By: ABP Desam | Updated at : 09 Apr 2023 06:22 PM (IST)
భారీ షాట్ ఆడుతున్న విజయ్ శంకర్ (Image Source: IPL Twitter)
Gujarat Titans vs Kolkata Knight Riders: ఐపీఎల్ 13వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. గుజరాత్ తరఫున విజయ్ శంకర్ (63 నాటౌట్: 24 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సాయి సుదర్శన్ (53: 38 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. వారి ఇన్నింగ్స్ మెల్లగా ఆరంభం అయింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే వృద్ధిమాన్ సాహా (17: 17 బంతుల్లో, మూడు ఫోర్లు) అవుటయ్యాడు. అయితే వన్ డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్‌తో (53: 38 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) కలిసి శుభ్‌మన్ గిల్ (39: 31 బంతుల్లో, ఐదు ఫోర్లు) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. వీరు రెండో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. 11.3 ఓవర్లలో గుజరాత్ 100 పరుగుల మార్కును దాటింది. అనంతరం శుభ్‌మన్ గిల్ అవుటయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన అభినవ్ ముకుంద్ (14: 8 బంతుల్లో, మూడు ఫోర్లు) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఈ దశలో విజయ్ శంకర్ (63 నాటౌట్: 24 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు) గుజరాత్ టైటాన్స్ స్కోరును నెక్స్ట్ లెవల్‌కు తీసువెళ్లాడు. వరుస బౌండరీలతో గుజరాత్ టైటాన్స్ బౌలర్లను అల్లాడించాడు. ముఖ్యంగా చివరి మూడు ఓవర్లలో చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ చివరి 15 బంతుల్లో గుజరాత్ 51 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో విజయ్ శంకర్ వరుసగా మూడు సిక్సర్లు బాదడం విశేషం. దీంతో గుజరాత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది.
ఐదో వికెట్‌కు విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్ (2 నాటౌట్: 3 బంతుల్లో) అజేయంగా 51 పరుగులు జోడించారు. ఇందులో డేవిడ్ మిల్లర్‌వి కేవలం రెండు పరుగులు మాత్రమే. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు విజయ్ శంకర్ విధ్వంసం ఏ రేంజ్‌లో సాగిందో. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టాడు. సుయాష్ శర్మకు ఒక వికెట్ దక్కింది.
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 9, 2023
A solid show with the bat from @gujarat_titans! 💪
6⃣3⃣* for @vijayshankar260
5⃣3⃣ for Sai Sudharsan
The @KKRiders chase begins shortly 👍 👍
Scorecard ▶️ https://t.co/G8bESXjTyh #TATAIPL | #GTvKKR pic.twitter.com/JkY2qR0WqW
కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఎన్ జగదీషన్, నితీష్ రానా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, సుయాష్ శర్మ, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, డేవిడ్ వైస్, మన్‌దీప్ సింగ్, వెంకటేష్ అయ్యర్
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్(కెప్టెన్), మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
జయంత్ యాదవ్, శ్రీకర్ భరత్, మోహిత్ శర్మ, మాథ్యూ వేడ్, జాషువా లిటిల్
Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్
Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో
MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!
WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే
Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
Modi Telangana Tour: మరోసారి తెలంగాణకు మోదీ, ఈసారి రోడ్ షోకి కూడా ప్లాన్!
Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్- రక్తంలా కనిపిస్తున్న నీళ్లు!
NBK 108 Title : టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి - బాలకృష్ణ సినిమా టైటిల్ ఆవిష్కరణకు భారీ ప్లాన్
మనం అనుకుంటున్నట్టు ప్రభాస్ అలాంటి వాడు కాదు: కృతి సనన్