IPL 2022 Auction: అనుభవం లేని సమద్‌, ఉమ్రాన్‌కు సన్‌రైజర్స్‌ రూ.4 కోట్లు ఎందుకిస్తోంది! విలియమ్సన్‌ది సరైన ధరేనా?

IPL Auction 2022 SRH Retained Players: రెండు సీజన్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ స్థాయికి తగ్గ ప్రదర్శన లేదు. ఐపీఎల్‌ మెగా వేలం ముందు ఆటగాళ్లందరినీ పంపించేసింది. కేవలం ఒక సీనియర్‌, ఇద్దరు కుర్రాళ్లను రీటెయిన్‌ చేసుకుంది. వారినే ఎందుకు తీసుకుందంటే..!

FOLLOW US: 

IPL Auction 2022 SRH Retained Players: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో తనదైన ముద్ర వేసిన జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. 2016లో విజేతగా ఆవిర్భవించిన ఈ తెలుగు ఫ్రాంచైజీ ఆ తర్వాత ఫైనల్‌ చేరుకొని సత్తా చాటింది. లేదంటే కనీసం ప్లేఆఫ్స్‌కు వెళ్తూ అలరించింది. అలాంటిది గత రెండు సీజన్లలో స్థాయికి తగ్గ ప్రదర్శన లేదు. ఐపీఎల్‌ మెగా వేలం ముందు ఆటగాళ్లందరినీ పంపించేసింది. కేవలం ఒక సీనియర్‌, ఇద్దరు కుర్రాళ్లను రీటెయిన్‌ చేసుకుంది. వారినే ఎందుకు తీసుకుందంటే..!

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అంటే బౌలింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే జట్టు! కొన్నేళ్లుగా ఆ బృందాన్ని చూస్తే ఇదే అర్థమవుతుంది. టాప్‌ ఆర్డర్లో మంచి బ్యాటర్లను తీసుకునే ఈ ఫ్రాంచైజీ బౌలింగ్‌లో మాత్రం వజ్రాలను వెలికి తీస్తుంది. భువనేశ్వర్‌ కుమార్‌, సందీప్ శర్మ, రషీద్‌ ఖాన్‌ ఇందుకు ఉదాహరణ. వేలం కారణంగా కేవలం నలుగురిని మాత్రమే రీటెయిన్‌ చేసుకొనే అవకాశమిచ్చింది ఐపీఎల్‌ కమిటీ. ఈ నేపథ్యంలో సీనియర్లను హైదరాబాద్‌ పక్కన పెట్టేసింది. నాయకత్వం కోసం కేన్‌ విలియమ్సన్‌, యువ హిట్టర్‌ అబ్దుల్‌ సమద్‌, పేస్‌గన్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ను మాత్రమే అట్టిపెట్టుకుంది.

Kane Williamson బెస్ట్‌ కెప్టెన్‌

కేన్‌ విలియమ్సన్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అతడి బ్యాటింగ్‌ ఎంత కళాత్మకంగా ఉంటుందో నాయకత్వం అంతకన్నా మెరుగ్గా ఉంటుంది. మ్యాచ్‌ గమనాన్ని బట్టి పరిస్థితులు మార్చేయడంలో అతడు దిట్ట. బ్యాటింగ్‌ చేస్తుంటే విధ్వంసం జరగనట్టే కనిపిస్తుంది. కానీ స్కోరుబోర్డుపై పరుగులు మాత్రం పెరుగుతుంటాయి. సరైన సమయంలో బౌలర్లను మార్పు చేస్తూ వికెట్లు రాబడుతుంటాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 63 మ్యాచులాడిన విలియమ్సన్‌ 40.10 సగటు, 131 స్ట్రైక్‌రేట్‌తో 1885 పరుగులు చేశాడు. 17 అర్ధశతకాలు ఉన్నాయి. 2018లో 17 మ్యాచుల్లోనే 735 పరుగులు చేయడం గమనార్హం. రూ.14 కోట్లతో హైదరాబాద్‌ అతడిని రీటెయిన్‌ చేసుకుంది.

Abdul samad హార్డ్‌ హిట్టర్‌
 
దేశవాళీ క్రికెట్లతో తన సిక్సర్లతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాడు అబ్దుల్‌ సమద్‌. సాధారణంగా జమ్ము కశ్మీర్‌ నుంచి ఎక్కువ మంది క్రికెటర్లు రారు. కానీ తన ప్రతిభతో సన్‌రైజర్స్‌ యాజమాన్యాన్ని మెప్పించాడు సమద్‌. మొత్తంగా 44 టీ20ల్లో 28 సగటు, 145 స్ట్రైక్‌రేట్‌తో 729 పరుగులు చేశాడు. అతడు స్వింగ్‌లో ఉంటే బ్యాటు నుంచి సునాయంగా సిక్సర్లు వచ్చేస్తాయి. ఇక అవసరమైనప్పుడు తన లెగ్‌బ్రేక్‌ బౌలింగ్‌తోనూ జట్టుకు ఉపయోగపడతాడు. 4 వికెట్లు కూడా తీశాడు. సన్‌రైజర్స్‌ ఇతడికి రూ.4 కోట్లు చెల్లిస్తోంది.

