IPL 2023: ఒక ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి 25 జీబీ డేటా - 2 జీబీతో చూడాలంటే ఏం చేయాలి?
జియో సినిమా యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్ స్ట్రీమ్ చేయడానికి ఎంత డేటా కావాలి?
IPL 2023 Live Streaming: ఐపీఎల్ 2023 సీజన్ మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ఐపీఎల్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో కాకుండా జియో సినిమాలో అందుబాటులో ఉండనుంది. ఈసారి ఐపీఎల్ స్ట్రీమింగ్‌ను ఉచితంగా అందించనున్నట్లు జియో తెలిపింది.
మ్యాచ్ చూడటానికి ఎంత డేటా కావాలి?
4కే క్వాలిటీతో మ్యాచ్‌ను పూర్తిగా స్ట్రీమింగ్ చేయాలంటే ఏకంగా 25 జీబీ డేటా అవసరం. ఫుల్ హెచ్‌డీ క్వాలిటీతో స్ట్రీమింగ్ చేయాలంటే 12 జీబీ డేటా ఖర్చవుతుంది. మీడియం క్వాలిటీతో మ్యాచ్‌ను చూడటానికి 2.5 జీబీ, లో క్వాలిటీతో చూడటానికి 1.5 జీబీ డేటా అవసంర అవుతుంది.
కాబట్టి మీరు మొబైల్ డేటాతో మ్యాచ్ చూడాలనుకుంటే మీడియం, లో క్వాలిటీ ఆప్షన్లు ఎంచుకోవడం మంచిది. ఫుల్ హెచ్‌డీ, 4కే క్వాలిటీల్లో చూడాలంటే రోజుకు కనీసం రూ.200 వరకు ఖర్చవుతుంది. కాబట్టి మొబైల్ డేటాతో చూసేటప్పుడు స్ట్రీమింగ్ క్వాలిటీ దానికి తగ్గట్లు సెట్ చేసుకోండి.
ఐపీఎల్ 2023 సీజన్ మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2023 ప్రారంభ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ 16వ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ టోర్నమెంట్ చివరి లీగ్ మ్యాచ్ మే 21వ తేదీన జరుగుతుంది. అయితే బీసీసీఐ ఇంకా ఐపీఎల్ 2023 ప్లేఆఫ్ మ్యాచ్‌ల తేదీలను వెల్లడించలేదు.
రెండో రోజు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడనున్నాయి. ఇక ఏప్రిల్ 2వ తేదీన కూడా రెండు మ్యాచ్‌లను బీసీసీఐ నిర్వహించనుంది. సాయంత్రం సమయంలో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుండగా, రాత్రి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ల మధ్య హై వోల్టేజ్ పోరు జరగనుంది.
హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ 2022లో ఫైనల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. 2023 ఐపీఎల్‌లో 12 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. 10 హోమ్ వేదికలతో పాటు ధర్మశాల, గౌహతిలో కూడా మ్యాచ్‌లు జరగనున్నాయి.
IPL 2023 మొదటి ఐదు మ్యాచ్‌లు
చెన్నై సూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్ - మార్చి 31వ తేదీ
పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడ్స్ - ఏప్రిల్ 1వ తేదీ
లక్నో సూపర్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - ఏప్రిల్ 1వ తేదీ
సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ - ఏప్రిల్ 2వ తేదీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ - ఏప్రిల్ 2వ తేదీ
జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఏలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్టు గ్రూపు-బిలో ఉన్నాయి. అహ్మదాబాద్, మొహాలీ, లక్నో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, ముంబై, గౌహతి, ధర్మశాల వేదికలుగా మ్యాచ్‌లు జరగనున్నాయి.