By: ABP Desam | Updated at : 04 Dec 2022 04:26 PM (IST)
గోల్ కొట్టిన ఆనందంలో మెస్సీ
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో విజయం సాధించింది. తన కెరీర్‌లో మెస్సీ ఆడిన 1000వ మ్యాచ్ ఇది కావడం విశేషం. 1000 మ్యాచ్‌ల్లో 789 గోల్స్‌ను మెస్సీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో కూడా మెస్సీ ఒక గోల్ కొట్టాడు. ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో మెస్సీకి ఇదే తొలి గోల్.
ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా తరఫున మెస్సీ, జులియన్ అల్వారెజ్ గోల్స్ సాధించగా, అర్జెంటీనా ఆటగాడైన ఎంజో ఫెర్నాండెజ్ సెల్ఫ్ గోల్ చేయడంతో ఆధిక్యం 2-1కు తగ్గింది. ఆట మొదటి సగంలో ఆస్ట్రేలియా డిఫెన్స్‌ను ఛేదిస్తూ మెస్సీ కొట్టిన గోల్ మ్యాచ్‌కే హైలెట్.
అర్జెంటీనా తన మొదటి మ్యాచ్‌లో సౌదీ అరేబియా నుంచి ఓడిపోవడంతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది. కానీ ఆ తర్వాత వెంటనే తేరుకుని జాగ్రత్తగా ఆడటంతో నాకౌట్ దశకు చేరుకుంది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో కూడా జాగ్రత్తగా ఆడి విజయం సాధించింది.
అర్జెంటీనా తన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. నెదర్లాండ్స్ కూడా తన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో 3-1 తేడాతో యూఎస్‌ఏపై విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ డిసెంబర్ 10వ తేదీన జరగనుంది.
Best FIFA Football Awards: ఫిఫా అవార్డ్స్- ఉత్తమ ఆటగాడిగా నిలిచిన లియోనెల్ మెస్సీ
Number 10 Jersey: జెర్సీ నెంబర్ 10తో పీలె, సచిన్, డిగో, మెస్సీ, రొనాల్డినో లవ్‌స్టోరీ!
Pele Demise: దివికేగిన దిగ్గజం - ఫుట్‌బాల్ గ్రేటెస్ట్ పీలే కన్నుమూత!
Lionel Messi - Ziva: ధోనీ కుమార్తె జివా కోసం జెర్సీ పంపిన మెస్సీ- ఫొటోలు వైరల్
Personal Finance tips: మార్కెట్లో మెస్సీని గుర్తించి పెట్టుబడి పెట్టండి - 2023 కోసం ఫిఫా చెప్పిన డబ్బు పాఠాలు!
Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్
KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ
MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం
IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు