Natarajan Tests Covid 19 Positive: సన్‌రైజర్స్ టీంలో ఈ ఆటగాడికి కరోనా పాజిటివ్.. మరి నేటి మ్యాచ్ సంగతేంటంటే?
Natarajan Tests Covid 19 Positive: సన్‌రైజర్స్ ఆటగాడు నటరాజన్ కరోనా బారిన పడ్డాడు. దీంతో అతనితో కాంటాక్ట్‌లో ఉన్న ఆరుగురిని ఐసోలేషన్‌కు పంపారు. ప్రస్తుతానికి అయితే మ్యాచ్ జరుగుతుందని అంటున్నారు.
ఐపీఎల్ మరోసారి ప్రమాదంలో పడింది. మొదటి అంచెలో కోల్‌కతాకు చెందిన ఆటగాడికి కరోనా పాజిటివ్ రావడంతో పాటు.. అది ఇతర ఆటగాళ్లకు కూడా సోకడంతో మొత్తం ఐపీఎల్‌నే వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మరో ఆటగాడికి కూడా కరోనా వచ్చింది. సన్‌రైజర్స్ కీలక బౌలర్ నటరాజన్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ముంగిట కరోనా బారిన పడ్డాడు. దీంతో నటరాజన్‌తో పాటు అతనితో కాంటాక్ట్‌లో ఉన్న ఆరుగురిని వెంటనే ఐసోలేషన్‌కు పంపారు.
మిగతా వారందరికీ ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించగా.. వారందరికీ నెగిటివ్ రావడంతో నేటి మ్యాచ్ యథాతథంగా జరగనుందని తెలుస్తోంది. సన్‌రైజర్స్ ప్లేయర్ విజయ్ శంకర్, టీం మేనేజర్ విజయ్ కుమార్, ఫిజియోథెరపిస్ట్ శ్యాం సుందర్ జే, డాక్టర్ అంజనా వణ్ణన్, లాగిస్టిక్స్ మేనేజర్ తుషార్ ఖేడ్కర్, నెట్ బౌలర్ పెరియసామి గణేషన్‌లు నటరాజన్‌తో కాంటాక్ట్‌లో ఉండటంతో వారిని కూడా ఐసోలేషన్‌లో ఉంచారు.
Also Read: Mithali Raj Record: వారెవ్వా మిథాలీ.. అంతర్జాతీయ క్రికెట్లో 20వేల పరుగులతో రికార్డు
ప్రస్తుతానికి అయితే ఈ మ్యాచ్ జరగడం అయితే కన్ఫర్మ్ అయినా.. మ్యాచ్ ప్రారంభానికి ఇంకా కొన్ని గంటల సమయం ఉంది కాబట్టి ఈలోపు ఏమైనా జరిగే అవకాశం ఉంది.
ఇక నేటి మ్యాచ్ ఢిల్లీకి చెలగాటం కాగా.. హైదరాబాద్‌కు ప్రాణ సంకటం. ఈ మ్యాచ్ ఓడితే హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కే ప్రమాదం ఉంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు ఓటములతో ప్రస్తుతం సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఇక్కడ నుంచి ఒక్క మ్యాచ్ ఓడినా సన్‌రైజర్స్ ఇంటి బాట పట్టడం ఖాయం. ఆడిన ప్రతి మ్యాచ్ గెలిస్తేనే ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంది.
ఇక ఢిల్లీ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో మంచి జోష్ మీద ఉంది. కీలక ఆటగాళ్లందరూ ఫాంలో ఉండటంతో ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటివరకు అందని ద్రాక్షలా ఉన్న టైటిల్‌ను ఎలాగైనా టైటిల్‌ను ఎలాగైనా గెలుచుకోవాలని చూస్తుంది.
అయితే ఐపీఎల్‌లో మాత్రం ఢిల్లీపై హైదరాబాద్‌దే పైచేయి. ఈ రెండు జట్లూ ఇప్పటివరకు 19 సార్లు తలపడగా.. 11 సార్లు హైదరాబాద్ విజయం సాధించింది. ఏడు సార్లు ఢిల్లీ గెలవగా, ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఈ సీజన్‌లో ఢిల్లీ, సన్‌రైజర్స్ మధ్య జరిగిన సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది.
Also Read: IPL 2021, DC vs SRH: బెబ్బులి దిల్లీపై సన్‌రైజర్స్ గెలిచేనా? బాహుబలి వార్నర్ మెరుపులు చూస్తామా!
Also Read: PAK vs ENG: కోహ్లీసేనే కాదు.. కివీస్, ఇంగ్లాండ్ కూడా మా శత్రువులే: రమీజ్ రాజా
Also Read: Afghanistan T20 WC Ban: అఫ్గాన్ క్రికెట్‌పై పిడుగు! ఐసీసీ జట్టును బహిష్కరించే ప్రమాదం!