Indian Openers: ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న భారత ఓపెనర్లు - ఈ గణాంకాలే సాక్ష్యం!
2019 నుంచి ఇప్పటివరకు ఓపెనర్ల విషయంలో టీమిండియానే ముందుంది.
ప్రపంచ క్రికెట్‌లో గణాంకాల విషయంలో భారత జట్టు అనేక సందర్భాల్లో ముందుంది. భారత జట్టు పేరిట ఎన్నో పెద్ద రికార్డులు ఉన్నాయి. ఇందులో టీమ్ ఇండియా ఓపెనింగ్ 2019 నుంచి అగ్రస్థానంలో ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలోని అన్ని జట్ల ఓపెనర్ల కంటే భారత ఓపెనర్లు ఎక్కువ పరుగులు చేశారు. ఈ సమయంలో రోహిత్ శర్మ, శుభమన్ గిల్, శిఖర్ ధావన్ భారత జట్టులో కనిపించారు. కొన్ని సందర్భాల్లో మరి కొందరు ఆటగాళ్ళు కూడా ఓపెనర్లుగా కనిపించారు.
భారత ఓపెనర్లు అత్యధిక పరుగులు చేశారు
2019 నుంచి ఇప్పటి వరకు టీమ్ ఇండియా మొత్తం 68 ఇన్నింగ్స్‌లు ఆడింది. ఈ ఇన్నింగ్స్‌ల్లో భారత ఓపెనర్ బ్యాట్స్‌మెన్ 3,794 పరుగులు చేశారు. ఇందులో మొత్తం 15 సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. 55 ఇన్నింగ్స్‌ల్లో ఆస్ట్రేలియా ఓపెనర్లు 3,168 పరుగులు చేశారు. ఇందులో మొత్తం 13 సెంచరీలు ఉన్నాయి.
దీని తర్వాత వెస్టిండీస్ ఓపెనర్లు 63 ఇన్నింగ్స్‌ల్లో ఎనిమిది సెంచరీలతో 2,839 పరుగులు, ఇంగ్లండ్ ఓపెనర్లు 47 ఇన్నింగ్స్‌ల్లో 11 సెంచరీలతో 2,422 పరుగులు, బంగ్లాదేశ్ ఓపెనర్లు 48 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలతో 2,016 పరుగులు చేశారు.
విశేషమేమిటంటే భారత జట్టు స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 2019లో భారత జట్టుకు అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి అతను జట్టు కోసం మూడు ఫార్మాట్‌లను ఆడాడు. 13 టెస్ట్ మ్యాచ్‌లలో 25 ఇన్నింగ్స్‌లు ఆడి 32 సగటుతో 736 పరుగులు చేశాడు. 18 వన్డేల్లో 59.6 సగటుతో 894 పరుగులు చేశాడు. మూడు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అతను 19.33 సగటుతో, 131.82 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 58 పరుగులు చేశాడు.
View this post on Instagram
View this post on Instagram