By: ABP Desam | Updated at : 29 Nov 2022 10:27 AM (IST)
Edited By: nagavarapu
జర్మనీ వర్సెస్ స్పెయిన్
Germany Vs Spain: ఫిఫా ప్రపంచకప్ లో సోమవారం జరిగిన స్పెయిన్- జర్మనీ మ్యాచ్ డ్రా అయింది. తన గత మ్యాచులో జపాన్ చేతిలో ఓడిపోయిన జర్మనీ... బలమైన స్పెయిన్ తో మ్యాచును డ్రా చేసుకుంది. సబ్ స్టిట్యూట్ గా వచ్చిన నిక్లాస్ 83వ నిమిషంలో గోల్ కొట్టటంతో ఆ జట్టు ఓటమిని తప్పించుకుంది. స్పెయిన్ తరఫున అల్వారో మొరాటా 62వ నిమిషంలో గోల్ కొట్టాడు. నాలుగుసార్లు ఛాంపియన్ అయిన జర్మనీ ఈసారి నాకౌట్ చేరడమే కష్టంగా మారింది. ఆదివారం కోస్టారికాతో జరిగే మ్యాచుతో జర్మనీ భవితవ్యం తేలనుంది.
తన చివరి మ్యాచ్‌లో జర్మనీకి కేవలం గెలిస్తే సరిపోదు. ఇతర జట్ల ఫలితాలపై ఆ జట్టు నాకౌట్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. తమ తమ చివరి మ్యాచ్‌లో స్పెయిన్, జర్మనీలు గెలిస్తే రెండు జట్లూ ముందంజ వేస్తాయి. జపాన్-స్పెయిన్ మ్యాచ్ డ్రా అయితే గోల్ అంతరంలో జపాన్ కన్నా మెరుగ్గా ఉంటేనే జర్మనీ నాకౌట్లో ప్రవేశించగలుగుతుంది. 1988 ఐరోపా ఛాంపియన్‌షిప్ తర్వాతి నుంచి ఇప్పటివరకు ఒక్క అధికారిక మ్యాచ్‌లోనూ స్పెయిన్‌ను జర్మనీ ఓడించలేదు. 2014 ప్రపంచకప్ గెలిచిన జర్మనీ.. ఆ తర్వాత ఆడిన అయిదు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఒక్కటి మాత్రమే నెగ్గింది.
Jamal Musiala's game by numbers vs Spain:
47 touches
7 duels won
4 take-ons completed
4 touches in opp. box
3 fouls won
3 chances created
1 shot
1 assist
Germany's bright spark. 💥 pic.twitter.com/bttF46npmW — Squawka (@Squawka) November 27, 2022
ప్రపంచ నెంబర్ వన్ బ్రెజిల్ ఫిఫా ప్రపంచకప్ లో రౌండ్ ఆఫ్ 16 కు అర్హత సాధించింది. సోమవారం స్విట్జర్లాండ్ తో హోరాహోరీగా జరిగిన మ్యాచులో 1-0 తేడాతో గెలిచింది. దీంతో ఈ మెగా టోర్నీలో ఫ్రాన్స్ తర్వాత నాకౌట్ చేరిన రెండో జట్టుగా నిలిచింది.
బ్రెజిల్ కు ఈ విజయం అంత తేలికగా దక్కలేదు. స్విట్జర్లాండ్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. తమ సూపర్ స్టార్ నెయ్ మార్ లేకపోయినా బ్రెజిల్ ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమించి గెలిచారు. మ్యాచ్ మరికొన్ని నిమిషాల్లో ముగుస్తుందనగా బ్రెజిల్ విజయం సాధించింది. ఆ జట్టు ఆటగాడు కాసెమిరో 83వ నిమిషంలో గోల్ చేశాడు. ఇది ఆ జట్టుకు రెండో విజయం. బ్రెజిల్ కెప్టెన్ నెయ్ మార్ గాయం కారణంగా ఈ మ్యాచులోనూ ఆడలేదు.
