అన్వేషించండి

Sakshi Dhoni: ‘బేబీ ఈజ్‌ ఆన్‌ ది వే’ సాక్షి ఇన్‌స్టా స్టోరీ వైరల్, ఇంతకీ ఏంటి విశేషం?

CSK vs SRH, IPL 2024: ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో హోమ్ గ్రౌండ్ లో హైదరాబాద్ పై చెన్నై భారీ విజయం సాధించింది. ఈ క్ర‌మంలో చెన్నై మాజీ సార‌ధి ఎంఎస్ ధోనీ భార్య సాక్షి పెట్టిన పోస్టు వైర‌ల్ అవుతోంది.

Baby Is On The Way Sakshi Dhonis Post During Csks Win Over Srh Goes Viral:  హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 78 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది. తరువాత బౌలింగ్‌లో నూ అదరగొట్టింది. గ‌త‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ చేతిలో ఓట‌మికి ఈసారి  చెన్నై సూపర్ కింగ్స్  త‌న సొంత మైదానంలో అద్భుత  విజ‌యం సాధించి రివేంజ్ తీర్చుకున్న‌ట్ల‌యింది. 

ముందుగా  బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో హైదరాబాద్ జట్టు ఘోరంగా విఫలమైంది. 134 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. దీంతో చెన్నై జట్టు 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి..ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా 98 పరుగులు చేశాడు. చెన్నై ఫాస్ట్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే నాలుగు వికెట్లు పడగొట్టి విజయానికి మార్గనిర్దేశం చేశాడు.  పాయింట్ల పట్టికలో ఆరో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. అయితే ఈ క్ర‌మంలో చెన్నై మాజీ సార‌ధి ఎంఎస్ ధోనీ భార్య సాక్షి పెట్టిన పోస్టు  ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. 

‘ప్లీజ్ ఇవాళ మ్యాచ్‌ను త్వరగా ముగించండి. బేబీ ఈజ్ ఆన్ ది వే (Baby Is On The Way), కాబోయే అత్తగా నా అభ్యర్థన ఇది’. అని సాక్షి త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొన్నారు. ఇది చూసిన ధోనీ అభిమానులు సాక్షి పోస్ట్‌ను వైరల్‌ చేయడమే కాకుండా.. మామ కాబోతున్న మిస్టర్‌ కూల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నిన్నటి మ్యాచ్ విషయానికి వస్తే  ధోనీ బ్యాటింగ్‌కు దిగి ఎదుర్కొన్న మొద‌టి బంతినే బౌండ‌రీకి త‌ర‌లించాడు. ఇక, ఈ సీజన్‌లో ముందు బ్యాటింగ్‌ చేస్తూ భారీ స్కోర్లు నమోదుచేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌  ఛేదనలో మాత్రం మొదటిసారే కాదు వరుసగా రెండోసారి కూడా చేతులెత్తేసింది. బెంగళూరుతో ఉప్పల్‌లో జరిగిన గత మ్యాచ్‌ మాదిరిగానే ఇప్పుడు చెన్నై చెపాక్‌  లోనూ తడబడింది. ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌ విషయానికి వస్తే సమిష్టి ప్రదర్శనతో  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. 

ఈ మ్యాచ్ సన్ రైజర్స్  బ్యాటింగ్  లో ఓపెనర్లు రాణించలేకపోయారు. ట్రేవిస్ హెడ్ , అభిషేక్ శర్మ  తక్కువ పరుగులతో  అవుట్ అయి తీవ్ర నిరాశ పరిచారు.  మార్క్రమ్ తప్ప ఎవరు స్కోర్ ను కాస్త కూడా ముందుకు తీసుకు వెళ్లలేకపోయారు. చెన్నై బౌలర్‌ తుషార్‌ దేశ్‌పాండే నాలుగు వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. పతిరన, ముస్తాఫిజుర్‌ చెరో రెండు వికెట్లు తీయగా, జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.  

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget