Indonesia Open 2022: దూసుకెళ్తున్న ప్రణయ్! ఇండోనేషియా ఓపెన్ క్వార్టర్స్‌లో ఎంట్రీ
Indonesia Open 2022: ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో భారత షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ (HS Prannoy) అదరగొడుతున్నాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు.
Indonesia Open 2022 HS Prannoy reaches quarters after straight-game win over Ng Ka Long : ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో భారత షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ (HS Prannoy) అదరగొడుతున్నాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. హోరాహారీగా సాగిన రెండో రౌండ్ మ్యాచులో హాంకాంగ్ ఆటగాడు ఎన్‌జీ కా లాంగ్ ఆంగుస్‌పై వరుస గేముల్లో విజయ దుందుభి మోగించాడు. 21-11, 21-18 తేడాతో 41 నిమిషాల్లోనే ప్రత్యర్థిపై చెలరేగిపోయాడు.
ఈ మధ్యే జరిగిన థామస్ కప్ టోర్నీలో ప్రణయ్ అద్భుతంగా ఆడాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతడు ఐదేళ్లుగా వేధిస్తున్న పతకాల కరవును బ్రేక్ చేయాలని పట్టుదలగా ఉన్నాడు. తొలి గేమ్‌లో ప్రణయ్ ఎదురే లేకుండా సాగిపోయాడు. చాలా సింపుల్‌గా కోర్టులో కదిలాడు. సంచలన క్రాస్ కోర్టు జంప్ స్మాష్‌తో 11-3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత మరేం తప్పులు చేయకుండా గేమ్‌ను గెలుచుకున్నాడు. రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి అతడికి కాస్త ప్రతిఘటన ఎదురైంది. ర్యాలీ గేమ్‌తో ప్రణయ్ వేగం తగ్గించాడు. అయినప్పటికీ అతడు 9-7తో ఆధిక్యం సాధించాడు. అదే ఊపు కొనసాగిస్తూ 16-11తో దుమ్మురేపాడు. జంప్ స్మాష్‌లు కొనసాగిస్తూ గేమ్‌తో పాటు మ్యాచ్ కైవసం చేసుకున్నాడు.
Also Read: పాకెట్ డైనమైట్ బ్లాస్ట్! రాహుల్, కోహ్లీని దాటి టాప్-7కు ఇషాన్
ఆంగుస్‌పై ప్రణయ్‌కు ఇది నాలుగో విజయం. క్వార్టర్ ఫైనల్లో అతడు డెన్మార్క్‌కు చెందిన రాస్మస్ గెమ్కే లేదా బ్రైస్ లివర్డెజ్ (ఫ్రాన్స్)తో తలపడతాడు. ఇక ఇండోనేషియా ఓపెన్లో సమీర్ వర్మ ఆట ముగిసింది. రెండో రౌండ్లో అతడు 10-21, 13-21 తేడాతో ప్రపంచ ఐదో ర్యాంకర్ లీ జి జియా (మలేషియా) చేతిలో ఓడాడు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జోడీపై 16-21, 13-21 తేడాతో చైనా ద్వయం చెన్ క్వింగ్ చెన్, జియా యీ ఫ్యాన్ గెలిచింది. పురుషుల డబుల్స్‌లో ధ్రువ్ కపిలా, ఎంఆర్ అర్జున్ జోడీ 19-21, 15-21 తేడాతో లియు యూ చెన్, జువాన్ యి చేతిలో ఓడింది.
Also Read: టీమ్‌ఇండియాకు బ్యాడ్ న్యూస్! కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్‌కు వెళ్లడంపై సందిగ్ధం!
congrats on your win @PRANNOYHSPRI !! way to gooo 🤩 pic.twitter.com/gZTjEXPPtN
— ♡̷ (@riesites) June 16, 2022
Some exciting battles ahead for our PBL stars on Day 3️⃣ at the #IndonesiaOpen2022 🔥
— Premier Badminton League (@PBLIndiaLive) June 16, 2022
Have a look at the line-ups 🤩#PBLlndia #BadmintonIndonesia #BWFWorldTour #EVIO2022 #Badminton @INABadminton pic.twitter.com/zt1G8oIxzG