IND vs NZ 2nd T20: బౌలింగ్ అద్భుతం - 99 పరుగులకే పరిమితమైన కివీస్!
భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది.
IND vs NZ 2nd T20 1st Innings Highlights: భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ తక్కువ స్కోరుకు పరిమితం అయింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ప్లేయర్స్‌లో మిషెల్ శాంట్నర్ (20 నాటౌట్: 23 బంతుల్లో, ఒక ఫోర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్‌కు రెండు వికెట్లు దక్కాయి. టీమిండియా విజయానికి 120 బంతుల్లో 100 పరుగులు కావాలి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిషెల్ శాంట్నర్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే న్యూజిలాండ్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు ఫిన్ అలెన్ (11: 10 బంతుల్లో, రెండు ఫోర్లు), డెవాన్ కాన్వే (11: 14 బంతుల్లో, ఒక ఫోర్) విఫలం అయ్యారు. వీరు అవుటయ్యే సరికి జట్టు స్కోరు 28 పరుగులు మాత్రమే. ఆ తర్వాత కూడా భారత బౌలర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు క్రీజులో నిలబడలేకపోయారు.
న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌లో ఫిన్ అలెన్ మాత్రమే 100కు పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. మిగతా ఎవరి స్ట్రైక్ రేట్ కనీసం 85 కూడా దాటలేదు. కెప్టెన్ మిషెల్ శాంట్నర్ (20 నాటౌట్: 23 బంతుల్లో, ఒక ఫోర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత జట్టు బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీసుకోగా, కుల్‌దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ హుడా తలో వికెట్ పడగొట్టారు.
భారత జట్టు సిరీస్‌ను గెలవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఎందుకంటే మొదటి మ్యాచ్‌లో గెలిచిన న్యూజిలాండ్ ఇప్పటికే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా గెలిస్తే 1-1తో సిరీస్ సమం కానుంది. అప్పుడు మూడో టీ20 మ్యాచ్ కీలకం కానుంది. ఒకవేళ న్యూజిలాండ్ గెలిస్తే 2-0తో సిరీస్ గెలుచుకోనుంది. ఆ సందర్భంలో మూడో టీ20 మ్యాచ్ నామమాత్రం కానుంది.
భారత తుదిజట్టు
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, కుల్‌దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్
న్యూజిలాండ్ తుదిజట్టు
ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), మార్క్ చాప్‌మన్, డేరిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, జాకబ్ డఫీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్
View this post on Instagram
View this post on Instagram