IND vs ENG, 1st Innings Highlights: ముగిసిన రెండో రోజు ఆట... ఇంగ్లాండ్ 119/3 ... భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ 364 ఆలౌట్
India vs England, 1st Innings Highlights: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో భారత జట్టు రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది.
భారత్ X ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఇంకా 245 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 126.1 ఓవర్లలో 364 పరుగులకి ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలన్ జేమ్స్ అండర్సన్ 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
That's Stumps on Day 2⃣ of the second #ENGvIND Test at Lord's!
— BCCI (@BCCI) August 13, 2021
England 119/3 & trail #TeamIndia by 245 runs.
2⃣ wickets for @mdsirajofficial
1⃣ wicket for @MdShami11
Joe Root unbeaten on 4⃣8⃣
Scorecard 👉 https://t.co/KGM2YELLde pic.twitter.com/5Tu0dsNVyu
ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ కూడా ఆదిలోనే వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయి కాస్త ఇబ్బందుల్లో పడింది. సిరాజ్ వేసిన 15వ ఓవర్లో వరుసు బంతుల్లో ఓపెనర్ సిబ్లీ(11), హసీబ్ హమీద్(0) ఔటయ్యారు. తర్వాత క్రీజులోకి వచ్చిన జో రూట్ మరో ఓపెనర్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. నిలకడగా ఆడుతూ భారత బౌలర్లపై పైచేయి సాధించారు. అలాగే క్రీజులో నిలబడే క్రమంలో మహ్మద్ షమి... మరో ఓపెనర్ బర్న్స్‌ను LBWగా పెవిలియన్ పంపాడు. దీంతో ఇంగ్లాండ్ 108 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
That Wicket Feeling! ☝️
— BCCI (@BCCI) August 13, 2021
Mood as @MdShami11 strikes to dismiss Rory Burns. 👍 👍 #TeamIndia #ENGvIND
Follow the match 👉 https://t.co/KGM2YELLde pic.twitter.com/zL2QkvaJKf
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 276/3తో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టును రెండో రోజు ఆదిలోనే దెబ్బ తీసింది ఇంగ్లాండ్. ఓపెనర్ కేఎల్ రాహుల్ (129: 250 బంతుల్లో 12x4, 1x6) రెండో బంతికే ఓలీ రాబిన్సన్ బౌలింగ్‌లో ఔటైపోయాడు. ఆ తర్వాతి ఓవర్లోనే రహానె కూడా ఔటయ్యాడు. రహానె (1, 23 బంతుల్లో) ఈ రోజు ఒక్క పరుగు కూడా సాధించలేదు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పంత్ కాసేపు జడేజాతో కలిసి స్కోరు బోర్డును కదిలించాడు. ఈ క్రమంలోనే భారత స్కోరు బోర్డు 300 మార్కును అందుకుంది. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో కట్ షాట్ ఆడబోయి పంత్ (37: 58 బంతుల్లో 5x4) ఔటయ్యాడు. రవీంద్ర జడేజా (40: 120 బంతుల్లో 3x4)ఒంటరి పోరాటం చేశాడు.
AlsoRead: Unmukt Chand Retirement: టీమిండియా తరఫున ఆడకుండానే... రిటైర్మెంట్ ప్రకటించిన 28 ఏళ్ల ఉన్ముక్త్ చంద్
కానీ, అతనికి మద్దతుగా ఎవరూ క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేదు. షమి, బుమ్రా పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. రహానె(1), పుజారా (9) ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. రోహిత్ శర్మ (83), విరాట్ కోహ్లీ(42) మంచి స్కోర్లు సాధించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 5 వికెట్లు పడగొట్టగా.. ఓలీ రాబిన్సన్, మార్క్‌వుడ్ చెరో రెండు వికెట్లు, మొయిన్ అలీకి ఒక వికెట్ దక్కింది.
AlsoRead: IPL 2021: UAE బయల్దేరిన ధోనీ సేన... మొదలైన IPL సందడి... చెన్నై సూపర్ కింగ్స్ ఫొటోలు వైరల్