేదా రెండు కోత విధిస్తారు. ఆటగాళ్లు, జట్టు అధికారులు, మ్యాచ్‌ అధికారులు టేబుల్‌ ఏలోని శిక్షలకు గురవుతారు. వీరిలో ఎవరైనా తొలిసారి తప్పు చేస్తే ఏడు రోజులు రీ క్వారంటైన్‌ విధిస్తారు. పైగా మిస్సైన మ్యాచులకు డబ్బులు చెల్లించరు. రెండోసారి తప్పు చేస్తే ఏడు రోజుల క్వారంటైన్‌ పూర్తయ్యాక ఒక మ్యాచ్‌ నుంచి సస్పెండ్‌ చేస్తారు. మూడోసారి అయితే జట్టు నుంచి తొలగిస్తారు. రీప్లేస్‌మెంట్‌ అనుమతించరు.

ఆటగాళ్లు, అధికారుల కుటుంబ సభ్యులకూ ఇలాంటి శిక్షలే ఉన్నాయి. ఐపీఎల్‌ 2022 బయో బబుల్‌ను అతిక్రమిస్తే కుటుంబ సభ్యులకు ఏడు రోజుల క్వారంటైన్‌ విధిస్తారు. సంబంధిత ఆటగాడు, అధికారికి కూడా క్వారంటైన్‌ తప్పదు. పైగా ఎలాంటి వేతనం చెల్లించరు. రెండోసారి తప్పు చేస్తే ఆ కుటుంబ సభ్యులను ఇకపై మళ్లీ బుడగలో అడుగుపెట్టనివ్వరు. సంబంధిత ఆటగాడికి రీక్వారంటైన్‌ తప్పదు.

ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు క్వారంటైన్‌ పూర్తవ్వని వ్యక్తిని బయో బుడగలోకి అనుమతించి ఆటగాళ్లు, సహాయ బృందాన్ని కలవనివ్వడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. కరోనా టెస్టులకు హాజరవ్వకుండా తప్పించుకోవడమూ తప్పిదం కిందకే వస్తుంది. ఇలాంటప్పుడు మొదటి తప్పుకు ఆ ఫ్రాంచైజీ కోటి రూపాయిలు ఫైన్‌ కట్టాల్సి ఉంటుంది. రెండోసారి ఒక పాయింటు, మూడోసారి, ఆ తర్వాత ప్రతిసారీ రెండు పాయింట్ల చొప్పున కోత విధిస్తారు.

ఆటగాళ్లు, కుటుంబ సభ్యులలో ఎవరైనా కొవిడ్‌ టెస్టులు మిస్సయితే తొలి తప్పిదం కింద హెచ్చరిస్తారు. రూ.75000 జరిమానా విధిస్తారు. మరోసారి టెస్టు చేసేంత వరకు స్టేడియం, సాధన శిబిరాలకు అనుమతించరు. గతేడాది బయో బబుల్‌ బ్రేకై కరోనా సోకడంతో ఈసారి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

DCP Vineet With ABP Desam: న్యూఇయర్ వేళ మందుబాబులూ బీకేర్ ఫుల్ - డ్రగ్స్ తీసుకుంటే 15 నిమిషాల్లోనే అరెస్ట్, ఏబీపీ దేశంతో డీసీపీ వినీత్
న్యూఇయర్ వేళ మందుబాబులూ బీకేర్ ఫుల్ - డ్రగ్స్ తీసుకుంటే 15 నిమిషాల్లోనే అరెస్ట్, ఏబీపీ దేశంతో డీసీపీ వినీత్
Happy New Year 2025: అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
SCR: 'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
Dil Raju Reply To KTR:   చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP DesamVizag Dolphin Pool Cricket Ground | విశాఖలో డాల్ఫిన్ పూల్ క్రికెట్ గ్రౌండ్ తెలుసా.? | ABP DesamADR Report on Chief Ministers Assets | దేశంలోనే నిరుపేద ముఖ్యమంత్రి ఈమె

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DCP Vineet With ABP Desam: న్యూఇయర్ వేళ మందుబాబులూ బీకేర్ ఫుల్ - డ్రగ్స్ తీసుకుంటే 15 నిమిషాల్లోనే అరెస్ట్, ఏబీపీ దేశంతో డీసీపీ వినీత్
న్యూఇయర్ వేళ మందుబాబులూ బీకేర్ ఫుల్ - డ్రగ్స్ తీసుకుంటే 15 నిమిషాల్లోనే అరెస్ట్, ఏబీపీ దేశంతో డీసీపీ వినీత్
Happy New Year 2025: అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
SCR: 'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
Dil Raju Reply To KTR:   చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
New Year 2025: న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
Crime News: ఆ బిడ్డ తనకు పుట్టలేదని అనుమానం - 9 నెలల చిన్నారికి యాసిడ్ తాగించేశాడు, ఒంగోలులో దారుణం
ఆ బిడ్డ తనకు పుట్టలేదని అనుమానం - 9 నెలల చిన్నారికి యాసిడ్ తాగించేశాడు, ఒంగోలులో దారుణం
5000 Note in New Year: 2025లో  రూ. 5వేల నోటు రిలీజ్ - ఆర్బీఐ వర్గాలు ఇస్తున్న క్లారిటీ ఇదే
2025లో రూ. 5వేల నోటు రిలీజ్ - ఆర్బీఐ వర్గాలు ఇస్తున్న క్లారిటీ ఇదే
Embed widget