ఫస్ట్ హాఫ్ లో నో గోల్
మొదటి అర్ధభాగంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్ ఆరంభమైన తొలి 10 నిమిషాలపాటు రెండు జట్లు రక్షణాత్మక ఆటతీరును కనబరిచాయి. 14వ నిమిషంలో స్విట్జర్లాండ్ కు లభించిన ఫ్రీకిక్ వృథా అయ్యింది. 20వ నిమిషం నుంచి బ్రెజిల్ ఎదురుదాడికి దిగి బంతిని ఎక్కువగా తమ ఆధీనంలోనే ఉంచుకుంది. 27వ నిమిషంలో రాఫిన్హా సూపర్ క్రాస్‌ను అందుకున్న వినిసియస్ జూనియర్ అతి సమీపం నుంచి గోల్ కోసం ప్రయత్నించినా స్విస్ కీపర్ సోమర్ సమర్థంగా అడ్డుకోగలిగాడు. ఇక 43వ నిమిషంలో స్విస్ తొలిసారి బ్రెజిల్ గోల్ పోస్టుపైకి దాడికి దిగినా ఫలితం కనిపించలేదు. 45వ నిమిషంలోనూ రాఫిన్హా కార్నర్ కిక్‌ను స్విస్ కీపర్ ఒడిసిపట్టుకున్నాడు. ప్రథమార్ధంలో బ్రెజిల్‌కు పలు అవకాశాలు వచ్చినా స్విస్ డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది.
చివరి నిమిషాల్లో గోల్
ద్వితీయార్ధం 65వ నిమిషంలో వినిసియస్ జూనియర్ చేసిన గోల్‌ను రెఫరీ ఆఫ్‌సైడ్‌గా ప్రకటించడంతో బ్రెజిల్‌కు నిరాశే ఎదురైంది. ఆ తర్వాత లభించిన ఫ్రీకిక్‌లు కూడా బ్రెజిల్‌కు ఉపయోగపడలేదు. 73వ నిమిషంలో రాఫిన్హా, రిచర్లిసన్ స్థానాల్లో సబ్‌స్టిట్యూట్స్‌ను ఆడించారు. అయితే బ్రెజిల్ పట్టు విడవకుండా ప్రయత్నించింది. 83వ నిమిషంలో ఆ జట్టుకు గోల్ దక్కింది. వినిసియస్ అందించిన పాస్‌ను టాప్ కార్నర్ నుంచి కాసెమిరో చక్కటి వాలీతో బంతిని నెట్‌లోకి పంపడంతో స్టేడియం దద్దరిల్లింది. ఆతర్వాత కూడా బ్రెజిల్ నుంచి స్విస్‌కు తీవ్ర పోటీయే ఎదురైంది. ఓవైపు తమ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించింది.
Number 10 Jersey: జెర్సీ నెంబర్ 10తో పీలె, సచిన్, డిగో, మెస్సీ, రొనాల్డినో లవ్‌స్టోరీ!
Pele Demise: దివికేగిన దిగ్గజం - ఫుట్‌బాల్ గ్రేటెస్ట్ పీలే కన్నుమూత!
Lionel Messi - Ziva: ధోనీ కుమార్తె జివా కోసం జెర్సీ పంపిన మెస్సీ- ఫొటోలు వైరల్
Personal Finance tips: మార్కెట్లో మెస్సీని గుర్తించి పెట్టుబడి పెట్టండి - 2023 కోసం ఫిఫా చెప్పిన డబ్బు పాఠాలు!
FIFA WC 2022: అర్జెంటీనా ప్రపంచకప్ సంబరం- రోడ్లన్నీ 'జన'మయం
Vijayashanthi: దొంగను పట్టించండి - ఈటల రాజేందర్‌కు విజయశాంతి కౌంటర్
కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీలో రచ్చరచ్చ- ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీ
Bharat Jodo Yatra: శ్రీనగర్‌లో రాహుల్, ప్రియాంక సందడి - భారీ సభతో జోడో యాత్రకు ముగింపు
Kangana Ranaut:‘ఈ దేశం ఖాన్‌లను, ముస్లీం హీరోయిన్లకు ప్రేమిస్తోంది’ - ‘పఠాన్’ సక్సెస్‌పై కంగనా కామెంట్స్