MI vs RCB Live Updates: 18.1 ఓవర్లలో 111 పరుగులకు ముంబై ఆలౌట్, 54 పరుగులతో బెంగళూరు విజయం
IPL 2021, Match 31, KKR Vs RCB: ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.
LIVE
Background
డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, తొలిసారి కప్పు ముద్దాడాలని భావిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కాలం కలసిరావడం లేదు. ఐపీఎల్ రెండో అంచెలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయారు. విచిత్రంగా ఈ రెండు జట్లకు వరుస ఓటములు రుచిచూపించినవి ఒకే జట్లు కావడం విశేషం. అవే చెన్నై, కోల్‌కతా. అందుకే ఈ పోరులో గెలిచి ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగు పర్చుకోవాలని ముంబయి, బెంగళూరు పట్టుదలగా ఉన్నాయి.
18.1 ఓవర్లలో 111 పరుగులకు ముంబై ఆలౌట్, 54 పరుగులతో బెంగళూరు విజయం
ముంబై ఆఖరివికెట్‌ను హర్షల్ పటేల్ తీశాడు. దీంతో 18.1 ఓవర్లలో 111 పరుగులకే ముంబై ఆలౌటైంది. బెంగళూరు 54 పరుగులతో విజయం సాధించింది.
హర్షల్ పటేల్ 3.1-0-17-4
18 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 111-9, లక్ష్యం 166 పరుగులు
చాహల్ వేసిన ఈ ఓవర్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ ఒక్క పరుగూ రాలేదు. బుమ్రా అవుటయ్యాడు. 18 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 111-9గా ఉంది. విజయానికి 12 బంతుల్లో 55 పరుగులు కావాలి.
ట్రెంట్ బౌల్డ్ 0(3)
ఆడం మిల్నే 0(0)
చాహల్ 4-1-11-3
బుమ్రా అవుట్
చాహల్ బుమ్రాను బౌల్డ్ చేసి చాలెంజర్స్‌కు తొమ్మిదో వికెట్ అందించాడు.
బుమ్రా (బి) చాహల్ (5: 6 బంతుల్లో)
17 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 111-8, లక్ష్యం 166 పరుగులు
హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ ఆరు పరుగులు చేశారు. హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, రాహుల్ చాహర్‌లను వరుస బంతుల్లో అవుట్ చేసి హర్షల్ హ్యాట్రిక్ సాధించాడు. 17 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 111-8గా ఉంది. విజయానికి 18 బంతుల్లో 55 పరుగులు కావాలి.
జస్‌ప్రీత్ బుమ్రా 5(3)
ఆడం మిల్నే 0(0)
హర్షల్ పటేల్ 3-0-17-3
రాహుల్ చాహర్ అవుట్.. హర్షల్ పటేల్ హ్యాట్రిక్
రాహుల్ చాహర్‌ను కూడా తర్వాతి బంతికే బౌల్డ్ చేసి హర్షల్ పటేల్ హ్యాట్రిక్ సాధించాడు. ఈ ఘనత సాధించిన మొదటి ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేలే.
రాహుల్ చాహర్ (బి) బౌల్డ్ (0: 1 బంతి)