అన్వేషించండి

Most Watched Match: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు అదిరిన వీక్షకుల సంఖ్య... భారత్ నుంచే ఎక్కువ మంది

సుమారు నెల రోజుల క్రితం జరిగిన ఐసీసీ అరంగేట్ర ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ వీక్షణల పరంగా అదరగొట్టింది.

భారత్‌లో క్రికెట్‌కి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. పగలు, రాత్రి మ్యాచ్లు ఎప్పుడు ఉన్న అభిమానులు ఆదరిస్తారు. విదేశీ గడ్డలపై మ్యాచ్లు ఉన్నప్పుడు కూడా సమయంతో సంబంధం లేకుండా చూస్తారు. దీంతో కొన్ని మ్యాచ్లు రికార్డు స్థాయిలో వీక్షకులను సంపాదించుకుంటాయి. టీవీలతో పాటు ఓటీటీలు, సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులు మ్యాచ్‌లను వీక్షిస్తున్నారు. దీంతో గణనీయంగా మ్యాచ్లు చూసే వాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంటోంది. 

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే... సుమారు నెల రోజుల క్రితం జరిగిన ఐసీసీ అరంగేట్ర ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (World Test Championship) ఫైనల్‌ వీక్షణల పరంగా అదరగొట్టింది. ఈ ఫైనల్ కోసం రెండేళ్ల పాటు మ్యాచ్లు జరిగాయి. వీటన్నింటిలో ఫైనల్ ఎక్కువ మంది చూసిన పోరుగా రికార్డులు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా 177 మిలియన్ల వీక్షకులు భారత్‌, న్యూజిలాండ్‌ పోరును ఆస్వాదించారు. 89 ప్రాంతాల నుంచే 130.6 మిలియన్ల లైవ్‌ వ్యూయర్‌షిప్‌ లభించడం ఆశ్చర్యకరం. 

న్యూజిలాండ్‌లో తక్కువ జనాభా ఉన్నా వ్యూయర్‌షిప్‌ బాగుండటం విశేషం. దాదాపుగా 200,000 మంది రాత్రంతా నిద్రపోకుండా, ఉదయాన్నే లేచి ఫైనల్‌ పోరును వీక్షించారు. బ్రిటన్‌లోని స్కై స్పోర్ట్స్‌లోనూ 2019-2021 ఛాంపియన్‌షిప్‌ మ్యాచుల్లో అత్యధికంగా వీక్షించిన మ్యాచ్‌ ఇదే కావడం ప్రత్యేకం. 

భారత్‌లోనే ఫైనల్‌ను అత్యధిక మంది వీక్షించారు. స్టార్‌స్పోర్ట్స్‌, దూరదర్శన్‌ ద్వారా 94.6% మంది మ్యాచ్‌ చూశారు. స్థానిక భాషల్లో కూడా మ్యాచ్లు ప్రసారం చేయడంతో వీక్షకుల సంఖ్య పెరిగేందుకు ఉపయోగపడిందని ఐసీసీ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ అనురాగ్‌ దహియా(Anurag Dahiya) అన్నారు.

ICC.TV ఓటీటీ ద్వారా 145 ప్రాంతాల్లో అదనంగా 6,65,100 ప్రత్యక్ష వీక్షణలు లభించాయి. మొత్తంగా 14 మిలియన్ల వీక్షణా నిమిషాలకు ఇది సమానం. రిజర్వుడే రోజు ఐసీసీ వేదికల ద్వారా వీడియో కంటెంట్‌ను 500 మిలియన్లకు పైగా చూశారు. ఐసీసీ డిజిటల్‌ అసెట్స్‌లో ఫేస్‌బుక్‌ ద్వారానే 423 మిలియన్ల వ్యూస్‌, 368 మిలియన్ల వీక్షణ నిమిషాలు నమోదయ్యాయి.

ఒక రిజర్వ్‌ డే నాడే ఐసీసీ ఫేస్‌బుక్‌ నుంచి 24 గంటల వ్యవధిలో 65.7 మిలియన్ల వ్యక్తిగత వీక్షణలు లభించాయి. 2020, మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ 64.3 మిలియన్ల కన్నా ఇది ఎక్కవే. ఐసీసీ ఇన్‌స్టా ద్వారానూ 70 మిలియన్ల వ్యక్తిగత వీక్షణలు వచ్చాయి. ఐసీసీ అన్ని డిజిటల్‌ ఖాతాల ద్వారా 515 మిలియన్ల వీడియో వ్యూస్‌ రావడమూ ఓ రికార్డే. ఈ రికార్డును సెప్టెంబరులో జరగబోయే IPL సీజన్ బ్రేక్ చేస్తుందేమో చూడాలి. ముంబయి ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్‌ని వీక్షకులు రికార్డు స్థాయిలోనే వీక్షిస్తారు. సెప్టెంబరులో ప్రారంభమయ్యే IPL సీజన్లో తొలి మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్యే జరగనుంది. 

టాప్ హెడ్ లైన్స్

Mohammad Kaif Slams Rishabh Pant: పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!
పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
Embed widget