Washington Sundar Catch: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన సుందర్ - ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ20లో వాషింగ్టన్ సుందర్ పట్టిన క్యాచ్ వైరల్ అవుతోంది.
India vs New Zealand Washington Sundar Catch: భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ తొలి మ్యాచ్ రాంచీలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ కోసం వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
సుందర్ క్యాచ్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ దానికి ఫిదా అవుతున్నారు. పవర్‌ప్లేలోనే వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీశాడు. దీంతో టీమిండియా మ్యాచ్‌లో పై చేయి సాధించింది.
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే ఓపెనర్లుగా మైదానంలోకి వచ్చారు. 35 పరుగుల వద్ద అలెన్‌ను వాషింగ్టన్ సుందర్ అవుట్ చేశాడు. అతను అవుట్ అయిన తర్వాత, మార్క్ చాప్‌మన్ క్రీజులోకి చేరుకున్నాడు. కానీ వాషింగ్టన్ సుందర్ తనను డకౌట్ చేశాడు. ఐదో ఓవర్ చివరి బంతికి మార్క్ చాప్‌మన్ షాట్ కొట్టాడు. బంతి సుందర్ చేతికి అందేంత దూరంలోనే పడినట్లు కనిపించినప్పటికీ, ఇది చాలా కష్టమైన క్యాచ్. సుందర్ గాలి డైవ్ చేస్తూ ఈ క్యాచ్ పట్టుకున్నాడు.
సుందర్ క్యాచ్ పట్టిన వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. దీన్ని అభిమానులు విపరీతంగా ఇష్టపడుతున్నారు. అతి తక్కువ సమయంలోనే ట్విట్టర్‌లో మూడు వేల మందికి పైగా లైక్ చేశారు. ఇదే సమయంలో పలువురు అభిమానులు కూడా ఈ వీడియోపై కామెంట్లను కూడా చేశారు.
రాంచీ టీ20 మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేయడం గమనార్హం. అతను నాలుగు ఓవర్లలో 22 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. సుందర్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో న్యూజిలాండ్ ప్రారంభంలోనే కీలక వికెట్లు కోల్పోయింది.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో డెవాన్ కాన్వే (52: 35 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్), డేరిల్ మిషెల్ (59 నాటౌట్: 30 బంతుల్లో, మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లు) అర్థ సెంచరీలు సాధించారు. అర్ష్‌దీప్ వేసిన చివరి ఓవర్లో డేరిల్ మిషెల్ ఏకంగా 27 పరుగులు రాబట్టాడు.
న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే శుభారంభం చేశారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు 4.2 ఓవర్లలో 43 పరుగులు జోడించారు. ఫిన్ అలెన్ 23 బంతుల్లో 35 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఇక డ్వేన్ కాన్వే 35 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అతని ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. దీని తర్వాత చాలా మంది బ్యాట్స్‌మెన్ ఎక్కువగా రాణించలేక పెవిలియన్‌కు చేరుకున్నారు. అయితే చివర్లో డేరిల్ మిచెల్ 30 బంతుల్లో అజేయమైన 59 పరుగుల ఇన్నింగ్స్‌తో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు.
WHAT. A. CATCH 🔥🔥@Sundarwashi5 dives to his right and takes a stunning catch off his own bowling 😎#TeamIndia | #INDvNZ
— BCCI (@BCCI) January 27, 2023
Live - https://t.co/9Nlw3mU634 #INDvNZ @mastercardindia pic.twitter.com/8BBdFWtuEu