Fielding Coach Post: ఫీల్డింగ్‌ కోచ్‌ పదవులకు దరఖాస్తు చేసిన మాజీ క్రికెటర్లు.. ఎవరో తెలుసా?

టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌ కోచ్‌ పదవి కోసం చాలామంది పోటీ పడుతున్నారు. కొందరు మాజీ క్రికెటర్లు ఇందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరే ఎన్‌సీఏ పదవులకూ అప్లై చేసుకోవడం గమనార్హం.

FOLLOW US: 

టీమ్‌ఇండియా సహాయ సిబ్బంది నియామకాలకు స్పందన లభిస్తోంది. కోచింగ్‌ పదవులకు దరఖాస్తులు వస్తున్నాయి. తాజాగా ఫీల్డింగ్‌ కోచ్‌ పదవులకు ఇద్దరు మాజీ క్రికెటర్లు దరఖాస్తు చేశారు. మాజీ వికెట్‌ కీపర్‌ అజయ్‌ రాత్రాతో పాటు అభయ్‌ శర్మ అప్లై చేశారని తెలిసింది.

భారత జట్టు ప్రధాన కోచ్‌, సహాయ సిబ్బంది కోసం బీసీసీఐ కొన్నాళ్ల క్రితం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దాదాపుగా ప్రధాన కోచ్‌ పదవికి రాహుల్‌ ద్రవిడ్‌ ఎంపిక ఖాయమే. నిబంధనల ప్రకారం నామమాత్రంగా ఆ పదవికి దరఖాస్తులు ఆహ్వానించారు. మొదట ద్రవిడ్‌ అంగీకరించనప్పటికీ గంగూలీ,జే షా అతడితో నిరంతరం చర్చలు జరిపారు. చివరికి భారత క్రికెట్‌ ప్రయోజనాల దృష్ట్యా అతడు అంగీకారం తెలిపాడు. ఏటా రూ.10.5 కోట్ల వేతనం అతడికి ఆఫర్‌ చేశారని తెలుస్తోంది.

ఫీల్డింగ్‌ కోచ్‌ పదవికి దరఖాస్తు చేసిన అజయ్‌ రాత్రా టీమ్‌ఇండియా తరఫున ఆరు టెస్టులు, 12 వన్డేలు ఆడాడు. ప్రస్తుతం అస్సాం జట్టుకు కోచ్‌గా పనిచేస్తున్నారు. ఇక అభయ్‌ శర్మ ఇండియా సీనియర్‌, ఇండియా-ఏ, అండర్‌-19 జట్లకు ఫీల్డింగ్‌ కోచ్‌గా చేశారు. వీరిద్దరే కాకుండా బిజూ జార్జ్‌, శుభదీప్‌ ఘోష్‌, టి దిలీప్‌ సైతం పోటీలో ఉన్నారు. వీరంతా జాతీయ క్రికెట్‌ అకాడమీ పదవులకూ దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.

రెండు వారాల క్రితం రాహుల్‌ ద్రవిడ్‌, చీఫ్ సెలక్టర్‌ చేతన్ శర్మ, అభయ్‌ కురువిల్లా మరో ఇద్దరు సెలక్టర్లు ఎన్‌సీఏ బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ పదవులకు దరఖాస్తులు చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు.

Also Read: Baba Ramdev on Ind vs Pak: 'దేశం కోసం.. ధర్మం కోసం'.. పాక్‌తో మ్యాచ్‌ వద్దంటున్న బాబా రాందేవ్‌!

Also Read: Ind Vs Pak: పంతం నీదా.. నాదా.. సై.. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ నేడే

Also Read: T20 WC, BAN vs SL Preview: బంగ్లా పులులా? లంకేయులా? సూపర్‌ 12లో షాకిచ్చేదెవరు?

Also Read: ENG Vs WI, Match Highlights: వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ విజయం.. ఆ రికార్డు బ్రేక్!

