News
News
వీడియోలు ఆటలు
X

IND vs NZ 2nd Test, Shreyas Iyer: శ్రేయస్‌నూ కరుణ్‌ నాయర్‌లా తప్పిస్తారా? సీనియర్ల కోసం త్యాగం తప్పదా?

తొలి టెస్టులో శతకం, అర్ధశతకంతో మురిపించిన శ్రేయస్‌ అయ్యర్‌ను తప్పిస్తారేమోనన్న బెంగ అభిమానుల్లో మొదలైంది. కోహ్లీ రావడంతో ఎవరిని తీసేస్తారో తెలియని సందిగ్ధం ఏర్పడింది.

FOLLOW US: 
Share:

న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు వేళైంది! వాంఖడే వేదికగా పర్యాటక కివీస్‌తో కోహ్లీసేన తలపడుతోంది. ఈ మ్యాచుకు ముందు పరిస్థితులు ఒకలా ఉంటే ఇప్పుడు మరోలా ఉన్నాయి. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తిరిగి రావడంతో ఎవరిని పక్కన పెట్టాలో తెలియడం లేదు. కొంపదీసి కరుణ్‌ నాయర్‌ తరహాలోనే శ్రేయస్‌ అయ్యర్‌నూ పక్కన పెట్టేస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి!

నాయకుడి రాకతో..

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఎడతెరపి లేకుండా క్రికెట్‌ ఆడుతుండటంతో న్యూజిలాండ్‌తో టీ20 సిరీసు, తొలి టెస్టుకు విశ్రాంతినిచ్చారు. ఓపెనర్లుగా కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ ఉండటంతో శుభ్‌మన్‌ను నాలుగో స్థానంలో ఆడిస్తారని అంతా భావించారు. గాయం వల్ల రాహుల్‌ సిరీసుకు దూరమవ్వడంతో గిల్‌ ఓపెనింగ్‌ చేశాడు. అతడి స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ అరంగేట్రం చేశాడు.

అరంగేట్రంలో అదుర్స్‌

టీమ్‌ఇండియాలోని సీనియర్లు మయాంక్‌, రహానె, పుజారా విఫలమవ్వడంతో ఇన్నింగ్సులు నిర్మించాల్సిన భారం మిడిలార్డర్‌లో శ్రేయస్‌పై పడింది. అతడు న్యూజిలాండ్‌ పేసర్లు, స్పిన్నర్లను కాచుకొని అద్భుతంగా ఆడాడు. సమయోచితంగా డిఫెన్స్‌ చేస్తూ పరుగులు సాధించాడు. రంజీల్లో ముంబయి తరఫున ఆడిన అనుభవాన్ని తొలి ఇన్నింగ్స్‌లోనే ప్రదర్శించాడు. మొదటి మ్యాచులోనే శతకం బాదేసిన 16వ భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 51కే 5 వికెట్లు పడిన తరుణంలో అర్ధశతకం బాదేసి న్యూజిలాండ్‌కు మెరుగైన లక్ష్యం నిర్దేశించేలా చేశాడు.

కరుణ్‌ నాయర్‌ ట్రీట్‌మెంటా?

ఇప్పుడు కోహ్లీ రాకతో జట్టు కూర్పు మారనుంది. అతడి కోసం ఎవరు తమ స్థానాన్ని త్యాగం చేయాల్సి వస్తుందో తెలియడం లేదు! నిజానికి వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె కొన్నాళ్లుగా ఫామ్‌లో లేడు. కానీ అతడి అనుభవం అత్యంత విలువైనది. అతడిని పక్కకు తప్పించడం అంత సులువైన విషయం కాదు. ఇక చెతేశ్వర్‌ పుజారా సుదీర్ఘ ఇన్నింగ్సులు ఆడాల్సిన పరిస్థితుల్లో తప్పక ఉండాలి.

అందుకే ఒకప్పుడు త్రిశతక వీరుడు కరుణ్‌ నాయర్‌లా శ్రేయస్‌ అయ్యర్‌ను పక్కకు తప్పిస్తారా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. అప్పుడూ అంతే. అజింక్య స్థానంలో వచ్చిన కరుణ్‌ ఇంగ్లాండ్‌ను ఊచకోత కోశాడు. సెహ్వాగ్‌ తర్వాత త్రిశతకం బాదేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కానీ తర్వాతి మ్యాచుకే పక్కన పెట్టేశారు. మరో మూడు నెలలకు అవకాశం ఇచ్చినా ఆసీస్‌పై రాణించలేకపోయాడు. మరి ఇప్పుడేం జరుగుతుందో చూడాలి!!

Also Read: IPL Retention: కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లపై ఏడాది నిషేధం తప్పదా..! గతంలో స్టార్ ఆల్ రౌండర్‌పై వేటు 

Also Read: David Warner Tweet: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు డేవిడ్ వార్నర్ గుడ్ బై.. ఛాప్టర్ క్లోజ్ అంటూ ట్వీట్.. SRH ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు 

Also Read: IPL Highest Paid Players: వెంకటేశ్‌కు 4000% పెరిగిన సాలరీ..! ఐపీఎల్‌ తాజా కోటీశ్వరులు వీరే

Also Read: Neeraj Chopra: మోదీ చెప్పారు.. నీరజ్‌ మొదలు పెట్టాడు..! ఏంటా మిషన్‌..? ఎందుకు..?

Also Read: IPL Retentions 2022: బుమ్రా, సూర్య, వెంకీ, బట్లర్‌కు అన్యాయం జరిగిందా? ఎక్కువ డబ్బును వదిలేశారా?

Also Read: IND vs NZ 2nd Test: కోహ్లీ రాకతో టీమ్‌ఇండియాలో కొత్త సమస్య..! రెండో టెస్టులో...?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 03 Dec 2021 07:36 AM (IST) Tags: Virat Kohli Team India Shreyas Iyer Ind Vs NZ 2nd Test Karun Nair

సంబంధిత కథనాలు

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

Realme 11 Pro: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో సిరీస్ - త్వరలో మనదేశంలో కూడా - ఎప్పుడు రానుందంటే?

Realme 11 Pro: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో సిరీస్ - త్వరలో మనదేశంలో కూడా - ఎప్పుడు రానుందంటే?

LGM Second Look: ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ సెకండ్ లుక్ రివీల్ - ఎలా ఉందో చూశారా?

LGM Second Look: ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ సెకండ్ లుక్ రివీల్ -  ఎలా ఉందో చూశారా?

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !