అన్వేషించండి

KL Rahul Fitness Test: టీమ్‌ఇండియాకు బ్యాడ్‌ న్యూస్‌! కేఎల్‌ రాహుల్‌ ఇంగ్లాండ్‌కు వెళ్లడంపై సందిగ్ధం!

KL Rahul Fitness Test: టీమ్‌ఇండియాకు బ్యాడ్‌ న్యూస్‌! ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) వేగంగా కోలుకోవడం లేదని తెలిసింది.

KL Rahul Fitness Test: టీమ్‌ఇండియాకు బ్యాడ్‌ న్యూస్‌! ఇంగ్లాండ్‌ పర్యటనకు ముందు జట్టుకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) వేగంగా కోలుకోవడం లేదని తెలిసింది. వైద్య బృందం ఎంత ప్రయత్నించినా రికవరీ ఆలస్యం అవుతోందని సమాచారం. దాంతో ఆంగ్లేయులతో ఐదో టెస్టులో అతడు ఆడటం సందిగ్ధంగా మారింది.

దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీసుకు (IND vs SA T20 Series) మొదట కేఎల్‌ రాహుల్‌నే కెప్టెన్‌గా ఎంపిక చేశారు. సరిగ్గా తొలి మ్యాచుకు ముందురోజు  ప్రాక్టీస్‌లో అతడు గాయపడ్డాడు. గజ్జల్లో గాయమవ్వడంతో ముందు జాగ్రత్తగా అతడిని సిరీస్‌ నుంచి తప్పించారు. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో రిహబిలిటేషన్‌కు వెళ్లాడు. అయితే కోరుకున్నంత వేగంగా అతడు కోలుకోవడం లేదట!

మరో ఐదు రోజుల్లో అంటే జూన్‌ 20న భారత జట్టులో రెండో బృందం ఇంగ్లాండ్‌కు బయల్దేరనుంది. ఈ లోపే అతడు కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు గాయం నుంచి ఎంత రికవరీ అయ్యాడో తెలుసుకొనేందుకు శనివారం తక్కువ తీవ్రతతో కూడిన ఫిట్‌నెస్‌ టెస్టు నిర్వహించనున్నారు. దానిని బట్టి అతడిని ఇంగ్లాండ్‌కు పంపించనున్నారు.

'ఇదో నెమ్మది ప్రక్రియ. కేఎల్‌ రాహుల్‌ మెల్లగా కోలుకుంటున్నాడు. టీమ్‌ఇండియాకు ఇది శుభసూచకం కాదు. రెండో బ్యాచ్‌ ఇంగ్లాండ్‌కు బయల్దేరేందుకు ఇంకా 3-4 రోజుల సమయమే ఉంది. అందుకే శనివారం తేలికపాటి ఫిట్‌నెస్‌ టెస్టు నిర్వహిస్తున్నాం. అందులో నెగ్గితే ఇంగ్లాండ్‌ విమానం ఎక్కుతాడు. లేదంటే పూర్తిగా కోలుకొనేంత వరకు ఎదురు చూస్తాం. ఇప్పటికైతే అతడిని ఇంగ్లాండ్ పర్యటన నుంచి తప్పించలేదు' అని బీసీసీఐ అధికారి ఒకరు తమకు చెప్పినట్టు ఇన్‌సైడ్‌ స్పోర్ట్స్‌ రిపోర్టు చేసింది. 

'ఈ దశలో కేఎల్‌ రాహుల్‌కు టైమ్‌లైన్‌ ఏమీ లేదు. అతడు కోలుకుంటున్నాడు. నెమ్మదిగా రికవరీ అవుతున్నాడనేది నిజమే. టెస్టు మ్యాచుకు ముందే అతడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడని మాకు విశ్వాసం ఉంది. అవసరమైతే ఆలస్యంగా అతడిని ఇంగ్లాండ్‌కు పంపిస్తాం' అని ఆ అధికారి వెల్లడించారు.

కేఎల్‌ రాహుల్ గాయపడటం కొత్తేమీ కాదు. ఏడాది కాలంగా అతడు కొన్ని కీలకమైన సిరీసులకు దూరమయ్యాడు. 2021 నవంబర్లో తొడ కండరాలు పట్టేయడంతో న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌ ఆడలేదు. అదే ఏడాది ఫిబ్రవరిలో పిక్క కండరాల గాయంతో వెస్టిండీస్‌, శ్రీలంక టీ20 సిరీసుల నుంచి తప్పుకున్నాడు. మార్చిలో లంకపై టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. జనవరిలో మణికట్టు గాయంతో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీసు నుంచి తప్పుకున్నాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KL Rahul👑 (@klrahul)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Viral News: ఇద్దరు భర్తలు -  రెండు మంగళసూత్రాలు - ఒకే మంచం, ఒకే కంచం - ఈ మహిళ సతీలీలావతి కంటే ఎక్కువే
ఇద్దరు భర్తలు - రెండు మంగళసూత్రాలు - ఒకే మంచం, ఒకే కంచం - ఈ మహిళ సతీలీలావతి కంటే ఎక్కువే
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Embed widget