By: ABP Desam | Updated at : 01 Dec 2022 08:39 AM (IST)
Edited By: nagavarapu
ఆస్ట్రేలియా వర్సెస్ డెన్మార్క్ (source: twitter)
FIFA WC 2022 Qatar: ఫిఫా ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా నిరీక్షణ ఫలించింది. 16 ఏళ్ల తర్వాత ఆ జట్టు ఈ మెగా టోర్నీలో నాకౌట్ కు చేరుకుంది. బుధవారం గ్రూప్- డి మ్యాచులో ఆస్ట్రేలియా 1-0 తో డెన్మార్క్ ను ఓడించింది. ఈ విజయంతో 3 మ్యాచుల్లో రెండింటిలో గెలుపు, ఒక ఓటమితో రెండో స్థానంలో నిలిచి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది.
ప్రథమార్ధంలో డెన్మార్క్ ఎటాక్
ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో బంతి నియంత్రణ, ఎటాకింగ్‌లో ఆస్ట్రేలియా కన్నా డెన్మార్కే మెరుగ్గా కనిపించింది. తొలి 25 నిమిషాల్లోనే ఆ జట్టు మూడుసార్లు గోల్ ప్రయత్నం చేసింది. కానీ సఫలం కాలేకపోయింది. మరోవైపు ఆరంభంలో డిఫెన్స్‌లో బలహీనంగా కనిపించిన ఆస్ట్రేలియా నెమ్మదిగా జోరందుకుంది. ఒకవైపు డెన్మార్క్ దాడులను కాచుకుంటూనే ఎదురుదాడి చేసింది. అయితే ఈ రెండు జట్టు ప్రథమార్థంలో ఒక్క గోల్ చేయలేదు.
రెండో అర్ధభాగంలో సంచలనం
ద్వితీయార్థంలో ఆస్ట్రేలియా ఓ సంచలన గోల్‌తో డెన్మార్క్‌ను కంగుతినిపించింది. మైదానం మధ్యలో బంతిని దొరకబుచ్చుకున్న మాథ్యూ లెక్‌కీ 60వ నిమిషంలో మెరుపులా ప్రత్యర్థి గోల్ ప్రాంతానికి చొచ్చుకొచ్చాడు. అక్కడ అతడి ప్రయత్నాన్ని నిలువరించడానికి ఓ డెన్మార్క్ డిఫెండర్ గట్టిగానే ప్రయత్నించాడు. డ్రిబ్లింగ్‌తో మాయ చేసిన లెక్‌కీ.. అతడి కాళ్ల సందు నుంచి బంతిని తన్నేశాడు. గోల్ బాక్స్‌కు ఓ మూలగా దూసుకెళ్లిన ఆ బంతి డెన్మార్క్ కీపర్‌కు కూడా చిక్కకుండా గోల్ పోస్టులో పడింది. ఆఖరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుని ఆస్ట్రేలియా విజయం సాధించింది. విజయాన్నిఅందుకుంది. 3 మ్యాచ్‌ల్లో 2 గెలుపు, ఒక ఓటమితో గ్రూప్-డిలో ఆస్ట్రేలియా రెండో స్థానంతో ముందంజ వేసింది. మరోవైపు 2 ఓటములు, ఓ డ్రాతో ప్రపంచ పదో ర్యాంకు జట్టు డెన్మార్క్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
The moment Australia qualified for the Round of 16 🇦🇺🫶#FIFAWorldCup | #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) November 30, 2022
ARG vs BRA : బ్రెజిల్- అర్జెంటీనా మ్యాచ్ , స్టేడియంలో చెలరేగిన హింస
Lionel Messi: వేలానికి 'లియోనల్ మెస్సీ' వరల్డ్ కప్ జెర్సీలు - కనీస ధర రూ.76 కోట్లు
Ballon d'Or Nominations: అత్యుత్తమ క్రీడాకారుడి అవార్డు కోసం పోటీ, రొనాల్డో లేకుండానే రేసులో నిలిచిన మెస్సీ
England vs Spain: మొదటి ఫిఫా ప్రపంచకప్‌ను గెలుచుకున్న స్పెయిన్ - ఫైనల్లో ఇంగ్లండ్‌పై 1-0తో విక్టరీ!
AFC Cup 2023: మోహన్ బగాన్ అదుర్స్! AFC కప్‌లో మచ్చీంద్ర ఎఫ్‌సీపై 3-1తో విక్టరీ
Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు
/body>