News
News
X

IPL 2021 Standings: ప్లేఆఫ్స్‌కు కన్ఫర్మ్ అయిన మూడు జట్లూ ఇవే.. నాలుగో స్థానం కోసం!

ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లు ముగిసిన అనంతరం పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్న చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా జట్లు ప్లేఆఫ్స్‌కు ఇప్పటికే క్వాలిఫై కాగా, నాలుగో స్థానం కోసం విపరీతమైన పోటీ నెలకొంది.

FOLLOW US: 
 
ఐపీఎల్‌లో ఇవాళ రెండు మ్యాచ్‌లు ముగిసేసరికి చెన్నై పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉండగా, ఢిల్లీ రెండో స్థానంలోనూ, బెంగళూరు మూడో స్థానంలోనూ, కోల్‌కతా నాలుగో స్థానంలోనూ ఉన్నాయి. ఈ టేబుల్‌లో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లే టోర్నీలో ముందుకు వెళ్తాయన్న సంగతి తెలిసిందే. చెన్నై, ఢిల్లీ, బెంగళూరు ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కాగా.. నాలుగో స్థానం విషయంలో ఉత్కంఠ నెలకొంది.

నాలుగో స్థానంలో ఉన్న కోల్‌కతాకు 12 పాయింట్లు ఉండగా, ఐదో స్థానంలో పంజాబ్, ఆరో స్థానంలో ఉన్న రాజస్తాన్, ఏడో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు పదేసి పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి ఎడ్జ్ కోల్‌కతా వైపే ఉన్నట్లు అనిపించినా.. ఒక్క మ్యాచ్ తేడాలో మొత్తం మారిపోయే అవకాశం ఉంది. మిగతా జట్లు కోల్‌కతాకు పోటీని ఇవ్వాలంటే భారీ తేడాతో గెలవాల్సి ఉంది. ఎందుకంటే కోల్‌కతా నెట్ రన్‌రేట్ చాలా ఎక్కువగా ఉంది.

అయితే కోల్‌కతా ముందంజలో ఉందని మిగతా జట్లను లైట్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే 2014లో ప్లేఆఫ్స్‌కు చేరాలంటే 14.3 ఓవర్లలో 190 పరుగులు చేయాల్సిన దశలో ముంబై ఆ లక్ష్యాన్ని ఛేదించిన విషయాన్ని అంత త్వరగా మర్చిపోలేం. కాబట్టి ఇక్కడ ఏ జట్టునూ తక్కువ అంచనా వేయలేం.

కోల్‌కతా తర్వాతి మ్యాచ్‌లో ఒకవేళ ఓడిపోతే ఆ జట్టు అవకాశాలు కూడా సన్నగిల్లుతాయి. కాబట్టి తర్వాతి మ్యాచ్‌లో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా భారీ తేడాతో విజయం సాధించడంపైనే కోల్‌కతా దృష్టి పెట్టాలి. కోల్‌కతా ఓడితే మాత్రం మిగతా జట్లకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.

News Reels

సరిగ్గా చెప్పాలంటే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదైనా జరగొచ్చు. మొదటి మూడు స్థానాలు ఫిక్స్ అయిపోయినా.. నాలుగో స్థానానికి మాత్రం విపరీతమైన పోటీ ఉంది. దీనికి తోడు సోమవారం ఢిల్లీ, చెన్నైల మధ్య జరిగే మ్యాచ్ టేబుల్ టాపర్లను నిర్ణయించే అవకాశం ఉంది. రెండు జట్లూ సమాన మ్యాచ్‌లు ఆడి, సమాన విజయాలు సాధించాయి కాబట్టి.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు మొదటి స్థానంలో ఉండేందుకు అవకాశం ఉంటుంది.

Also Read: యాష్‌ తప్పేం చేయలేదు! సోషల్‌ మీడియాలో ఫాలోవర్లు పెంచుకొనేందుకే అతడిపై విమర్శలు.. గౌతీ సీరియస్‌!

Also Read: విరాట్‌ సరసన స్మృతి మంధాన.. పింక్‌ టెస్టులో సెంచరీ. ఔటివ్వకున్నా పెవిలియన్‌ వెళ్లిన పూనమ్‌!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 03 Oct 2021 11:47 PM (IST) Tags: IPL IPL 2021 IPL Season 14 IPL 14 Indian Premier League IPL 2021 Standings IPL Qualifiers

సంబంధిత కథనాలు

FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ లో భారతీయులు- రెండో స్థానం ఇండియాదే!

FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ లో భారతీయులు- రెండో స్థానం ఇండియాదే!

Team India 2023 Schedule: 2023లో టీమిండియా బిజీ బిజీ- 3 నెలల్లో 3 దేశాలతో సిరీస్ లు

Team India 2023 Schedule: 2023లో టీమిండియా బిజీ బిజీ- 3 నెలల్లో 3 దేశాలతో సిరీస్ లు

Chamika Karunaratne Hospitalized: క్యాచ్ పట్టబోయి పళ్లు ఊడగొట్టుకున్న శ్రీలంక ఆల్ రౌండర్

Chamika Karunaratne Hospitalized: క్యాచ్ పట్టబోయి పళ్లు ఊడగొట్టుకున్న శ్రీలంక ఆల్ రౌండర్

India vs Bangladesh 2022: బంగ్లాతో టెస్ట్ సిరీస్- రోహిత్ స్థానంలో ఏ ఆటగాడు రానున్నాడో తెలుసా!

India vs Bangladesh 2022: బంగ్లాతో టెస్ట్ సిరీస్- రోహిత్ స్థానంలో ఏ ఆటగాడు రానున్నాడో తెలుసా!

IND vs BAN 3rd ODI: కెప్టెన్‌, ఇద్దరు బౌలర్లు బంగ్లా సిరీస్‌ నుంచి ఔట్‌ - ద్రవిడ్‌

IND vs BAN 3rd ODI: కెప్టెన్‌, ఇద్దరు బౌలర్లు బంగ్లా సిరీస్‌ నుంచి ఔట్‌ - ద్రవిడ్‌

టాప్ స్టోరీస్

most trending news in telangana 2022 : కవిత లిక్కర్ కేసు నుంచి సమతా మూర్తి విగ్రహం వరకు ! తెలగాణలో ఈ ఏడాది ట్రెండింగ్ న్యూస్ ఏమిటో తెలుసా ?

most trending news in telangana 2022 :  కవిత లిక్కర్ కేసు నుంచి సమతా మూర్తి విగ్రహం వరకు ! తెలగాణలో ఈ ఏడాది ట్రెండింగ్ న్యూస్ ఏమిటో తెలుసా ?

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

తీవ్ర తుపానుగా మాండోస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

తీవ్ర తుపానుగా మాండోస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!