అన్వేషించండి

Ind vs NZ 3rd T20 Live: 17.2 ఓవర్లలో ముగిసేసరికి 111కు న్యూజిలాండ్ ఆలౌట్, 73 పరుగులతో టీమిండియా విజయం

Ind vs NZ 3rd T20 International, Eden Garden: న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది.

LIVE

Key Events
Ind vs NZ 3rd T20 Live: 17.2 ఓవర్లలో ముగిసేసరికి 111కు న్యూజిలాండ్ ఆలౌట్, 73 పరుగులతో టీమిండియా విజయం

Background

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆఖరిదైన మూడో మ్యాచ్‌కి ఈడెన్ గార్డెన్‌ ముస్తాబైంది. రెండున్నరేళ్ల తర్వాత ఇక్కడ మ్యాచ్‌ జరుగుతుండటంతో అభిమానులు పోటెత్తే అవకాశం ఉంది. 2-0తో సిరీసు కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా వైట్‌వాష్‌పై కన్నేసింది. అలా జరగకుండా ఆపాలని న్యూజిలాండ్‌ కూడా పట్టుదలతో ఉంది. మరి మ్యాచ్‌లో ఎవరి బలమేంటి? కొత్త కుర్రాళ్లలో ఎవరికి అరంగేట్రం చేసే అవకాశం దక్కనుంది.

సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో టీమ్‌ఇండియాపై ఒత్తిడి లేదు. గెలుపోటములను ప్రస్తావన మైండ్‌లోకి రాకుండా ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. కుర్రాళ్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, అవేశ్‌ ఖాన్‌ అరంగేట్రానికి సై అంటున్నారు. సీఎస్‌కేలో గైక్వాడ్‌ పరుగుల వరద పారిస్తే డీసీలో అవేశ్‌ వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. సూర్యకుమార్‌, కేఎల్‌ రాహుల్‌, భువనేశ్వర్‌కు విశ్రాంతినిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అరంగేట్రంలోనే అదరగొట్టిన హర్షల్‌ పటేల్‌పై అంచనాలు పెరిగిపోయాయి.

టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే మూడో టీ20లో  అతడు మరో 87 పరుగులు చేస్తే చాలు. భారత్‌ తరఫున పొట్టి క్రికెట్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంటాడు. న్యూజిలాండ్‌ సిరీసులో రోహిత్ శర్మ 103 పరుగులు చేశాడు. పొట్టి క్రికెట్లో 118 మ్యాచుల్లోనే 3141 పరుగులు చేశాడు. భారత్‌ తరఫున టీ20ల్లో రెండో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. అంతకన్నా ముందు విరాట్‌ కోహ్లీ 3227తో ఉన్నాడు. హిట్‌మ్యాన్ మరో 87 పరుగులు చేస్తే కోహ్లీ రికార్డు బద్దలవుతుంది.

అంతర్జాతీయంగా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మార్టిన్‌ గుప్టిల్ ముందున్నాడు. అతడు కేవలం 107 ఇన్నింగ్సుల్లోనే 3248 పరుగులు చేశాడు. టీమ్‌ఇండియాతో రెండో మ్యాచులో 17 బంతుల్లోనే 31 పరుగులు చేయడంతో ఈ ఘనత అందుకున్నాడు. విరాట్‌ కోహ్లీని అధిగమించాడు. ఇక మూడో స్థానంలో రోహిత్ ఉన్నాడు

సిరీసులో వైట్‌వాష్‌ అవ్వనివ్వకూడదని న్యూజిలాండ్‌ పట్టుదలగా ఉంది. మార్టిన్‌ గప్తిల్‌, గ్లెన్ ఫిలిప్స్‌, మిచెల్‌, ఛాప్‌మన్‌ ఫామ్‌లో ఉన్నారు. ట్రెంట్ బౌల్ట్‌, టిమ్‌ సౌతీ స్థాయికి తగ్గట్టు బంతులు వేస్తున్నా కాపాడుకోగల స్కోరు బ్యాటర్లు చేయలేదు. పైగా టాస్‌ ఓడిపోవడం వారిని వెనకబడేలా చేసింది. జట్టులో మరీ మార్పులేమీ ఉండకపోవచ్చు. ఈడెన్‌ పిచ్‌ కివీస్‌ బౌలింగ్‌కు నప్పడం సానుకూల అంశం.

