By: ABP Desam | Updated at : 21 Feb 2023 05:53 PM (IST)
బీసీసీఐ - ఆదిదాస్ ( Image Source : Twitter )
India Cricket Jersey Sponsor:
బీసీసీఐకి మరోసారి కాసుల పంట పండించనుంది! అతి త్వరలోనే కిట్ స్పాన్సర్‌ను మార్చబోతోంది. క్రీడా పరికరాలు, దుస్తులు విక్రయించే ఆదిదాస్‌తో ఒప్పందం కుదుర్చుకోనుందని తెలిసింది. అన్నీ సవ్యంగా సాగితే జూన్ 1 నుంచి ఆదిదాస్ రూపొందించిన జెర్సీలను టీమ్‌ఇండియా (Team India) ఆటగాళ్లు ధరించడం ఖాయమే!
ప్రస్తుతం టీమ్‌ఇండియా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో తలపడుతోంది. 2-0తో సిరీస్‌లో ముందడుగు వేసింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో (WTC Finals) దాదాపుగా చోటు ఖాయం చేసుకుంది. జూన్ 7న లండన్లో మ్యాచ్ ఆడనుంది. ఇందులో ఆదిదాస్ జెర్సీనే ధరించనుందని సమాచారం.
ఇప్పుడు కిల్లర్ జీన్స్ టీమ్‌ఇండియా కిట్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఎంపీఎల్ స్పోర్ట్స్ మధ్యలోనే వదిలేయడంతో వీరు తెరపైకి వచ్చారు. చివరి సారిగా టీమ్‌ఇండియాకు కిట్ స్పాన్సర్‌గా ఉన్న పెద్ద బ్రాండ్ నైక్. 2016 నుంచి 2020 వరకు కొనసాగింది. ఆ తర్వాత రూ.370 కోట్లు పెట్టి ఎంపీఎల్ స్పోర్ట్స్ హక్కులను దక్కించుకుంది. 2023, డిసెంబర్ వరకు హక్కులు ఉన్నప్పటికీ మధ్యలోనే వదిలేసింది. దాంతో కిల్లర్ జీన్స్ రంగంలోకి వచ్చింది. బంగ్లాదేశ్ సిరీస్ నుంచి కిట్ స్పాన్సర్ చేస్తోంది.
స్టోర్టింగ్ కిట్లు తయారు చేయడంలో కిల్లర్ జీన్స్‌కు పెద్దగా అనుభవం లేదు. జెర్సీలు, దుస్తుల్లో నాణ్యత లేదని అభిమానులు మొత్తుకుంటున్నారు. బీసీసీఐ బ్రాండ్ ఇమేజ్‌కు తగినట్టుగా లేవని విమర్శిస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఆటగాళ్లు నైక్, ఆదిదాస్, పుమా వంటి బ్రాండ్లకు అంబాసిడర్లుగా ఉన్నారు. దాంతో బీసీసీఐకి విలువ చేకూరడం లేదు. అందుకే పెద్ద బ్రాండ్‌నే ఎంచుకోవాలని బోర్డు పట్టుదలగా ఉంది.
గతంలో ముంబయి ఇండియన్స్, ఇంగ్లాండ్ క్రికెట్ జట్లకు ఆదిదాస్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ప్రస్తుతం టీమ్‌ఇండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, కుల్‌దీప్ యాదవ్, రిషభ్ పంత్ ఈ బ్రాండ్ ప్రచారకర్తలుగా ఉన్నారు. ప్రస్తుతానికి నాటింగ్‌హామ్ షైర్, సౌత్ ఈస్ట్ స్టార్స్‌కు మాత్రమే వీరు స్పాన్సర్లుగా ఉన్నారు.
రెండో టెస్టు రీక్యాప్!
IND vs AUS 2nd Test: అద్భతాలు జరగలేదు. అంచనాలు మారలేదు. ఫలితం తారుమారు కాలేదు. సొంతగడ్డపై భారత్ ను ఓడించడం ఎంత కష్టమో మరోసారి నిరూపిస్తూ బోర్డర్- గావస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం సాధించింది. రవీంద్ర జడేజా సూపర్ స్పెల్ కు రోహిత్, పుజారా, కోహ్లీ, శ్రీకర్ భరత్ ల సమయోచిత బ్యాటింగ్ తోడైన వేళ టీమిండియా కంగూరూలను మట్టికరిపించింది.
రెండోరోజు ఆధిపత్యం ప్రదర్శించిన ఆస్ట్రేలియాను మూడోరోజు లంచ్ లోపే ఆలౌట్ చేయడం దగ్గరే భారత్ విజయానికి పునాది పడింది. రెండో రోజు చివరి సెషన్ లో దూకుడుగా ఆడి భారత్ ను ఆత్మరక్షణలో పడేసిన ఆసీస్ బ్యాటర్లు.. మూడో రోజుకొచ్చేసరికి తేలిపోయారు. అశ్విన్, జడేజాల ధాటికి ఒక్క సెషన్ కూడా పూర్తిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. ముఖ్యంగా జడ్డూ తన బౌలింగ్ తో కంగారూలకు కంగారు పుట్టించాడు. క్రీజులో బ్యాటర్లను నిలవనీయకుండా చేశాడు. మరోవైపు అశ్విన్ చక్కని సహకారం అందించాడు. వీరి స్పిన్ మాయాజాలానికి 52 పరుగులకే ఆసీస్ చివరి 9 వికెట్లను కోల్పోయింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఛేదనలో రోహిత్ శర్మ (20 బంతుల్లో 31), విరాట్ కోహ్లీ (31 బంతుల్లో 20), ఛతేశ్వర్ పుజారా (74 బంతుల్లో 31 నాటౌట్), శ్రీకర్ భరత్ (22 బంతుల్లో 23 నాటౌట్) రాణించారు. అంతకుముందు రవీంద్ర జడేజా (7 వికెట్లు), అశ్విన్ (3) లు చెలరేగటంతో రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 113 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో సిరీస్ లో టీమిండియా 2-0 ఆధిక్యం సాధించింది.
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!
MIW Vs DCW: తడబడ్డ ముంబై బ్యాటర్లు - తక్కువ స్కోరుకే పరిమితం!
IPL 2023: కైల్ జేమీసన్ స్థానంలో కొత్త బౌలర్‌ను తీసుకున్న చెన్నై - ఎవరికి ప్లేస్ దక్కిందంటే?
DCW vs GG,: లారా, యాష్లే చెలరేగినా - భారీ స్కోరు చేయలేకపోయిన గుజరాత్ - ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
SRH New Jersey: ఆరెంజ్ ఆర్మీ ఫైర్ ఇది! కొత్త జెర్సీ విడుదల చేసిన సన్‌రైజర్స్!
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్
KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !