Baba Ramdev on Ind vs Pak: 'దేశం కోసం.. ధర్మం కోసం'.. పాక్‌తో మ్యాచ్ వద్దంటున్న బాబా రాందేవ్!
ప్రపంచకప్‌లో భారత్, పాక్ మ్యాచ్ గురించి ఎంతో మంది మాట్లాడుతున్నారు. తాజాగా రాందేవ్ బాబా వ్యతిరేక గళం విప్పారు. ఈ మ్యాచ్ ధర్మ విరుద్ధమని అంటున్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ మ్యాచ్ ఆడటం సరికాదన్నారు. క్రికెట్, టెర్రరిజం ఒకే బాటలో కలిసి ప్రయాణించలేవని స్పష్టం చేశారు. పొరుగు దేశంతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పుడు పాక్‌తో క్రికెట్ ఆడటం 'రాజ్య ధర్మం'కు విరుద్ధమని అంటున్నారు.
మరికొన్ని గంటల్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌లోనే అతి గొప్ప మ్యాచ్‌గా దీనిని భావిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది మాజీ క్రికెటర్లు, అభిమానులు, విశ్లేషకులు మ్యాచ్ గురించి మాట్లాడారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కపిల్ దేవ్, ఆకాశ్ చోప్రా, సంజయ్ మంజ్రేకర్ సహా ఎందరో తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాజాగా బాబా రాందేవ్ వ్యతిరేక గళం విప్పారు.
'ఇలాంటి ఉద్రిక్తకరమైన పరిస్థితుల్లో క్రికెట్ మ్యాచ్ ఆడటం రాజ్యధర్మానికి విరుద్ధమని అనుకుంటున్నా. ఇది దేశానికి ప్రయోజనకరం కాదు. ఒకే సమయంలో క్రికెట్ ఆట, ఉగ్రవాదపు ఆట ఆడకూదు' అని రాందేవ్ అంటున్నారు. నాగ్‌పుర్ విమానాశ్రయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులు ఇచ్చారు. ఎల్‌వోసీ వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న సమయంలో పాక్‌తో క్రికెట్ ఆడటం గురించి విలేకరులు ఆయన్ను ప్రశ్నించారు.
Also Read: T20 WC, BAN vs SL Preview: బంగ్లా పులులా? లంకేయులా? సూపర్ 12లో షాకిచ్చేదెవరు?
Also Read: ENG Vs WI, Match Highlights: వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ విజయం.. ఆ రికార్డు బ్రేక్!
Also watch: T20 World Cup 2021: పదేళ్ల తర్వాత ప్రపంచకప్ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
GAME. FACE. ON 👊 🙌#TeamIndia #T20WorldCup pic.twitter.com/fK8kDpqv8w
— BCCI (@BCCI) October 24, 2021
Strap yourselves in!
— T20 World Cup (@T20WorldCup) October 24, 2021
Who takes out today's #T20WorldCup matches? pic.twitter.com/oAeDsk4fnN
The world is watching.
— T20 World Cup (@T20WorldCup) October 24, 2021
Tonight in Dubai, India and Pakistan go toe-to-toe.#INDvPAK | #T20WorldCup pic.twitter.com/NnGtaRzv6d