ఈడెన్‌ గార్డెన్‌ పేస్‌, బౌన్స్‌కు అనుకూలిస్తుంది. బౌన్స్‌ ఉంటుంది కాబట్టి పేసర్లే కాకుండా స్పిన్నర్లూ వికెట్లు తీయగలరు. ఫ్లాట్‌ పిచ్‌ కావడంతో బ్యాటర్లు పరుగుల వరద పారించేందుకు అవకాశం ఉంటుంది. కోల్‌కతా వాతావరణం బాగుంది. 29 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.

22:32 PM (IST)  •  21 Nov 2021

17.2 ఓవర్లలో ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 111 ఆలౌట్, 73 పరుగులతో టీమిండియా విజయం

దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. లోకి ఫెర్గూసన్ అవుట్ అవ్వడంతో టీమిండియా 73 పరుగులతో విజయం సాధించింది.
ట్రెంట్ బౌల్ట్ 2(2)
దీపక్ చాహర్ 2.2-0-26-1
లోకి ఫెర్గూసన్ (సి అండ్ బి) దీపక్ చాహర్ (14: 8 బంతుల్లో, రెండు సిక్సర్లు)

22:28 PM (IST)  •  21 Nov 2021

17 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 110-9, లక్ష్యం 185 పరుగులు

హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. ఇష్ సోధి అవుటయ్యాడు. న్యూజిలాండ్ విజయానికి 18 బంతుల్లో 75 పరుగులు కావాలి.
ట్రెంట్ బౌల్ట్ 1(1)
లోకి ఫెర్గూసన్ 14(7)
హర్షల్ పటేల్ 3-0-26-2
ఇష్ సోధి (సి) సూర్యకుమార్ యాదవ్ (బి) హర్షల్ పటేల్ (9: 11 బంతుల్లో, రెండు ఫోర్లు)

22:25 PM (IST)  •  21 Nov 2021

16 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 95-8, లక్ష్యం 185 పరుగులు

వెంకటేష్ అయ్యర్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. ఆడం మిల్నే అవుటయ్యాడు. న్యూజిలాండ్ విజయానికి 24 బంతుల్లో 90 పరుగులు కావాలి.
ఇష్ సోధి 9(10)
లోకి ఫెర్గూసన్ 1(3)
వెంకటేష్ అయ్యర్ 3-0-12-1
ఆడం మిల్నే (సి) రోహిత్ శర్మ (బి) వెంకటేష్ అయ్యర్ (7: 6 బంతుల్లో, ఒక సిక్సర్)

22:19 PM (IST)  •  21 Nov 2021

15 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 93-7, లక్ష్యం 185 పరుగులు

యజ్వేంద్ర చాహల్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగులు మాత్రమే వచ్చింది. న్యూజిలాండ్ విజయానికి 30 బంతుల్లో 92 పరుగులు కావాలి.
ఇష్ సోధి 8(8)
ఆడం మిల్నే 7(5)
యజ్వేంద్ర చాహల్ 4-0-26-1

22:17 PM (IST)  •  21 Nov 2021

14 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 92-7, లక్ష్యం 185 పరుగులు

దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. మిషెల్ శాంట్నర్ రనౌటయ్యాడు. న్యూజిలాండ్ విజయానికి 36 బంతుల్లో 93 పరుగులు కావాలి.
ఇష్ సోధి 8(5)
ఆడం మిల్నే 6(2)
దీపక్ చాహర్ 2-0-11-1
మిషెల్ శాంట్నర్ (రనౌట్ ఇషాన్ కిషన్) (2: 4 బంతుల్లో)

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget