NZ vs SCT, Match Highlights: వెల్డన్ స్కాట్లాండ్..! గప్తిల్ దడదడలాడించినా.. ఆఖరి వరకు పోరాడావ్!
టీమ్‌ఇండియాను వణికించిన న్యూజిలాండ్‌కు స్కాట్లాండ్ చెమటలు పట్టించింది. త్రుటిలో విజయం చేజార్చుకుంది. ఛేదనలో ఆ జట్టు తెగువను అభినందించి తీరాల్సిందే.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్-12లో న్యూజిలాండ్ రెండో విజయం అందుకుంది. స్కాంట్లాండ్‌ను 16 పరుగుల తేడాతో ఓడించింది. దుబాయ్‌లో 173 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్థిని 156/5కి పరిమితం చేసింది.
మొదట కివీస్‌లో మార్టిన్ గప్తిల్ (93: 56 బంతుల్లో 6x4, 7x6) చితక్కొట్టాడు. అతడికి గ్లెన్ ఫిలిప్స్ (33: 37 బంతుల్లో 1x6) తోడుగా నిలిచాడు. స్కాట్లాండులో మైకేల్ లీస్క్ (42*: 20 బంతుల్లో 3x4, 3x6) మాథ్యూ క్రాస్ (27: 29 బంతుల్లో 5x4), జార్జ్ మున్సే (22: 18 బంతుల్లో 1x4, 2x6) ఫర్వాలేదనిపించారు. కఠినమైన కివీస్ బౌలింగ్‌ను ఎదుర్కొని ఆ జట్టు ఆటౌట్ కాకపోవడం ఆశ్చర్యపరిచింది. బౌల్ట్, సోధి చెరో 2 వికెట్లు తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ పవర్‌ప్లేలో రెండు వికెట్లు చేజార్చుకుంది. జట్టు స్కోరు 35 వద్ద ఓకే ఓవర్లో డరైల్ మిచెల్ (13), కేన్ విలియమ్సన్ (0) ఔటయ్యారు. ఏడో ఓవర్ తొలి బంతికే డేవాన్ కాన్వే (1) పెవిలియన్ చేరడంతో కివీస్ ఒత్తిడిలో పడుతుందని అనుకున్నారు. కానీ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ ప్రత్యర్థి ఆటలు సాగనివ్వలేదు. టీ20ల్లో 3000 పరుగుల మైలురాయి అందుకున్నాడు.
అదే పనిగా బౌండరీలు, సిక్సర్లు బాదిన గప్తిల్ 35 బంతుల్లోనే అర్ధశతకం దంచేశాడు. దాంతో కివీస్ 12.4 ఓవర్లలో 100 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీ తర్వాత గప్తిల్ మరింత చెలరేగి ఫిలిప్స్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 73 బంతుల్లో 105 పరుగుల భాగస్వామ్యం అందించాడు. చూస్తుండగానే శతకానికి చేరువయ్యాడు. అయితే వేల్ వేసిన 19వ ఓవర్లో వరుస బంతుల్లో ఫిలిప్స్, గప్తిల్ ఔటయ్యారు. అప్పటికి స్కోరు 157. ఆఖర్లో నీషమ్ (10) బ్యాటు ఝుళింపించడంతో కివీస్ 172/5తో నిలిచింది. బ్రాడ్‌వేల్, షరీఫ్ చెరో రెండు వికెట్లు తీశారు.
Also Read: Khel Ratna Award 2021: ఈసారి 12 మందికి ఖేల్‌రత్న.. ఒలింపియన్లకు గౌరవం.. జాబితాలో మిథాలీ, ఛెత్రీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
A valiant effort from Scotland but New Zealand clinch the victory ✌️#T20WorldCup | #NZvSCO | https://t.co/Huz67z1YXm pic.twitter.com/p52FHFLuQP
— T20 World Cup (@T20WorldCup) November 3, 2021
Bowled him 💥
— T20 World Cup (@T20WorldCup) November 3, 2021
Tim Southee castles Matt Cross who walks back after a knock of 27. #T20WorldCup | #NZvSCO | https://t.co/Huz67z1YXm pic.twitter.com/tWWTnmwxsT