By: ABP Desam | Updated at : 22 Mar 2023 03:56 PM (IST)
డేవిడ్ వార్నర్ క్యాచ్ అందుకుంటున్న హార్దిక్ పాండ్యా (Image Credit: BCCI)
భారత్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ నిదానంగా సాగుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 25 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 126 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా ఓపెనర్ మిషెల్ మార్ష్ (47: 47 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) ప్రస్తుతానికి టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఇప్పుడు క్రీజులో మార్నస్ లబుషేన్ (20 నాటౌట్: 35 బంతుల్లో, ఒక సిక్సర్), అలెక్స్ కారీ (1 నాటౌట్: 3 బంతుల్లో) ఉన్నారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు తీసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (33: 31 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), మిషెల్ మార్ష్ (47: 47 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) ఆస్ట్రేలియాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరు మొదటి వికెట్‌కు 10.5 ఓవర్లలోనే 68 పరుగులు జోడించారు. ఈ దశలో ఆస్ట్రేలియాను హార్దిక్ పాండ్యా దెబ్బ తీశాడు. ట్రావిస్ హెడ్ వికెట్‌ను తీసి భారత్‌కు మొదటి బ్రేక్ ఇచ్చాడు. అనంతరం తన వరుస ఓవర్లలో మరో ఓపెనర్ మిషెల్ మార్ష్, వన్ డౌన్ బ్యాటర్, కెప్టెన్ అయిన స్టీవ్ స్మిత్‌లను (0: 3 బంతుల్లో) కూడా వెనక్కి పంపాడు. దీంతో ఆస్ట్రేలియా 14.3 ఓవర్లలోనే 85 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరు నాలుగో వికెట్‌కు 40 పరుగులు జోడించారు. క్రమంగా ఇద్దరూ క్రీజులో కుదురుకుంటున్న దశలో ఈసారి కుల్‌దీప్ యాదవ్ ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చాడు. డీప్ మిడ్ వికెట్ వైపు లాఫ్టెడ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన డేవిడ్ వార్నర్ లాంగాఫ్‌లో హార్దిక్ పాండ్యా చేతికి చిక్కాడు. దీంతో ఆస్ట్రేలియా 25 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు నష్టపోయి 126 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మార్నస్ లబుషేన్ (20 నాటౌట్: 35 బంతుల్లో, ఒక సిక్సర్), అలెక్స్ కారీ (1 నాటౌట్: 3 బంతుల్లో) ఉన్నారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యాకు మూడు, కుల్దీప్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కాయి.
తుది జట్లు
టీమ్‌ఇండియా : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ కేరీ, మార్కస్ స్టాయినిస్, ఏస్టన్ ఆగర్, సేన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా
𝐎𝐔𝐓
— BCCI (@BCCI) March 22, 2023
It is wicket No. 4 as @imkuldeep18 gets David Warner for 23. Hardik Pandya is once again in action as he takes a fine catch.
Live - https://t.co/eNLPoZpSfQ #INDvAUS @mastercardindia pic.twitter.com/AQKB7wMx08
.@hardikpandya7 strikes once again and it's the big wicket of Mitchell Marsh who is bowled for 47 runs.
— BCCI (@BCCI) March 22, 2023
Live - https://t.co/eNLPoZpSfQ #INDvAUS @mastercardindia pic.twitter.com/Nbpt2i91la
IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!
French Open 2023: ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న ఇగా స్వియాటెక్ - లేడీ నాదల్ రేంజ్లో వరుస రికార్డులు!
WTC Final 2023: చీటర్స్ చీటర్స్ అంటూ హోరెత్తుతున్న ఓవల్ - గిల్ వివాదాస్పద ఔట్‌పై ట్విటర్లో ఆగ్రహం
WTC Final 2023: హెడ్‌కోచ్‌గా ద్రావిడ్ జీరో- టీమిండియాను దేవుడే కాపాడాలి - పాక్ మాజీ ఆటగాడి షాకింగ్ కామెంట్స్
Bumrah Comeback: బుమ్రా కమ్‌బ్యాక్‌పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన దినేశ్ కార్తీక్ - పేస్ గుర్రం ఎంట్రీ అప్పుడే!
KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట
Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!
Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!
Telangana News : కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !