అన్వేషించండి

CSK vs RCB, IPL 2022 LIVE: డీకే భయపెట్టినా..! విజయం చెన్నైదే.. 200 మ్యాచును సెలబ్రేట్‌ చేసుకున్న సీఎస్‌కే

IPL 2022, CSK vs RCB: ఐపీఎల్‌ 2022లో 22వ మ్యాచులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Superkings), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) తలపడుతున్నాయి. మరి వీరిలో ఏ జట్టుది ఆధిపత్యం?

LIVE

Key Events
CSK vs RCB, IPL 2022 LIVE: డీకే భయపెట్టినా..! విజయం చెన్నైదే.. 200 మ్యాచును సెలబ్రేట్‌ చేసుకున్న సీఎస్‌కే

Background

ఐపీఎల్‌ 2022లో 22వ మ్యాచులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Superkings), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) తలపడుతున్నాయి. డీవై పాటిల్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతోంది. ఒకవైపు చెన్నై వరుసగా నాలుగు మ్యాచులు ఓడి ఆత్మవిశ్వాసం కోల్పోయింది. మరోవైపు వరుస విజయాలతో బెంగళూరు దుమ్మురేపుతోంది. మరి వీరిలో ఏ జట్టుది ఆధిపత్యం? తుది జట్టులో ఎవరుంటారు? గెలిచేదెవరు?

డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెట్టిన చెన్నై సూపర్‌కింగ్స్‌ (CSK)కు ఈ సారి తిరుగులేదనుకున్నారు. కానీ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓడి ఆత్మవిశ్వాసం కోల్పోయింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad) పూర్తిగా విఫలమవుతున్నాడు. మధ్య ఓవర్లలో పరుగులు ఎక్కువగా చేయడం లేదు. ఒకరిద్దరు ఆటగాళ్లు ఔటైతే ఒత్తిడికి లోనవుతున్నారు. బౌలింగ్‌ లోనూ అంతే! దీపక్‌ చాహర్‌ (Deepak Chahar) లోటు బాగా తెలుస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌ ఓడిపోయిన ఆర్‌సీబీ (RCB) ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచులు గెలిచి హ్యాట్రిక్‌ అందుకుంది. బౌలింగ్, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లో దుమ్ము రేపుతోంది. ఆటగాళ్లు కసిగా ఆడుతున్నారు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో చెన్నై, బెంగళూరు (CSK vs RCB) మ్యాచులంటే అభిమానులకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే ఎంఎస్‌ ధోనీ (MD Dhoni), విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఎదురెదురుగా తలపడేవారు. ఈ రెండు జట్లలో సీఎస్‌కేదే పైచేయి. ఇప్పటి వరకు చెన్నై, బెంగళూరు 28 సార్లు తలపడితే 18సార్లు ధోనీసేనే గెలిచింది. కేవలం 9 సార్లు మాత్రమే బెంగళూరును విజయం వరించింది. చివరగా ఆడిన ఐదు మ్యాచుల్లోనూ చెన్నై 3-2తో ఆధిక్యంలో ఉంది. మానసికంగా సీఎస్‌కేదే ఆధిపత్యం అయినా ఈ సారి జోష్‌ మాత్రం బెంగళూరులో ఉంది.

CSK vs RCB Probable XI

చెన్నై సూపర్‌ కింగ్స్‌: రాబిన్‌ ఉతప్ప, రుతురాజ్‌ గైక్వాడ్‌, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోనీ, డ్వేన్‌ బ్రావో, డ్వేన్‌ ప్రిటోరియస్‌, క్రిస్‌ జోర్డాన్‌, ముకేశ్‌ చౌదరీ/ తుషార్‌ దేశ్‌పాండే

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: డుప్లెసిస్‌, అనూజ్‌ రావత్‌, విరాట్‌ కోహ్లీ, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, దినేశ్ కార్తీక్‌, షాబాజ్‌ అహ్మద్‌, డేవిడ్‌ విల్లే, వనిందు హసరంగ, సిద్ధార్థ్‌ కౌల్‌, మహ్మద్‌ సిరాజ్‌, అకాశ్‌ దీప్‌

18:16 PM (IST)  •  14 Apr 2022

CSK vs RCB, IPL 2022 LIVE: 20 ఓవర్లకు బెంగళూరు 193-9

డ్వేన్‌ బ్రావో 12 పరుగులు ఇచ్చాడు. సిరాజ్‌ (14), హేజిల్‌వుడ్‌ (7) అజేయంగా నిలిచారు. సీఎస్‌కే 23 తేడాతో మ్యాచ్ గెలిచింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IPL (@iplt20)

23:22 PM (IST)  •  12 Apr 2022

CSK vs RCB, IPL 2022 LIVE: 19 ఓవర్లకు బెంగళూరు 181-9

జోర్డాన్‌ 7 పరుగులు ఇచ్చాడు. ఆఖరి బంతికి సిరాజ్‌ (6) బౌండరీ బాదాడు. హేజిల్‌ వుడ్‌ (4) అతడికి తోడుగా ఉన్నాడు.

23:18 PM (IST)  •  12 Apr 2022

CSK vs RCB, IPL 2022 LIVE: 18 ఓవర్లకు బెంగళూరు 174-9

బ్రావో 5 పరుగులిచ్చి వికెట్‌ తీశాడు. రెండో బంతికి డీకే (34)ను ఔట్‌ చేశాడు. సిరాజ్‌ (1), హేజిల్‌వుడ్‌ (2) ఆడుతున్నారు.

23:09 PM (IST)  •  12 Apr 2022

CSK vs RCB, IPL 2022 LIVE: 17 ఓవర్లకు బెంగళూరు 169-8

ముకేశ్‌ 23 పరుగులు ఇచ్చాడు. డీకే (34) వరుసగా 6,6,4 కొట్టేశాడు. సిరాజ్‌ (0) అతడికి తోడుగా ఉన్నాడు.

23:01 PM (IST)  •  12 Apr 2022

CSK vs RCB, IPL 2022 LIVE: 16 ఓవర్లకు బెంగళూరు 146-8

జడ్డూ ఈ ఓవర్లో 6 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. హసరంగ, ఆకాశ్‌ దీప్‌ను పెవిలియన్‌ పంపించాడు. సిరాజ్‌ (౦), డీకే (13) క్రీజులో ఉన్నారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget