అన్వేషించండి

ICC World Cup 2023: పసికూనపై కివీస్‌ ఘన విజయం, పతకాల పట్టికలో అగ్రస్థానం పదిలం

ICC World Cup 2023 : ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించిన న్యూజిలాండ్‌... రెండో మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించింది.

ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించిన న్యూజిలాండ్‌... రెండో మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించింది. హైదరాబాద్‌ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లోనూ పసికూన నెదర్లాండ్స్‌పై కివీస్‌ ఘన విజయం సాధించింది. అంచనాలకు తగ్గట్లే ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో డచ్‌ జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వని న్యూజిలాండ్‌... 99 పరుగుల తేడాతో విజయదుంధుభి మోగించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌  50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు సాధించింది. 323 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌... 46.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో  పాయింట్ల పట్టికలో కివీస్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 
 
   ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన నెదర్లాండ్స్‌.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కివీస్‌కు ఓపెనర్‌లు డెవాన్‌ కాన్వే, విల్‌ యంగ్‌ శుభారంభం ఇచ్చారు. విల్ యంగ్ (70; 80 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో మెరిశాడు. ఇంగ్లాండ్‌పై భారీ శతకం బాదిన డేవాన్ కాన్వే (32) ఈ మ్యాచ్‌లో తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. రచిన్ రవీంద్ర (51; 51 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) మరోసారి ఆకట్టుకున్నాడు. రచిన్‌ రవీంద్ర ఓపెనర్‌ విల్‌ యంగ్‌తో కలిసి చక్కని ఇన్నింగ్స్‌ ఆడాడు. జట్టు స్కోర్‌ 144 పరుగుల వద్ద యంగ్‌ 70 అవుటయ్యాడు. 185 పరుగుల వద్ద రచిన్‌ రవీంద్ర 51 (3 ఫోర్లు, 1 సిక్సర్‌)  కూడా వెనుదిరిగాడు. వికెట్ కీపర్‌ టామ్ లాథమ్‌ (53; 46 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా అర్ధ శతకం సాధించాడు. డారిల్ మిచెల్ (48; 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) త్రుటిలో హాఫ్‌ సెంచరీ మిస్ చేసుకున్నాడు. చివర్లో శాంట్నర్‌ కేవలం 17 బంతుల్లో అజేయంగా 36 పరుగులు చేశాడు. మూడు ఫోర్‌లు, రెండ్‌ సిక్సర్‌లు బాదాడు. దాంతో జట్టు స్కోర్‌ నిర్ణీత 50 ఓవర్లలో 322 పరుగులకు చేరింది. నెదర్లాండ్స్‌ బౌలర్లలో వాన్‌ డెర్‌ మెర్వ్‌, వాన్‌ మీకెరెన్‌, ఆర్యన్‌ దత్‌ రెండేసి వికెట్ల చొప్పున తీశారు. బాస్‌ డీ లీడె ఒక వికెట్‌ తీశాడు.
 
  323 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్... ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. భారత సంతతి ఆటగాడు విక్రమ్ జిత్‌ సింగ్‌, మాక్స్‌ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. కానీ వన్‌డౌన్ బ్యాటర్‌ కోలిన్ నీల్ అకెర్మాన్ అద్భుత అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. 73 బంతుల్లో 5 ఫోర్లతో 69 పరుగులు చేసి నెదర్లాండ్స్‌ మరీ ఘోరంగా పరాజయం పాలవ్వకుండా కాపాడాడు. మిగిలిన బ్యాటర్లందూ ఓ మోస్తరు పరుగులు చేశారు. మిచెల్‌ శాంటర్న్‌ అయిదు వికెట్లు నేలకూల్చి నెదర్లాండ్స్‌ పతనాన్ని శాసించాడు. హెన్రీ కూడా మూడు వికెట్లు తీశాడు. ఈ ఇద్దరి బౌలర్ల ప్రదర్శనతో 46.3 ఓవర్లలో నెదర్లాండ్స్‌ 223 పరుగులకు ఆలౌట్‌ అయింది. 
 
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. డేవాన్‌ కాన్వే, రచిన్‌ రవీంద్ర శతకాలతో చెలరేగడంతో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ను న్యూజిలాండ్‌ చిత్తు చేసింది. బ్రిటీష్‌ బౌలర్లను ఊచకోత కోసిన కివీస్‌ బ్యాటర్లు కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి.. ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని మరో 82 బంతులు మిగిలి ఉండగానే సునాయసంగా ఛేదించారు. 273 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో కాన్వే, రచిన్‌ రవీంద్ర కివీస్‌కు ఘన విజయం అందించారు.

టాప్ హెడ్ లైన్స్

Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Gambhir Coach Tenure: గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!
గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!
Rohit Sharma's Future Twist: రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!
రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!
Sarfaraz Vs Jurel IND vs SL: సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీతో ప్లేయింగ్ ఎలెవన్ లో బిగ్ డిబేట్..జురెల్, స‌ర్ఫ‌రాజ్ మ‌ధ్య‌లో పోటీ.. 15 నుంచి తొలి టెస్టు!
సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీతో ప్లేయింగ్ ఎలెవన్ లో బిగ్ డిబేట్..జురెల్, స‌ర్ఫ‌రాజ్ మ‌ధ్య‌లో పోటీ.. 15 నుంచి తొలి టెస్టు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget