అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IPL 2024: హైబ్రీడ్‌ పిచ్‌పై తొలి గెలుపు చెన్నైదే

CSK vs PBKS, IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్‌ సత్తా చాటింది. హైబ్రీడ్‌ పిచ్‌ పూర్తిగా బౌలర్లకు సహకరించిన వేళ... ఓ మోస్తరు లక్ష్యాన్ని కూడా చెన్నై కాపాడుకుంది. గెలుపును సొంతం చేసుకుంది.

CSK vs PBKS IPL 2024 Chennai Super Kings won by 28 runs: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌(CSK) సత్తా చాటింది. హైబ్రీడ్‌ పిచ్‌ పూర్తిగా బౌలర్లకు సహకరించిన వేళ... ఓ మోస్తరు లక్ష్యాన్ని కూడా చెన్నై కాపాడుకుంది.  ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 167 పరుగులకే పరిమితమైంది. పంజాబ్‌ బౌలర్ల(PBKS)లో రాహుల్ చాహర్‌ మూడు, హర్షల్‌ పటేల్‌ మూడు వికెట్లు తీసి రాణించారు. అర్ష్‌దీప్‌ సింగ్‌ రెండు వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బౌలింగ్‌ అనుకూలిస్తున్న పిచ్‌పై చెన్నై బౌలర్లు రాణించాడు. దీంతో  దీంతో నిర్ణీత 20 ఓవర్లలోతొమ్మిది వికెట్ల నష్టానికి పంజాబ్‌ 139 పరుగులే చేయగలిగింది. 28 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది.

ఆదుకున్న ఆ ముగ్గురు
టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన చెన్నై 12 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. అజింక్య రహానె 9 పరుగులు చేసి ఔటయ్యాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ వేసిన రెండో ఓవర్‌లో రబాడకు దొరికిపోయాడు. చాలా తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని రబాడ అద్భుతంగా ఒడిసిపట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు డారిల్ మిచెల్‌తో కలిసి రుతురాజ్ చెన్నై స్కోరు బోర్డును నడిపించాడు. రబాడ వేసిన మూడో ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో సిక్స్‌, ఫోర్ కొట్టిన మిచెల్‌... స్కోరు బోర్డు వేగాన్ని పెంచాడు. పేస్‌ బౌలింగ్‌కు సహకరిస్తున్న హైబ్రిడ్ పిచ్‌పై పంజాబ్‌ బౌలర్లు రాణించారు. ఈ పిచ్‌పై బౌండరీలు ఎక్కువగా నమోదు కాలేదు.  పవర్‌ ప్లేలో చెన్నై స్కోరు 6 ఓవర్లకు 60/1. వీరిద్దరూ రెండో వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నిర్మించారు.

ఆ తర్వాత చెన్నై కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఔట్ అయ్యాడు. 21 బంతుల్లో 32 పరుగులు చేసి రుతురాజ్‌ అవుట్ అయ్యాడు. రాహుల్‌ చాహర్ ఓవర్‌లో రుతురాజ్ ఔటయ్యాడు.  కాసేపటికే చెన్నై జట్టుకు భారీ షాక్‌ తగిలింది. శివమ్‌ దూబె (0) కూడా పెవిలియన్‌కు చేరాడు. తర్వాత కూడా చెన్నైకి వరుస షాక్‌లు తగిలాయి. నిలకడగా ఆడుతున్న డారిల్ మిచెల్ 30 పరుగులు చేసి ఔటయ్యాడు. హర్షల్ పటేల్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో ఐదో బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 9 ఓవర్లకు స్కోరు 76/4. రవీంద్ర జడేజా (0), మొయిన్ అలీ (3) క్రీజులో ధోనీ మెరుపులు చుద్దామనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది.

ఎదుర్కొన్న మొదటి బంతికే ధోనీ పెవిలియన్ చేరాడు. హర్షల్ పటేల్ వేసిన 18.5 ఓవర్‌కు క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 19 ఓవర్లకు స్కోరు 151/8.  అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో తొలి బంతికి ఫోర్, మూడో బంతికి జడేజా సిక్స్ బాదాడు. నాలుగో బంతికి భారీ షాట్ ఆడి సామ్ కరన్‌కు క్యాచ్‌ ఇచ్చి 43 పరుగులు చేసిన జడేజా అవుటయ్యాడు.  దీంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై సూపర్‌కింగ్స్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 167 పరుగులకే పరిమితమైంది. పంజాబ్‌ బౌలర్లలో రాహుల్ చాహర్‌ మూడు, హర్షల్‌ పటేల్‌ మూడు వికెట్లు తీసి రాణించారు. అర్ష్‌దీప్‌ సింగ్‌ రెండు వికెట్లు తీశాడు.

ఆరంభం నుంచే తడబాటు
168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. తొమ్మిది పరుగుల వద్ద బట్లర్‌ పెవిలియన్‌కు చేరాడు. అదే ఓవర్‌లో ఇంకో వికెట్‌ పడింది. తుషార్‌ దేశ్‌పాండే ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. అతడు రెండో ఓవర్‌లో మూడో బంతికి బెయిర్‌స్టోను ఔట్ చేశాడు. చివరి బంతికి రిలీ రొసోవ్‌ని వెనక్కి పంపాడు. దీంతో తొమ్మిది పరుగులకే పంజాబ్‌ రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ కాసేపు చెన్నై బౌలర్లను అడ్డుకున్నారు. పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి పంజాబ్‌ రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. పంజాబ్ 62 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 27 పరుగులు చేసి ఔటయ్యాడు. జడేజా వేసిన 9వ ఓవర్లో పంజాబ్‌ మరో వికెట్‌ కోల్పోయింది. చివరి బంతిని ఎదుర్కొనే క్రమంలో 30 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రాన్‌ అవుటయ్యాడు. 10 ఓవర్లకు పంజాబ్ స్కోరు 72/5. జడేజా వేసిన 13 ఓవర్లో రెండు వికెట్లు పడ్డాయి. సామ్ కరన్, అశుతోష్ శర్మ ఔటయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలోతొమ్మిది వికెట్ల నష్టానికి పంజాబ్‌ 139 పరుగులే చేయగలిగింది. 28 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
Embed widget