Umran malik భీకరమైన వేగం

ఆడింది 3 మ్యాచులే! తీసింది 2 వికెట్లే! అనుభవమే లేని ఉమ్రాన్‌ మాలిక్‌ కోసం రూ.4 కోట్లు చెల్లిస్తోంది హైదరాబాద్‌. ఎందుకంటే అతడు నిలకడగా 150+ కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తున్నాడు మరి. గత సీజన్లో విచిత్రంగా అతడికి జట్టులో చోటు లభించింది. కరోనా వల్ల ఓ సీనియర్‌ బౌలర్‌ అందుబాటులో లేకపోవడంతో నెట్‌ బౌలర్‌గా ఉన్న ఉమ్రాన్‌ జట్టులోకి వచ్చాడు. రావడంతోనే భీకరమైన పేస్‌తో ప్రత్యర్థులను వణికించాడు. దాంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. నిజానికి అతడు వేలంలోకి వచ్చుంటే భారీ ధర పలికే అవకాశం ఉంది. అందుకే బాగా ఆలోచించిన సన్‌రైజర్స్‌ అతడిని అట్టిపెట్టుకొంది.

Published at : 11 Feb 2022 02:44 PM (IST) Tags: IPL SRH IPL 2022 Sunrisers Hyderabad Kane Williamson Umran Malik IPL 2022 Auction Abdul Samad SRH retained players list sunrisers hyderabad retained players

సంబంధిత కథనాలు

RR Vs RCB Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్స్ - బ్యాట్లతో సిద్ధం అవుతున్న బెంగళూరు!

RR Vs RCB Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్స్ - బ్యాట్లతో సిద్ధం అవుతున్న బెంగళూరు!

IPL 2022 Final: ఐపీఎల్‌ ఫైనల్‌.. మోదీ, షా భద్రతకు 6000 మంది పోలీసులు!

IPL 2022 Final: ఐపీఎల్‌ ఫైనల్‌.. మోదీ, షా భద్రతకు 6000 మంది పోలీసులు!

RR vs RCB, Qualifier 2: ఈ లెగ్‌ స్పిన్నర్ల దుంపతెగ! సంజూకు హసరంగ, డీకేకు యూజీ భయం!

RR vs RCB, Qualifier 2: ఈ లెగ్‌ స్పిన్నర్ల దుంపతెగ! సంజూకు హసరంగ, డీకేకు యూజీ భయం!

RR vs RCB Qualifier 2: మోతేరా అప్పట్లో రాయల్స్‌ అడ్డా! ఆర్సీబీ ఫుల్‌ జోష్‌లో ఉంది బిడ్డా!

RR vs RCB Qualifier 2: మోతేరా అప్పట్లో రాయల్స్‌ అడ్డా! ఆర్సీబీ ఫుల్‌ జోష్‌లో ఉంది బిడ్డా!

Sabbhineni Meghana: మహిళల ఐపీఎల్‌లో దంచికొట్టిన మేఘన! ఈ ఆంధ్రా అమ్మాయి స్పెషలిటీ తెలుసా?

Sabbhineni Meghana: మహిళల ఐపీఎల్‌లో దంచికొట్టిన మేఘన! ఈ ఆంధ్రా అమ్మాయి స్పెషలిటీ తెలుసా?

టాప్ స్టోరీస్

Vivo T2x 5G: రూ.11 వేలలోనే వివో 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!

Vivo T2x 5G: రూ.11 వేలలోనే వివో 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!

KTR Davos Tour : దావోస్ సదస్సు ద్వారా తెలంగాణకు రూ. 4200 కోట్ల పెట్టుబడులు - చివరి రోజూ కేటీఆర్ బిజీ మీటింగ్స్ !

KTR Davos Tour : దావోస్ సదస్సు ద్వారా తెలంగాణకు రూ. 4200 కోట్ల పెట్టుబడులు - చివరి రోజూ కేటీఆర్ బిజీ మీటింగ్స్ !

AP In Davos : దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !

AP In Davos :   దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !

US Monkeypox Cases : అమెరికాలో 9 మంకీపాక్స్ కేసులు - వేగంగా విస్తరిస్తోందని అగ్రరాజ్యం ఆందోళన

US Monkeypox Cases  :   అమెరికాలో 9 మంకీపాక్స్ కేసులు - వేగంగా విస్తరిస్తోందని అగ్రరాజ్యం ఆందోళన