ICC T20 WC 2021, PAK vs AUS Preview: సెమీస్‌లో పాక్, ఆసీస్ ఢీ.. ఫైనల్స్‌కు వెళ్లేదెవరో?
ICC T20 WC 2021, PAK vs AUS: టీ20 వరల్డ్‌కప్ రెండో సెమీఫైనల్‌లో పాకిస్తాన్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌తో పోటీ పడనుంది.
టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్‌లో నేడు పాకిస్తాన్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. పాకిస్తాన్ ఈ టోర్నీలో ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నవంబర్ 14వ తేదీన ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది.
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌కు చేరడం ఐదోసారి. 2007, 2009, 2010, 2012 వరల్డ్‌కప్‌ల్లో కూడా పాకిస్తాన్ సెమీస్‌కు చేరుకుంది. 2009లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు చేరడం ఇది నాలుగోసారి కాగా.. ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఇంతకుముందు 2007, 2010, 2012 వరల్డ్ కప్‌ల్లో ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకుంది. 2010 వరల్డ్ కప్ సెమీస్‌లో ఈ రెండు జట్లూ తలపడగా.. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
పాకిస్తాన్ ఈ వరల్డ్‌కప్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ అలవోకగా విజయం సాధించింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. ఇక బ్యాటింగ్ లైనప్ కూడా బలంగానే ఉంది. అయితే ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్ ఇద్దరికీ స్వల్పంగా ఫ్లూ జ్వరం వచ్చింది. వీరు మ్యాచ్ ఆడతారా లేదా అనే విషయంలో కాస్త సందిగ్ఠం నెలకొంది.
మరోవైపు ఆస్ట్రేలియా కూడా అంతే బలంగా కనిపిస్తుంది. డేవిడ్ వార్నర్ ఫాంలోకి రావడం ఆస్ట్రేలియాకు ఊరటనిచ్చే అంశం. వెస్టిండీస్‌పై 89 పరుగులు సాధించడంతో పాటు నాటౌట్‌గా కూడా నిలిచాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మిషెల్ మార్ష్‌ను ప్రమోట్ చేయడం కూడా బాగా కలిసొచ్చింది. దీనికి తోడు ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగం కూడా చాలా బలంగా ఉంది.
పాకిస్తాన్ తుదిజట్టు(అంచనా)
మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), బాబర్ ఆజమ్(కెప్టెన్), ఫకార్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, షాదబ్ ఖాన్, ఇమాద్ వసీం, హసన్ అలీ, హరీస్ రౌఫ్, షహీన్ అఫ్రిది
ఆస్ట్రేలియా తుదిజట్టు(అంచనా)
డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్(కెప్టెన్), మిషెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్, మిషెల్ స్టార్క్, ఆడం జంపా, జోష్ హజిల్‌వుడ్
Also Read: Rape Threats Arrest : క్రికెటర్ కుమార్తెకు అత్యాచార బెదిరింపుల కేసులో హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్ !
Also Read: ENG vs NZ, Match Highlights: మొదటిసారి ఫైనల్స్‌కు న్యూజిలాండ్.. బై.. బై.. ఇంగ్లండ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి