RCB vs CSK Live Updates: 18.1 ఓవర్లలో చెన్నై స్కోరు 157-4, ఆరు వికెట్లతో చెన్నై విజయం
IPL 2021, Royal Challengers Bangalore vs Chennai Super Kings: బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 156 పరుగులు చేసింది.
LIVE
Background
ఐపీఎల్‌లో నేడు ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ , కోహ్లీ సేన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ముంబై ఇండియన్స్‌పై విజయంతో చెన్నై ఆత్మవిశ్వాసంతో ఉండగా, కోల్‌కతా చేతిలో ఘోర పరాజయం పాలైన బెంగళూరు ఒత్తిడిలో ఉంది. చెన్నై ఈ మ్యాచ్‌లో గెలిస్తే మళ్లీ టేబుల్ టాప్‌కు వెళ్లనుంది.
చెన్నై ఇప్పటికే సమతూకంగా కనిపిస్తుంది. రుతురాజ్ గైక్వాడ్ తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. తనకు టాప్ ఆర్డర్‌లో ఒక్కరు సహకారం అందించినా.. చెన్నై భారీ స్కోరు చేయడం ఖాయం. ఫాఫ్ డుఫ్లెసిస్, సురేష్ రైనా, అంబటి రాయుడు, మొయిన్ అలీ, ధోని, రవీంద్ర జడేజా.. ఇలా టీం నిండా హిట్టర్లే ఉన్నారు. దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్‌లకు కూడా బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉంది. బౌలింగ్‌లో కూడా చెన్నై బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేస్తూనే ఉన్నారు. మధ్య ఓవర్లలో మొయిన్ అలీ, రవీంద్ర జడేజా ప్రభావం చూపిస్తున్నారు. దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, శామ్ కరన్‌లు మొదటి, చివరి ఓవర్లలో ఆ బాధ్యత తీసుకుంటున్నారు.
దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, మ్యాక్స్‌వెల్.. పేపర్ మీద చూడటానికి పేర్లు భయంకరంగా ఉన్నా.. దేవ్‌దత్ పడిక్కల్ మినహా మిగతా ముగ్గురూ విఫలం కావడం జట్టుపై గత మ్యాచ్‌లో తీవ్రప్రభావం చూపింది. ఇక బౌలింగ్‌లో హర్షల్ పటేల్, కైల్ జేమీసన్, చాహల్, సిరాజ్ ఉన్నారు. హర్షల్ పటేల్ వికెట్లు తీస్తున్నా.. పరుగులు ఆపలేకపోతున్నాడు. ఈ రెండు జట్ల మధ్య గతంలో జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్ వేసిన ఒకే ఓవర్లో రవీంద్ర జడేజా 37 పరుగులు చేసి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్: 18.1 ఓవర్లలో చెన్నై స్కోరు 157-4, ఆరు వికెట్లతో చెన్నై విజయం
హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్ మొదటి బంతికే మ్యాచ్ ముగిసింది. 18.1 ఓవర్లలో 157-4 స్కోరు సాధించి చెన్నై ఆరు వికెట్లతో విజయం సాధించింది.
రైనా 17(10)
ధోని 11(9)
హర్షల్ పటేల్ 3.1-0-25-2
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్: 18 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 155-4, లక్ష్యం 157 పరుగులు
సిరాజ్ వేసిన ఈ ఓవర్లో చెన్నై బ్యాట్స్‌మెన్ 10 పరుగులు సాధించారు. 18 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 155-4గా ఉంది. చెన్నై లక్ష్యం 12 బంతుల్లో 2 పరుగులు.
రైనా 16(9)
ధోని 11(9)
సిరాజ్ 3-0-23-0
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్: 17 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 145-4, లక్ష్యం 157 పరుగులు
హసరంగ వేసిన ఈ ఓవర్లో చెన్నై బ్యాట్స్‌మెన్ 11 పరుగులు సాధించారు. రాయుడు అవుటయ్యాడు. 17 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 145-4గా ఉంది. చెన్నై లక్ష్యం 18 బంతుల్లో 12 పరుగులు.
రైనా 15(8)
ధోని 2(4)
హసరంగ 4-0-40-0
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్: 16 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 134-4, లక్ష్యం 157 పరుగులు
హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో చెన్నై బ్యాట్స్‌మెన్ తొమ్మిది పరుగులు సాధించారు. రాయుడు అవుటయ్యాడు. 16 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 134-4గా ఉంది. చెన్నై లక్ష్యం 24 బంతుల్లో 23 పరుగులు.
రైనా 5(4)
ధోని 1(2)
హర్షల్ పటేల్ 3-0-23-2
రాయుడు అవుట్
హర్షల్ పటేల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రాయుడు.. డివిలియర్స్ చేతికి చిక్కాడు.
అంబటి రాయుడు (సి) డివిలియర్స్ (బి) హర్షల్ పటేల్ (32: 22 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్)