News
News
X

Imran Khan on World Cricket: ప్రపంచ క్రికెట్‌ను భారత్ శాసిస్తోంది.. బీసీసీఐ మాటే నెగ్గుతుంది: ఇమ్రాన్ ఖాన్

ప్రపంచ క్రికెట్‌ను భారత్ తన ఆధిపత్యంతో శాసిస్తుందని మాజీ క్రికెటర్లు  సైతం పలు సందర్భాలలో ప్రస్తావించేవారు. తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

FOLLOW US: 
Share:

క్రికెట్ అనగానే గుర్తొచ్చే దేశాలలో భారత్‌ది అగ్రస్థానం. ప్రపంచ క్రికెట్‌ను భారత్ తన ఆధిపత్యంతో శాసిస్తుందని మాజీ క్రికెటర్లు  సైతం పలు సందర్భాలలో ప్రస్తావించేవారు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ క్రికెట్‌పై భారత్ ఆధిపత్యం చెలాయించగల సామర్థ్యం కలిగి ఉందని వ్యాఖ్యానించారు. 

ఇటీవల పాకిస్తాన్ క్రికెటర్ బోర్డ్ చీఫ్ రమీజ్ రాజా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. క్రికెట్‌ గేమ్‌ను భారత్ ప్రభావితం చేస్తుందని, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తలుచుకుంటే పాక్ క్రికెట్ లేకుండా పోతుందని సంచలన వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఇతర దేశాల క్రికెట్ బోర్డులను బీసీసీఐ ప్రభావితం చేయగలదన్నారు. ఇటీవల న్యూజిలాండ్ జట్టు పాక్ పర్యటనను రద్దు చేసుకుంది. అంతలోనే పాక్ క్రికెట్ బోర్డుకు మరో షాకిస్తూ.. ఇంగ్లాండ్ జట్టు సైతం తమ పర్యటనను రద్దు చేసుకోవడం తెలిసిందే. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు పాక్ పర్యటనను రద్దు చేసుకోవడంపై ఇమ్రాన్ ఖాన్ సైతం తీవ్ర నిరాశకు లోనయ్యారు. బీసీసీఐ ఆర్థిక పరిపుష్టితో మరే ఇతర దేశాల బోర్డులు పోటీ పడలేవని అభిప్రాయపడ్డారు.

Also Read: ధోని నామస్మరణతో షేక్ అయిన సోషల్‌మీడియా.. స్టార్ హీరోలు కూడా ఫ్యాన్స్ అయిపోయిన వేళ!

‘ఇంగ్లాండ్ జట్టు విషయానికొస్తే.. పాకిస్తాన్ లాంటి జట్లతో ఆడేందుకు ఇంగ్లీష్ ఆటగాళ్లు ఎప్పటికీ సంసిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు. డబ్బు కారణంగా వాళ్లు పాక్ పర్యటన విషయంలో వెనక్కి తగ్గారు. మనీ అనేది బిగ్ ప్లేయర్ అని నా అభిప్రాయం. క్రికెట్ బోర్డులకు సైతం డబ్బు అనేది కీలమైన అంశం. అయితే ఆ డబ్బు అనేది బీసీసీఐ, భారత్ చేతిలో ఉందని గుర్తుంచుకోవాలి. ప్రపంచ క్రికెట్‌ను మొత్తం భారత్ శాసిస్తోంది. అందువల్ల ఇతర దేశాలు భారత్ విషయంలో పునరాలోచిస్తాయి’ అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.

Also Read: ఢిల్లీపై చెన్నై థ్రిల్లింగ్ విన్.. ఫైనల్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ! 

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా బీసీసీఐ అక్టోబర్ 17 నుంచి టీ20 వరల్డ్ కప్ నిర్వహిస్తోంది. ‘పాక్ సైతం భారత్ గ్రూపులోనే ఉంది. భారత్ తమ తొలి మ్యాచ్ ను అక్టోబర్ 24న పాక్ తో ఆడనుంది. పాక్ క్రికెట్ బోర్డు 50 శాతం ఐసీసీ ఫండ్‌తో నడుస్తోంది. ఐసీసీకి 90 శాతం ఫండ్ భారత్ నుంచి వస్తుంది. దాంతో పాక్ బోర్డును సైతం భారత్ శాసిస్తున్నట్లే. రేపు ఏదైనా జరిగితే భారత ప్రధాని పాక్ కు నిధులు ఇవ్వలేమని చెప్పినా చెబుతారు. అప్పుడు పాక్ బోర్డు కుప్పకూలినట్లేనని’ రమీజ్ రాజా వ్యాఖ్యలు చేయడం ఇటీవల సంచలనంగా మారింది.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 11 Oct 2021 10:43 PM (IST) Tags: PM Modi Pakistan BCCI sports news PCB cricket news Imran Khan BCCI news Ramiz Raja Pakistan cricket

సంబంధిత కథనాలు

UPW-W vs DC-W, Match Highlights: క్యాప్సీ కేక! యూపీపై గెలుపుతో WPL ఫైనల్‌కు దిల్లీ క్యాపిటల్స్‌!

UPW-W vs DC-W, Match Highlights: క్యాప్సీ కేక! యూపీపై గెలుపుతో WPL ఫైనల్‌కు దిల్లీ క్యాపిటల్స్‌!

UPW-W vs DC-W, 1 Innings Highlight: దిల్లీ ఫైనల్‌ టార్గెట్‌ 139 - యూపీని దెబ్బకొట్టిన క్యాప్సీ, రాధా!

UPW-W vs DC-W, 1 Innings Highlight: దిల్లీ ఫైనల్‌ టార్గెట్‌ 139 - యూపీని దెబ్బకొట్టిన క్యాప్సీ, రాధా!

UPW vs DCW: ఆఖరి లీగు మ్యాచులో టాస్‌ డీసీదే - యూపీపై గెలిస్తే ఫైనల్‌కే!

UPW vs DCW: ఆఖరి లీగు మ్యాచులో టాస్‌ డీసీదే - యూపీపై గెలిస్తే ఫైనల్‌కే!

RCB-W vs MI-W, Match Highlight: ముంబయి కేర్‌టేకర్‌ 'కెర్‌' - ఆర్సీబీపై 4 వికెట్ల తేడాతో మళ్లీ టేబుల్‌ టాపర్‌!

RCB-W vs MI-W, Match Highlight: ముంబయి కేర్‌టేకర్‌ 'కెర్‌' - ఆర్సీబీపై 4 వికెట్ల తేడాతో మళ్లీ టేబుల్‌ టాపర్‌!

RCB-W vs MI-W, 1 Innings Highlight: ముంబయి టార్గెట్‌ జస్ట్ 126 - ఆఖరి మ్యాచులో ఆర్సీబీ గెలుస్తుందా?

RCB-W vs MI-W, 1 Innings Highlight: ముంబయి టార్గెట్‌ జస్ట్ 126 - ఆఖరి మ్యాచులో ఆర్సీబీ గెలుస్తుందా?

టాప్ స్టోరీస్

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!

Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి