By: ABP Desam | Updated at : 03 Jan 2022 07:37 PM (IST)
Edited By: Ramakrishna Paladi
కేఎల్ రాహుల్
Ind vs SA 2nd Test, KL Rahul Records: టీమ్‌ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డులు సాధిస్తూనే ఉన్నాడు. తాజాగా మహ్మద్ అజహరుద్దీన్, సునిల్ గావస్కర్, బిషన్ సింగ్ బేడీ, అజిత్ వాడేకర్ వంటి దిగ్గజ క్రికెటర్ల సరసన నిలిచాడు.
రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. దాంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుకు అతడు అందుబాటులో లేడు. హనుమ విహారి జట్టులోకి వచ్చాడు. కాగా కోహ్లీ స్థానంలో కేఎల్ రాహుల్‌ను నాయకుడిగా ఎంపిక చేశారు. రెండో టెస్టులో అతడే టీమ్‌ఇండియాకు సారథ్యం వహిస్తున్నాడు.
Koo Appसपना तो हर खिलाड़ी का होगा लेकिन बहुत कम लोग ये सपना जी पाते हैं. बहुत-बहुत बधाई @rahulkl, टीम इंडिया के लिए टेस्ट में कप्तानी करने का मौका मिल रहा है, वो भी विदेशी धरती पर. आपने एक बल्लेबाज के तौर पर अपने आप को साबित किया है और ये सही समय है की इस मुकाबले में कप्तान कर टीम इंडिया के फूल टाइम कप्तान के लिए दावेदारी पेश करें! #AbkiJeetHaiPakki #SAvIND #WTC23- Vinod Kambli (@vinodkambli) 3 Jan 2022
కేఎల్ రాహుల్ టీమ్‌ఇండియాకు 34వ టెస్టు కెప్టెన్. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సారథ్యం వహించకముందే సుదీర్ఘ ఫార్మాట్‌కు నేతృత్వం వహిస్తున్న ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించాడు. 1990 తర్వాత ఈ ఘనత సృష్టించిన ఆటగాడిగా నిలిచాడు. 1990ల్లో హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ ఇలాగే కెప్టెన్ అయ్యాడు. 1980ల్లో సునిల్ గావస్కర్, బిషన్ సింగ్ బేడీ, అజిత్ వాడేకర్ ఈ ఘనత అందుకున్నారు.
ఇక 1980ల్లో గుండప్ప విశ్వనాథ్ రెండు టెస్టులకు సారథ్యం వహించాడు. రాహుల్ ద్రవిడ్ 2003-2007 మధ్యన 25 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2007-2008 మధ్యన అనిల్ కుంబ్లే 14 టెస్టులకు నేతృత్వం వహించాడు.
ఈ మధ్యే పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టుకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అతడికి పిక్క కండరాల గాయం కావడంతో దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. ఫలితంగా కేఎల్ రాహుల్‌కు వన్డే క్రికెట్ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. జస్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. వాండరర్స్ టెస్టుకు ముందు కోహ్లీ గాయపడటంతో టెస్టు జట్టును రాహుల్ నడిపిస్తున్నాడు. అప్రతిహతంగా ఎదుగుతున్న రాహుల్‌కు మాజీ క్రికెటర్లు అభినందనలు చెబుతున్నారు. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: WATCH: 'మమ్మా..' అంటున్న వామిక! తపించి పోతున్న కోహ్లీ, అనుష్క
Also Read: Kohli on 100th Test: వందో టెస్టుకు మీడియా ముందుకు కోహ్లీ..! షాకింగ్ విషయాలు చెబుతాడా??
Also Read: Lionel Messi Covid Positive: మెస్సీకి కరోనా.. మరో ఇద్దరికి కూడా!
Also Read: IND vs SA 2nd Test: వాండరర్స్‌లో 'వండర్'కు సిద్ధమైన కోహ్లీ.. 7 పరుగులు చేస్తే ఆ రికార్డు బద్దలే!
Also Read: Team India Schedule 2022: ఏడాదంతా క్రికెట్ పండగే! టీమ్‌ఇండియాకు వరుసగా కీలక సిరీసులు.. ప్రపంచకప్
Also Read: Jasprit Bumrah: పేస్ బౌలర్లకు బాధ్యతలు ఎందుకు అప్పగించకూడదు.. అవసరమైతే బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు
LSG vs RCB, Eliminator Highlights: LSGని ఎలిమినేట్ చేసిన RCB - రాహుల్ సేనను ముంచిన క్యాచ్‌డ్రాప్‌లు!
LSG vs RCB, Eliminator Highlights: సెంచరీతో రప్ఫాడించిన రజత్ - ఎలిమినేటర్‌లో LSG టార్గెట్ 208
LSG vs RCB, Eliminator: లక్నోదే లక్కు! టాస్ గెలిచిన రాహుల్ - ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్
LSG vs RCB, Eliminator: బ్యాడ్ న్యూస్! వర్షంతో ఎలిమినేటర్ మ్యాచ్ టాస్ ఆలస్యం
IPL 2022: ఈ రికార్డ్ LSGకే సొంతమేమో! ప్లేఆఫ్స్ చేరిన RR, RCB, GTపై గెలవనేదుగా!!
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు