T20 WC, Ind vs NZ: టీమ్‌ఇండియాకు ఇది క్వార్టర్ ఫైనల్..! తొలి బంతి నుంచే దంచికొట్టాలన్న డీకే
న్యూజిలాండ్ మ్యాచులో టీమ్‌ఇండియా దూకుడుగా ఆడాలని దినేశ్ కార్తీక్ అంటున్నాడు. ఈ మ్యాచ్ క్వార్టర్ వంటిదన్నాడు. గెలిస్తే ఒత్తిడి తగ్గుతుందని చెప్పాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ టీమ్‌ఇండియాకు క్వార్టర్ ఫైనల్ లాంటిదని వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. ఈ మ్యాచ్ గెలిస్తే సెమీస్ చేరేందుకు కోహ్లీసేనకు దారి సులువు అవుతుందన్నాడు. ఈ విషయం వారికీ తెలుసని పేర్కొన్నాడు. మ్యాచుకు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు. మరికొన్ని గంటల్లో దుబాయ్ వేదికగా భారత్, కివీస్ తలపడుతున్న సంగతి తెలిసిందే.
'ఇది టీమ్‌ఇండియా క్వార్టర్ ఫైనల్. ఆటగాళ్లకు ఈ విషయం తెలుసు. ఈ మ్యాచులో గెలిస్తే సులువుగా సెమీస్ చేరేందుకు సులువు అవుతుంది. అఫ్గానిస్థాన్ ప్రమాదకరమైన జట్టు కాబట్టి ఓడిపోతే ప్రమాదం. అందుకే గెలుపు తప్పనిసరి. న్యూజిలాండ్‌పై టీమ్‌ఇండియా ఎలా ఆడుతుందో చూడాలని ఆసక్తిగా ఉంది' అని దినేశ్ కార్తీక్ అన్నాడు.
'ఈ మ్యాచులో టీమ్‌ఇండియా మెరుగ్గా బ్యాటింగ్ చేయాలి. ఈ ప్రపంచకప్ గెలవాలంటే అందుకు తగ్గట్టే ఆడాలి. కాస్త రక్షణాత్మకంగా ఆడుతున్నారు. జట్టులో అద్భుత ప్రతిభావంతులు ఉన్నారు. బ్యాటర్లకు తిరుగులేదు. తొలి నుంచి ఆఖరి బంతి వరకు దూకుడుగా ఆడగలరు. ఇప్పుడు ఆచితూచి ఆడితే కష్టం. దంచికొడితేనే పాక్, ఇంగ్లాండ్‌ను ఓడించగలరు' అని డీకే చెప్పాడు.
Also Read: SL vs SA, Innings Highlight: లంకేయుల విజయం 'కిల్' చేసిన మిల్లర్! ఆఖరి ఓవర్లో వరుస సిక్సర్లు
Also Read: Hasaranga Hattrick in T20 WC: సూపర్ 12 మ్యాచ్‌ల్లో మొదటి హ్యాట్రిక్.. అద్భుతం చేసిన సింహళ స్పిన్నర్!
Also Read: ENG vs AUS, Match Highlights: జోస్ బట్లర్ షో.. ఆస్ట్రేలియాపై ఎనిమిది వికెట్లతో ఇంగ్లండ్ విజయం!
Also Read: ICC T20 WC 2021, IND vs NZ Preview: సెమీస్ అవకాశాలు ఉండాలంటే.. 18 ఏళ్ల రికార్డు బద్దలవ్వాల్సిందే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి
🗣️ "They are one of the top two sides when it comes to playing consistent cricket."
— T20 World Cup (@T20WorldCup) October 31, 2021
India are wary of the threat posed by New Zealand ahead of the blockbuster clash between the two sides 🤜🤛 #T20WorldCup https://t.co/SRsMKWloZB
💬 "The depth of fast bowling is really healthy in New Zealand."
— T20 World Cup (@T20WorldCup) October 31, 2021
Trent Boult believes the Kiwis can compete with the best because of the pace battery at their disposal ⚡️#T20WorldCup https://t.co/bnFBsCw1oW