By: ABP Desam | Updated at : 14 Aug 2021 03:47 PM (IST)
రహానే, పుజారా (File Photo/ Getty Images)
వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్ అనంతరం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ ఆడుతోంది. అయితే గత కొంతకాలం నుంచి వరుసగా విఫలం అవుతున్న చతేశ్వర్ పూజారా.. అజింక్య రహానే ఈ ఇంగ్లాండ్ గడ్డపై వరుసగా విఫలమవుతున్నారు. దీనిపై లెజెండరీ క్రికెటర్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పుజారా, రహానే లో ప్రొఫైల్ ఆటగాళ్లు అని వ్యాఖ్యానించారు. అయితే వీరికి జట్టు సహచరుడు , రెండో టెస్టులో శతకవీరుడు కేఎల్ రాహుల్ మద్దతు తెలిపాడు.
గత అయిదు టెస్టుల్లో రహానే కేవలం ఒక్క అర్ధ శతకం మాత్రమే సాధించగా, స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ పుజారా కనీసం అర్థ శతకం సైతం చేయలేకపోయాడు. ఇంగ్లాండ్ గడ్డపై తొలి టెస్టులో 4, 12 పరుగులతో విఫలమైన పుజారా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 9 పరుగులకే వికెట్ సమర్పించుకోగా.. అజింక్య రహానే సైతం రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుకే పెవిలియన్ బాట పట్టాడు. తన సహచరులు పుజారా, రహానేలు త్వరలోనే మళ్లీ ఫామ్ అందిపుచ్చుకుంటారని కేఎల్ రాహుల్ (129) ధీమా వ్యక్తం చేశాడు. భారత జట్టు కోసం పుజారా, రహానే ఎంతో చేశారని.. క్లిష్ట సమయాల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు విజయాలు అందించారని కొనియాడాడు.
Also Read: IND vs ENG, 1st Innings Highlights: ముగిసిన రెండో రోజు ఆట... ఇంగ్లాండ్ 119/3 ... భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ 364 ఆలౌట్
‘పుజారా, రహానే వరల్డ్ క్లాస్ క్రికెటర్లు. వీరికి అపారమైన అనుభవం ఉంది. మళ్లీ ఫామ్‌లోకి రావడం ఎలాగో వారికి ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు ఇంగ్లాండ్ గడ్డపై ఆటడం సవాళ్లతో కూడుకుని ఉంటుంది. కొన్ని బంతులను సరిగ్గా ఆడితే వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఏ ఆటగాడైనా ప్రతి ఇన్నింగ్స్‌లో పరుగులు సాధించలేడు. కొన్ని సందర్భాలలో ఆటగాళ్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయని’ మీడియా సమావేశంలో కేఎల్ రాహుల్ పలు విషయాలు షేర్ చేసుకున్నాడు.
గత కొన్ని టెస్టుల నుంచి పూర్తిగా వైఫల్యం చెందుతున్న పుజారా, రహానేలు ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో త్వరగా ఔట్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరిద్దరు జట్టుకు భారంగా మారారని, వీరిని జట్టు నుంచి తప్పించి కొత్త కుర్రాళ్లకు అవకాశాలు కల్పించాలని మాజీలు సైతం సూచిస్తున్నారు. సునీల్ గవాస్కర్ మరో అడుగు ముందుకేసి.. రహానే, పుజారాలను లో ప్రొఫైల్ క్రికెటర్లు అని, టెక్నిక్ లోపాలు సరిదిద్దుకోవడం లేదని విమర్శించారు. వీరిద్దరిని జట్టు నుంచి తీసేసినా ఏ సమస్యా లేదని, రహానే, పుజారా కోసం చొక్కాలు చింపుకునే అభిమానులు లేరంటూ గవాస్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో జట్టు సహచరుడు, ఓపెనర్ రాహుల్ ఆ ఇద్దరికీ మద్దతుగా నిలిచాడు.
Also Read: Unmukt Chand Retirement: టీమిండియా తరఫున ఆడకుండానే... రిటైర్మెంట్ ప్రకటించిన 28 ఏళ్ల ఉన్ముక్త్ చంద్
ENG Vs IRE: సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన జో రూట్ - ఏ విషయంలో అంటే?
Pat Cummins: 2021 డబ్ల్యూటీసీ ఫైనల్‌పై ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యలు - అందుకే ఫైనల్స్‌కు రాలేదంటూ!
ENG vs IRE: బ్యాటింగ్‌కు రాలె - బౌలింగ్ చేయలె - అయినా మ్యాచ్ గెలిచాడు - బెన్ స్టోక్స్ అరుదైన ఘనత
Ben Stokes: ఐర్లాండ్ టెస్టులో బెన్ స్టోక్స్ ప్రత్యేక రికార్డు - ఇప్పటి వరకు ఏ కెప్టెన్ చేయనిది?
David Warner: అదే నా చివరి టెస్టు - రిటైర్మెంట్పై తేల్చేసిన వార్నర్ భాయ్
Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!
Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?