IND vs NZ 2nd Test: బిగ్ రికార్డ్ బద్దలు కొట్టేందుకు అశ్విన్ రెడీ..! ఏంటో తెలుసా?
అరుదైన రికార్డుకు రవిచంద్రన్ అశ్విన్ చేరువయ్యాడు. ముంబయి వాంఖడేలో మరో ఎనిమిది వికెట్లు తీస్తే అతడో రికార్డు బద్దలు చేస్తాడు.
టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. దిగ్గజ క్రికెటర్ సర్ రిచర్డ్స్ హ్యాడ్లీ రికార్డును బద్దలు కొట్టేందుకు ఎదురు చూస్తున్నాడు. ముంబయి టెస్టులో అతడు మరో ఎనిమిది వికెట్లు తీస్తే చాలు! ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే..?
సుదీర్ఘ ఫార్మాట్లో సర్ రిచర్డ్స్ హ్యాడ్లీ అరుదైన రికార్డు నెలకొల్పారు. టీమ్‌ఇండియాపై కేవలం 14 మ్యాచుల్లో 65 వికెట్లు తీశాడు. అంటే ఈ రెండు జట్ల మధ్య పోటీల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన దిగ్గజం అతడు. ఇందుకు యాష్ మరో 8 వికెట్ల దూరంలోనే ఉన్నాడు. ముంబయి వాంఖడేలో రెండు ఇన్నింగ్సుల్లో కలిసి 8 వికెట్లు తీస్తే ఈ రికార్డు బద్దలవుతుంది.
ఇక దిగ్గజ స్పిన్నర్ బిషన్ బేడీ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. ఆయన 12 టెస్టుల్లో 57 వికెట్లు పడగొట్టారు. ఎర్రాపల్లి ప్రసన్న అయితే 10 టెస్టుల్లో 55 వికెట్లు తీశారు. ఈ తరంలో టిమ్ సౌథీ 10 మ్యాచుల్లో 52 వికెట్లు తీసి ఐదో స్థానంలో నిలిచాడు. కాన్పూరులో 6 వికెట్లు తీయడంతో బిషన్ బేడీ, ప్రసన్న రికార్డును యాష్ దాటేశాడు.
కాన్పూర్ టెస్టులో అశ్విన్ అద్భుతంగా ఆడాడు. బ్యాటింగ్‌లోనూ అలరించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 42.3 ఓవర్లు విసిరాడు. అందులో 10 మెయిడిన్ చేశాడు. 1.92 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లు విసిరాడు. 12 మెయిడిన్ చేశాడు. 1.16 ఎకానమీతో 3 వికెట్లు తీశాడు. తనదైన రీతిలో బంతిని టర్న్ చేస్తూ బ్యాటర్ల బుర్రల్లో చిక్కుముళ్లు వేశాడు.
Also Read: IPL Retention: కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లపై ఏడాది నిషేధం తప్పదా..! గతంలో స్టార్ ఆల్ రౌండర్‌పై వేటు
Also Read: IPL Highest Paid Players: వెంకటేశ్‌కు 4000% పెరిగిన సాలరీ..! ఐపీఎల్ తాజా కోటీశ్వరులు వీరే
Also Read: Neeraj Chopra: మోదీ చెప్పారు.. నీరజ్ మొదలు పెట్టాడు..! ఏంటా మిషన్..? ఎందుకు..?
Also Read: IPL Retentions 2022: బుమ్రా, సూర్య, వెంకీ, బట్లర్‌కు అన్యాయం జరిగిందా? ఎక్కువ డబ్బును వదిలేశారా?
Also Read: IND vs NZ 2nd Test: కోహ్లీ రాకతో టీమ్‌ఇండియాలో కొత్త సమస్య..! రెండో టెస్టులో...?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి