అన్వేషించండి

Wimbledon 2023: కుర్రాడు కుమ్మేశాడు - కొండను ఢీకొట్టి వింబుల్డన్ నెగ్గిన అల్కరాస్ - ఫ్యూచర్ స్టార్ అతడేనా?

స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాస్ వింబుల్డన్‌లో చరిత్ర సృష్టించాడు. తన వయసు కంటే ఎక్కువ అనుభవమున్న దిగ్గజం నొవాక్ జకోవిచ్‌కు వింబుల్డన్ సెంటర్ కోర్ట్‌లో ఓటమి ఎలా ఉంటుందో రుచి చూపించాడు.

Wimbledon 2023: టెన్నిస్ ప్రపంచంతో పాటు యావత్ క్రీడాభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన  వింబుల్డన్ - 2023 ఫైనల్‌లో సంచలనం నమోదైంది. 23 గ్రాండ్‌స్లామ్స్ గెలిచి  మరొకటి గెలిస్తే  అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన మార్గరెట్ కోర్ట్ రికార్డును సమం చేయాలన్న  సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్  ఆశలను అడియాసలు చేస్తూ  స్పెయిన్ బుల్  రఫెల్ నాదల్ లేని లోటును భర్తీ చేస్తూ ఓ కొత్త సంచలనం దూసుకొచ్చింది. ఆ సంచలనం పేరు కార్లొస్ అల్కరాస్.. ఇటీవలే 20వ పుట్టినరోజు జరుపుకున్న  ఈ కుర్రాడు.. తన వయసు కంటే ఎక్కువ అనుభవమున్న  జకోవిచ్‌కు ఝలక్ ఇచ్చాడు. వింబుల్డన్ సెంటర్ కోర్ట్‌లో 45 మ్యాచ్‌లు ఆడి ఓటమన్నదే లేని జకోకు.. ‘ఇదిగో.. ఓటమి అంటే ఇలా ఉంటుంది’ అని  రుచి చూపించాడు. 

ఎవరీ అల్కరాస్..

కార్లొస్ అల్కరాస్ గర్ఫియా.. స్పెయిన్ దేశస్తుడు.  ప్రపంచానికి దిగ్గజ  టెన్నిస్ క్రీడాకారుడు రఫెల్ నాదల్‌ను అందించిన దేశం నుంచి వచ్చాడు. తండ్రి గొంజాలెజ్  కూడా టెన్నిస్ ఆటగాడే.  నాలుగేండ్ల వయసులోనే రాకెట్ పట్టిన అల్కరాస్‌.. తన తండ్రి డైరెక్టర్‌గా ఉన్న ఓ టెన్నిస్ క్లబ్‌లోనే ఆటకు సంబంధించిన పాఠాలు నేర్చుకున్నాడు. బాలుడిగా స్పెయిన్‌లోని  రియల్ సోసిడెడ్ క్లబ్‌కు ఆడిన  అతడు.. 2018లో తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌ను స్టార్ట్ చేశాడు.  రెండుసార్లు ఒలింపిక్ ఛాంపియన్,  ఫ్రెంచ్ ఓపెన్ మాజీ విజేత జువాన్ కార్లొస్ ఫెరారో శిక్షణలో రాటుదేలాడు. 16 ఏండ్లకు టెన్నిస్‌లో ప్రఖ్యాతిగాంచిన ఏటీపీ టోర్నీలో అడుగుపెట్టాడు. 17 ఏండ్ల వయసులోనే  గ్రాండ్‌స్లామ్ ఆడాడు. 

2022 నుంచి తగ్గేదేలే.. 

2021లో ఆస్ట్రేలియా ఓపెన్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అల్కరాస్..   18వ ఏట   మ్యాడ్రిడ్ ఓపెన్ గెలిచాడు. ఈ టోర్నీలో భాగంగా చిన్నప్పట్నుంచి తాను ఎంతగానో ఆరాధించిన రఫెల్ నాదల్‌ను  రెండో రౌండ్‌లోనే ఓడించాడు. ఈ టోర్నీలో నాదల్‌తో పాటు జకోవిచ్, జ్వెరెవ్ వంటి ఆటగాళ్లను సైతం నిలువరించాడు.  2021 జులైలో క్రొయేషియా ఓపెన్ ఉమాగ్ గెలిచిన అల్కరాస్.. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. 2022 నుంచి అయితే అల్కరాస్ ఓ సంచలనంలా దూసుకొస్తున్నాడు.  గతేడాది  యూఎస్ ఓపెన్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఫైనల్‌లో ఐదో సీడ్ కాస్పర్ రూడ్‌ను ఓడించి అతి పిన్న వయసులోనే (19 ఏండ్ల 4 నెలల ఆరు రోజులు) గ్రాండ్ స్లామ్ గెలుచుకున్న  ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇక ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరుకున్న అల్కరాస్..  సెమీఫైనల్‌లో  జకోవిచ్ చేతిలో ఓడాడు. మ్యాచ్ ఓడినా అతడి పోరాటం మాత్రం అందరినీ కట్టిపడేసింది.  తాజాగా  వింబుల్డన్‌లో వరుసగా ఐదో ఫైనల్ ఆడుతూ.. సెంటర్ కోర్ట్‌లో అపజయమన్నదే లేని జకోవిచ్‌కు ఓటమి రుచి చూపించి కొత్త చరిత్ర  లిఖించాడు. 

 

నాదల్‌కు వీరాభిమాని.. 

స్పెయిన్‌కే చెందిన నాదల్ అంటే  అల్కరాస్‌కు వీరాభిమానం. చిన్ననాటి నుంచి నాదల్‌ను ఆరాధ్య దైవంగా భావించిన  అల్కరాస్‌ను కొత్తలో ‘ఫ్యూచర్ నాదల్’ అని కూడా పిలిచారు.  అయితే  నాదల్‌‌ను అమితంగా ఇష్టపడే అల్కరాస్‌ ఆట స్విస్ దిగ్గజం  రోజర్ ఫెదరర్‌ను పోలి ఉంటుంది. ‘నా ఆట ఫెదరర్‌ను పోలి ఉంటుంది. కానీ నేను రఫాకు వీరాభిమానిని. నేను రఫాలా అవ్వాలనుకుంటున్నాను..’ అని ఓ ఇంటర్వ్యూలో  అల్కరాస్ వెల్లడించాడు. 

ఫ్యూచర్ స్టార్.. 

కెరీర్‌లో రెండో గ్రాండ్ స్లామ్ నెగ్గిన అల్కరాస్‌ను టెన్నిస్‌లో భావి సూపర్ స్టార్‌గా కీర్తిస్తున్నారు అభిమానులు.  ఇప్పటికే  ఫెదరర్ రిటైర్  అవడం.. నాదల్ కూడా రిటైర్మెంట్ అధికారికంగా ప్రకటించకపోయినా దాదాపు అదే దశలో ఉండటం.. జకోవిచ్ కూడా  ఇదే లైన్‌లోకి రావడంతో నవతరం  టెన్నిస్ స్టార్స్‌పై ఆసక్తికర  చర్చ జరుగుతోంది. ఫెదరర్, నాదల్, జకోవిచ్‌‌లను భర్తీ చేసే రేసులో  ప్రస్తుతం ఉన్న  యువ ఆటగాళ్లలో  మాటియో బెరెట్టిని (ఇటలీ), స్టెఫనోస్ సిట్సిపస్ (గ్రీక్), అలగ్జాండెర్ జ్వెరెవ్ (జర్మనీ), డానియల్ మెద్వదెవ్ (రష్యా), కార్లొస్ అల్కరాస్ (స్పెయిన్) ముందున్నారు. వీరందరిలో  పిన్న వయస్కుడు అల్కరాసే కావడం గమనార్హం. తన ఆటతో దిగ్గజాలను మట్టికరిపించిన అల్కరాస్..  నిలకడగా ఆడుతున్నాడు. త్వరలోనే అతడు టెన్నిస్ ప్రపంచాన్ని  ఏలడం ఖాయమని  అభిమానులు, విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో అల్కరాస్  ఎలాంటి  అద్భుతాలు చేస్తాడో చూడాలి మరి..! 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget