India vs New Zealand: టెస్టు కెప్టెన్సీ రోహిత్‌కా? రహానెకా? బుమ్రా, షమీ, పంత్‌కు విశ్రాంతి?
న్యూజిలాండ్ టెస్టు సిరీసుకు ముందు కొన్ని కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. సీనియర్లకు విశ్రాంతి ఇవ్వనున్నారు. రహానెను కాదని రోహిత్‌కు టెస్టు కెప్టెన్సీ అప్పగించే అవకాశాలూ ఉన్నాయి.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముగిసింది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీసుకు భారత జట్టును ప్రకటించారు. రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. కానీ టెస్టు కెప్టెన్సీ విషయంలో మాత్రం సెలక్టర్లకు చిక్కొచ్చి పడింది! తొలి టెస్టులో రోహిత్ శర్మ, అజింక్య రహానెలో సారథ్యం ఎవరికి అప్పగించాలో తెలియక సతమతం అవుతున్నారని తెలిసింది.
సారథ్యం ఎవరికి?
న్యూజిలాండ్‌తో టీ20 సిరీసు ముగియగానే టీమ్‌ఇండియా రెండు టెస్టులు ఆడనుంది. మొదటి టెస్టుకు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదని తెలిసింది. దాంతో వైస్ కెప్టెన్ రహానెకు పగ్గాలు అప్పగించాలా? ఇప్పుడే టీ20 కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మకు బాధ్యతలు ఇస్తే బాగుంటుందా అని సెలక్టర్లు మథన పడుతున్నారట.
ఫామ్‌లేమితో రహానె
చాలాకాలంగా రహానె ఫామ్‌లో లేడు. జట్టుకు అవసరమైనప్పుడు సమయోచితంగా పరుగులు చేస్తున్నా భారీ స్కోర్లు మాత్రం చేయడం లేదు. కోహ్లీ నిష్క్రమణతో రోహిత్ పేరు మార్మోగుతోంది. ఒక్క మ్యాచుకు అతడికే నాయకత్వం అప్పగిస్తే ఎలావుంటుందో చూడాలని ఆలోచిస్తున్నారట. మరికొద్ది రోజుల్లో నిర్ణయం వెలువడనుంది.
సీనియర్లకు విశ్రాంతి
ఇన్నాళ్లు బయో బుడగలో ఒత్తిడికి గురైన సీనియర్లకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. సీనియర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, శార్దూల్ ఠాకూర్, రిషభ్ పంత్‌కు విరామం ఇచ్చే అవకాశం ఉంది. మరో రెండు రోజుల్లోనే జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. రిషభ్ సైతం ఆరు నెలలుగా బుడగలోనే ఉన్నాడు. అతడి స్థానంలో వృద్ధిమాన్ సాహాకు చోటు గ్యారంటీ. అయితే రెండో ప్రాధాన్య కీపర్‌గా తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్‌ను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బుడగకు ముందు బ్రేక్
నవంబర్ 17 నుంచే న్యూజిలాండ్‌తో టీ20 సిరీసుకు మొదలవుతోంది. బయో బుడగ నుంచి ఇప్పుడే వచ్చిన జట్టుకు రెండు మూడు రోజులు బీసీసీఐ బ్రేక్ ఇవ్వనుంది. ఎందుకంటే కొందరు ఆటగాళ్లు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడుతున్నారు. వారంతా ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో గడిపేందుకు అవకాశం ఇస్తున్నారు. ఆ తర్వాత మూడు రోజులు క్వారంటైన్‌లో ఉంటారు. జైపుర్‌లోని బుడగలోకి చేరుకుంటారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా సిరీసును దృష్టిలో పెట్టుకొని ఇలా చేస్తున్నారు.
కోచ్‌లుగా వీళ్లే!
ఇక టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సహాయ బృందాన్ని దాదాపుగా సిద్ధం చేసుకున్నారు! బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాఠోడ్, బౌలింగ్ కోచ్‌గా పరాస్ మహంబ్రే బాధ్యతలు తీసుకుంటారని తెలిసింది. ఫీల్డింగ్ కోచ్‌గా టి.దిలీప్‌ను ప్రకటించనున్నారు. ఆయన చాలాకాలంగా ఎన్‌సీయేలో పనిచేశారు. భారత జట్టుతో శ్రీలంక పర్యటనకూ వెళ్లారు.
Also Read: Rape Threats Arrest : క్రికెటర్ కుమార్తెకు అత్యాచార బెదిరింపుల కేసులో హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్ !
Also Read: ENG vs NZ, Match Highlights: మొదటిసారి ఫైనల్స్‌కు న్యూజిలాండ్.. బై.. బై.. ఇంగ్లండ్
Also Read: Ravi Shastri Backs Dravid: తాను చేయలేనిది ద్రవిడ్ చేయాలన్న రవిశాస్త్రి..! కొత్త కోచ్‌కు అభినందనలు
Also Read: IPL Update: ఆర్‌సీబీ కోచింగ్ యూనిట్‌లో మార్పు.. కొత్త కోచ్‌గా భారత ఆటగాడే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి