RR vs RCB Live Updates:మాక్సీ విధ్వంసం.. 17.1 ఓవర్లకే బెంగళూరు విజయం
ముంబైని ఓడించి బెంగళూరు మంచి ఊపు మీదుంది. 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక రాజస్థాన్ పరిస్థితి భిన్నంగా ఉంది. ఢిల్లీ, సన్‌రైజర్స్ చేతిలో ఓటములతో ఒత్తిడిలో ఉంది. ఇది వారు తప్పక గెలవాల్సిన మ్యాచ్.
LIVE
Background
ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఇది 43వ మ్యాచ్. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబైని భారీ తేడాతో ఓడించి బెంగళూరు మంచి ఊపు మీదుంది. ప్రస్తుతం 12 పాయింట్లతో బెంగళూరు మూడో స్థానంలో ఉంది. ఇక రాజస్తాన్ పరిస్థితి భిన్నంగా ఉంది. ఢిల్లీ, సన్‌రైజర్స్‌పై ఓటములతో రాజస్తాన్ ఒత్తిడిలో ఉంది.
జోష్‌లో బెంగళూరు
గత మ్యాచ్‌లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టుగా రాణించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణించి ముంబైని ఏకంగా 54 పరుగుల తేడాతో చిత్తు చేసింది. పర్పుల్ క్యాప్ హోల్డర్ హర్షల్ పటేల్ గత మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించడం విశేషం. యజ్వేంద్ర చాహల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా బంతితో రాణించారు.
రాజస్తాన్ పడుతూ లేస్తూ..
రాజస్తాన్ గత మ్యాచ్‌లో మూడు మార్పులు చేసింది. గాయపడ్డ కార్తీక్ త్యాగి స్థానంలో జయదేవ్ ఉనద్కత్ జట్టులోకి వచ్చాడు. ఈ మధ్య రాజస్తాన్‌కు కార్తీక్ చాలా కీలకంగా మారాడు. తను జట్టులోకి వస్తే బౌలింగ్ విభాగం బలోపేతం అవుతుంది. ఎవిన్ లూయిస్, డేవిడ్ మిల్లర్‌ల్లో ఎవరిని ఈసారి జట్టులోకి తీసుకుంటారో చూడాలి.
రెండు జట్ల మధ్య 22 మ్యాచ్‌లు జరగ్గా.. 11 మ్యాచ్‌ల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించగా.. 10 మ్యాచ్‌ల్లో రాజస్తాన్ గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. గత ఐదు మ్యాచ్‌ల్లో అయితే మూడు సార్లు బెంగళూరు విజయం సాధించింది.
మాక్సీ విధ్వంసం.. 17.1 ఓవర్లకే బెంగళూరు విజయం
రియాన్ పరాగ్ వేసిన 17.1 బంతిని డివిలియర్స్ (4) బౌండరీ బాది విజయం అందించాడు. మాక్స్‌వెల్ (50) అజేయంగా నిలిచాడు. కోహ్లీసేన 7 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది.
17 ఓవర్లకు బెంగళూరు 149-3
మోరిస్ 22 పరుగులు ఇచ్చాడు. మాక్స్‌వెల్ (50) వరుసగా , 2, 4, 2, 4, 4తో రెచ్చిపోయాడు. డివిలియర్స్ మరో ఎండ్‌లో ఉన్నాడు. బెంగళూరుకు మరొక్క పరుగే అవసరం.
కేఎస్ భరత్ (44) ఔట్; 16 ఓవర్లకు బెంగళూరు 127-3
ముస్తాఫిజుర్ నాలుగు పరుగులే ఇచ్చి కీలకమైన భరత్ (44; 35 బంతుల్లో 83x4, 1x6)ను ఔట్ చేశాడు. సిక్సర్ ఆడే క్రమంలో అతడు క్యాచ్ ఇచ్చాడు. మాక్సీ (28), డివిలియర్స్ (0) క్రీజులో ఉన్నారు.
15 ఓవర్లకు బెంగళూరు 123-2
చేతన్ సకారియా 8 పరుగులు ఇచ్చాడు. తొలి బంతిని మాక్సీ (26) బౌండరీకి పంపించాడు. మొత్తంగా టీ20ల్లో 7వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. భరత్ (42) అర్ధశతకానికి చేరువైతున్నాడు.
14 ఓవర్లకు బెంగళూరు 115-2
రాహుల్ తెవాతియా 9 పరుగులు ఇచ్చాడు. నాలుగో బంతిని భరత్ (39) బౌండరీగా మలిచాడు. మాక్సీ (21) నిలకడగా ఆడుతున్నాడు. వీరిద్దరి భాగస్వా్మ్యం 50 పరుగులు దాటింది.