Also watch: T20 World Cup 2021: పదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?

Also Read: Virat Kohli Pressmeet: మంటలో పెట్రోల్ పోయను.. మాట్లాడటానికేమీ లేదు.. ప్రెస్‌మీట్‌లో కోహ్లీ ఏమన్నాడంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 24 Oct 2021 02:37 PM (IST) Tags: BCCI Indian Team Rahul Dravid Ajay Ratra Abhay Sharma fielding coach

సంబంధిత కథనాలు

KS Bharat vs Rishabh Pant: విశాఖ వికెట్‌ కీపర్‌కు రిషభ్ పంత్‌ భయపడ్డాడా?

KS Bharat vs Rishabh Pant: విశాఖ వికెట్‌ కీపర్‌కు రిషభ్ పంత్‌ భయపడ్డాడా?

Srikanth and Jafrin Meet CM Jagan: సీఎం జగన్ కలిసిన క్రీడాకారులు శ్రీకాంత్‌, జాఫ్రిన్- బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన జగన్

Srikanth and Jafrin Meet CM Jagan: సీఎం జగన్ కలిసిన క్రీడాకారులు శ్రీకాంత్‌, జాఫ్రిన్-  బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన జగన్

India tour of Ireland: సీక్రెట్‌గా ట్రైనింగ్‌! డీకే రూట్‌లో వెళ్తున్న సంజు శాంసన్‌!!

India tour of Ireland: సీక్రెట్‌గా ట్రైనింగ్‌! డీకే రూట్‌లో వెళ్తున్న సంజు శాంసన్‌!!

Kapil Dev On Kohli: మీకే కాదు నాకూ బాధేస్తోందన్న కపిల్‌దేవ్‌!

Kapil Dev On Kohli: మీకే కాదు నాకూ బాధేస్తోందన్న కపిల్‌దేవ్‌!

Leicestershire vs India: అర్థ సెంచరీతో మెరిసిన తెలుగు తేజం కేఎస్ భరత్ - మొదటిరోజు భారత్ స్కోరు ఎంతంటే?

Leicestershire vs India: అర్థ సెంచరీతో మెరిసిన తెలుగు తేజం కేఎస్ భరత్ - మొదటిరోజు భారత్ స్కోరు ఎంతంటే?

టాప్ స్టోరీస్

PM Modi Bengaluru Visit: ప్రధాని వస్తున్నారని హడావుడిగా రోడ్డు వేశారు, ఇప్పుడేమో తలలు పట్టుకుంటున్నారు

PM Modi Bengaluru Visit: ప్రధాని వస్తున్నారని హడావుడిగా రోడ్డు వేశారు, ఇప్పుడేమో తలలు పట్టుకుంటున్నారు

Virata Parvam: విరాట పర్వానికి కమల్‌ హాసన్‌కు లింకేంటి? వెంకటేష్ ప్రభు కార్తీక్ రాజా పేరు ధనుష్‌గా ఎలా మారింది?

Virata Parvam: విరాట పర్వానికి కమల్‌ హాసన్‌కు లింకేంటి? వెంకటేష్ ప్రభు కార్తీక్ రాజా పేరు ధనుష్‌గా ఎలా మారింది?

Special Hotel In Vizag: వైజాగ్‌లో సూరీడు నడిపించే హోటల్‌ గురించి తెలుసా?

Special Hotel In Vizag: వైజాగ్‌లో సూరీడు నడిపించే హోటల్‌ గురించి తెలుసా?

Indian Students Visa: స్టూడెంట్ వీసా జారీలో జాప్యానికి కారణమిదేనట, ఇంతకీ భారత్ ప్రయత్నాలు ఫలిస్తాయా?

Indian Students Visa: స్టూడెంట్ వీసా జారీలో జాప్యానికి కారణమిదేనట, ఇంతకీ భారత్ ప్రయత్నాలు ఫలిస్తాయా?