French Open 2023: ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న ఇగా స్వియాటెక్ - లేడీ నాదల్ రేంజ్‌లో వరుస రికార్డులు!
ఫ్రెంచ్ ఓపెన్ 2023 మహిళల సింగిల్స్ టైటిల్‌ను పోలండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్ గెలుచుకుంది.
పోలండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్‌లో తన డామినేషన్ కొనసాగిస్తుంది. గత నాలుగేళ్లలో మూడో ఫ్రెంచ్ ఓపెన్‌ను స్వియాటెక్ గెలుచుకుంది. శనివారం జరిగిన థ్రిల్లింగ్ ఫైనల్లో అన్ సీడెడ్ కరోలినా ముచోవాపై 6-2 5-7 6-4 తేడాతో గెలుపొందారు.
ఓపెన్ శకంలో మోనికా సెలెస్, నవోమి ఒసాకాల తర్వాత ఆడిన నాలుగు ఫైనల్స్‌లోనూ విజయం సాధించిన క్రీడాకారిణిగా ఇగా స్వియాటెక్ నిలిచింది. మొదటి సెట్‌ను చాలా వేగంగా గెలుచుకున్న ఇగా స్వియాటెక్ రెండో సెట్‌ను కోల్పోయింది. కానీ కీలకమైన మూడో సెట్‌లో ఒత్తిడిని జయించి ట్రోఫీని కూడా గెలుచుకుంది.
కేవలం 22 సంవత్సరాల వయసులోనే నాలుగో టైటిల్‌ను ఇగా స్వియాటెక్ గెలుచుకుంది. ఓపెన్ శకంలో మోనికా సెలెస్ తర్వాత వరుసగా ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కురాలైన క్రీడాకారిణిగా ఇగా స్వియాటెక్ నిలిచింది.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram