IPL 2025 CSK Updates : ఆ ఆటగాళ్లను తీసెయ్యండి.. అలా బ్యాటింగ్ లైనప్ ని పటిష్ట పర్చండి.. చెన్నైకి మాజీ ప్లేయర్ సూచన
వరుసగా 2 సీజన్లలో ప్లే ఆఫ్ కు అర్హత సాధించడంలో చెన్నై విఫలమైంది. 2023లో చాంపియన్ గా నిలిచాక, ఆ జట్టు ప్రదర్శన తీసికట్టుగా మారుతోంది. ఈ సీజన్ లో అట్టడుగున పదో స్థానంతో సరిపెట్టుకుంది.

Ravindra Jadeka Vs CSK: ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి కూడా ప్లే ఆఫ్ చేరకుండానే తన ప్రస్థానం ముగించింది. నిజానికి 18 ఏళ్ల లీగ్ చరిత్రలో తొలిసారి అట్టడుగు స్థానమైన పదో స్థానంతో సీజన్ ను ముగించబోతోంది. అలాగే ఈసారి అన్నిటికంటే ముందు ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా చెత్త రికార్డు మూటగట్టుకుంది. గతేడాది కూడా ఐదో స్థానంలో నిలిచి, ప్లే ఆఫ్ కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఈ క్రమంలో జట్టును ప్రక్షాళన చేయాలని డిమాండ్లు ఊపందుకున్నాయి. చెన్నై చివరి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిన తర్వాత కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా ఇదే మాట మాట్లాడాడు. వచ్చే ఏడాది జట్టును మొత్తంగా నిర్మించాల్సి ఉంటుందని, జీరో నుంచి ప్రారంభించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. అలాగే వేలంలో కొత్త ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంటుందని తెలిపాడు. తాజాగా ధోనీ మాటలకి మద్ధతుగా మాజీ ప్లేయర్, కామేంటేటర్ ఆకాశ్ చోప్రా తనలోని ఆలోచనలను పంచుకున్నాడు.
For the first time in IPL history CSK finish on bottom of Points Table! 😮🟡🔻 pic.twitter.com/b2mo44oLx8
— CricketGully (@thecricketgully) May 21, 2025
ఆ ఆటగాళ్లను సాగనంపాలి..
జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా సుదీర్ఘకాలం సేవలు అందిస్తున్న రవీంద్ర జడేజా ను తర్వాతి సీజన్ కు ట్రేడ్ చేయాలని చోప్రా సూచించాడు. అతని ఇతర జట్లకు ట్రేడ్ చేసి, అతని స్థానంలో వేరే ఆటగాళ్లను తీసుకోవాలని పేర్కొన్నాడు. ఈ సీజన్లో తను అటు బ్యాట్, ఇటు బంతితో తను విఫలమయ్యాడని గుర్తు చేశాడు. అలాగే న్యూజిలాండ్ కు చెందిన బ్యాటింగ్ ద్వయం రచిన్ రవీంద్ర, డేవన్ కాన్వే ను కూడా రిలీజ్ చేసి, కొత్త ఆటగాళ్లను తీసుకోవాలని, అలాగే బ్యాటింగ్ ఆర్డర్ ను మరింతగా పునర్మించాలని పేర్కొన్నాడు. ముఖ్యంగా నాలుగో నెం.లో విదేశీ ప్లేయర్ ను ఆడించాలని పేర్కొన్నాడు.
అతనే సరి..
వయసు మళ్లిన ఆటగాళ్లను సాగనంపి, ఆయుష్ మాత్రే, ఊర్విల్ పటేల్, షేక్ రషీద్, డెవాల్డ్ బ్రివిస్ లతో బ్యాటింగ్ ఆర్డర్ ను పటిష్టం చేసుకోవాలని చోప్రా పేర్కొన్నాడు. ఓపెనర్ గా రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కు తోడుగా ఆయుష్ మాత్రే, రషీద్ లను ఉపయోగించాలని, నెం.3లో ఉర్విల్ పటేల్ సరిగ్గా పరిపోతాడని తెలిపాడు. ఆ తర్వాత నాలుగో నెం.లో డెవాల్డ్ బ్రివిస్ సరిగ్గా సరిపోతాడని వెల్లడించాడు. ఇంతుకుముందులాగా నెం.3, 4లలో శామ్ కరన్, జడేజాలను ఆడించడం సరికాదని వ్యాఖ్యానించాడు. జట్టుకు కొత్త రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరముందని పేర్కొన్నాడు. అలాగే విదేశీ బౌలర్లలో నూర్ అహ్మద్, మతీషా పతిరాణలను రిటైన్ చేసుకోవాలని పేర్కొన్నాడు. మరోవైపు చెన్నై కి మరో మ్యాచ్ ఈ సీజన్ లో మిగిలి ఉండటంతో ధోనీ రిటైర్మెంట్ పై ఏదైనా ప్రకటన వచ్చే అవకాశముందని చాలామంది భావించినా, అదేమీ లేదని, వచ్చే సీజన్ లో కూడా ధోనీ ఆడతాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.




















