IPL 2024: తొలి బ్యాటింగ్ సన్‌రైజర్స్‌దే, మరోసారి ఊచకోతేనా ?
Delhi Capitals vs Sunrisers Hyderabad: ఐపీఎల్ 17 సీజన్‌లో భాగంగా తన స్వంత మైదానంలో ఢిల్లీతో హైదరాబాద్ తలపడనుంది. కెప్టెన్ రిషభ్ పంత్ టాస్ గెలిచి ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు
DC Vs SRH IPL 2024 Delhi Capitals opt to bowl: న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో హైదరాబాద్(SRH)తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ(DC) బౌలింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్ బ్యాటర్లు విధ్వంసం కొనసాగిస్తున్న వేళ ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు ఖాయమని అంచనాలు ఉన్న వేళ హైదరాబాద్ బ్యాటర్లు భారీ స్కోర్లు నమోదు చేస్తారో లేదో చూడాలి. ఢిల్లీ బౌలర్లపై సన్‌రైజర్స్ ఎదురుదాడికి దిగే అవకాశం ఉంది.
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అదరగొడుతోంది. వరుసగా అత్యధిక పరుగులు సాధించి ప్రత్యర్థి జట్లకు పహెచ్చరికలను జారీ చేస్తోంది. టైటిల్ గెలవటమే లక్ష్యంగా దూసుకుపోతుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచింది.ఢిల్లీ క్యాపిటల్స్ , గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై 25 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన ఏడు మ్యాచ్‌లలో మూడింటిని మాత్రమే గెలుచుకుంది. పాయింట్ల పట్టికలో ఆరవ స్థానంలో ఉంది.
హెడ్-టు-హెడ్ రికార్డ్స్
మొత్తం ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు మొత్తం 23 మ్యాచ్‌లు ఆడాయి. ఈ మ్యాచ్‌లలో, ఢిల్లీ క్యాపిటల్స్ 11 గేమ్‌లను గెలుచుకోగా, 12 మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజేతగా నిలిచింది. ఈ రెండు జట్ల జరిగిన ఐపిఎల్ మ్యాచ్ ఏదీ టైగా ముగియలేదు.
అందులో ముఖ్యంగా ముఖ్యంగా, అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పై సొంత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ చాలా పేలవమైన రికార్డును కలిగి ఉంది. ఇక్కడ ఈ వేదికపై, ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ని ఆరు మ్యాచ్‌లలో కేవలం ఒక మ్యాచ్‌లో ఓడించింది. బలాబలాలు పరంగా ఢిల్లీ కంటే హైదరాబాద్ జట్టే హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ కి ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన స్థితికి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మ్యాచ్‌లో పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాలని సన్‌రైజర్స్ అనుకుంటుంది.
ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, యశ్ ధుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నోర్ట్జే, కుల్దీప్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఖలీల్ అహ్మద్ ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, రిచర్డ్‌సన్, సుమిత్ కుమార్, స్వస్తిక్ చికారా మరియు షాయ్ హోప్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ (కీపర్), ఐడెన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‌ప్రీత్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, ఉపేంద్ర యాదవ్, ఝటావేద్ సుబ్రమణ్యన్, సన్వీర్ సింగ్, విజయకాంత్ వియాస్కాంత్, ఫజల్హాక్ ఫరూఖీ, మార్కో జాన్సెన్, ఆకాష్ మహరాజ్ సింగ్, మయాంక్ అగర్వాల్.