By: ABP Desam | Updated at : 26 Mar 2023 09:11 PM (IST)
వికెట్ తీసిన హేలీ మాథ్యూస్‌ను అభినందిస్తున్న కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (Image credits: WPLT20 Twitter)
Delhi Capitals Women vs Mumbai Indians Women, WPL 2023 Final: మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పోరాడదగ్గ స్కోరు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తూ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. కెప్టెన్, ఓపెనర్ మెగ్ లానింగ్ (35: 29 బంతుల్లో, ఐదు ఫోర్లు) ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఢిల్లీ టెయిలెండర్ బ్యాటర్లు ఢిల్లీ చివరి వరుస బ్యాటర్లు శిఖా పాండే (27 నాటౌట్: 17 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), రాధా యాదవ్ (27 నాటౌట్: 12 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) అద్భుతమైన పోరాటపటిమ కనబరించారు. చివరి వికెట్‌కు 52 పరుగులు జోడించారు.
ముంబై విజయానికి 120 బంతుల్లో132 పరుగులు చేయాలి. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసింది. ఇక ఇస్సీ వాంగ్ కూడా మూడు వికెట్లు దక్కించుకుంది. తను కీలకమైన బ్యాటర్లను షెఫాలీ వర్మ, ఆలిస్ క్యాప్సే, జెమీమా రోడ్రిగ్స్) తీసి సత్తా చాటింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే రెండో ఓవర్లోనే ఢిల్లీకి ఎదురు దెబ్బ తగిలింది. మంచి టచ్‌లో కనిపించిన ఓపెనర్ షెఫాలీ వర్మ (11: 4 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) ఇస్సీ వాంగ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయింది. ఆ తర్వాత వచ్చిన అలీస్ క్యాప్సే (0: 2 బంతుల్లో), జెమీమా రోడ్రిగ్స్ (9: 8 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా వాంగ్ బౌలింగ్‌లోనే అవుటయ్యారు. దీంతో 35 పరుగులకే ఢిల్లీ మూడు వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన మారిజానే కాప్ (18: 21 బంతుల్లో, రెండు ఫోర్లు), ఓపెనర్ మెగ్ లానింగ్‌తో (35: 29 బంతుల్లో, ఐదు ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను కుదుట పరిచింది. అయితే వీరిద్దరూ చాలా నిదానంగా ఆడారు. వీరు నాలుగో వికెట్‌కు 38 పరుగులు జోడించారు. అయితే మెలీ కెర్ ఢిల్లీకి షాక్ ఇచ్చింది. క్రీజులో కుదురుకున్న మారిజానే కాప్‌ను అవుట్ చేసింది. ఆ తర్వాతి ఓవర్లోనే మెగ్ లానింగ్ కూడా జెస్ జోనాసెన్‌తో సమన్వయ లోపం కారణంగా రనౌట్ అయింది. ఆ వెంటనే అరుంధతి (0: 5 బంతుల్లో), జెస్ జోనాసెన్ (2: 11 బంతుల్లో) కూడా అవుట్ అయ్యారు. కాసేపటికే మిన్ను మణి (1: 9 బంతుల్లో), తానియా భాటియాలను (0: 2 బంతుల్లో) కూడా హేలీ మాథ్యూస్ ఒకే ఓవర్లో అవుట్ చేసింది. దీంతో ఢిల్లీ 79 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది.
కానీ ఢిల్లీ చివరి వరుస బ్యాటర్లు శిఖా పాండే (27 నాటౌట్: 17 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), రాధా యాదవ్ (27 నాటౌట్: 12 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) అసమాన పోరాట పటిమను కనపరిచారు. వీరు అజేయమైన ఆఖరి వికెట్‌కు 24 బంతుల్లోనే 52 పరుగులు జోడించారు. స్పెషలిస్ట్ బ్యాటర్లు విఫలమైన పిచ్‌పై బౌండరీలతో చెలరేగారు. టాప్ ఆర్డర్ వెన్ను విరిచిన ఇస్సీ వాంగ్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో వీరు ఏకంగా 20 పరుగులు రాబట్టారు. వీరు పదో వికెట్‌కు పరుగులు జోడించారు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ (ప్లేయింగ్ XI)
మెగ్ లానింగ్(కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, మారిజానే కాప్, అలిస్ క్యాప్సే, జెస్ జోనాస్సెన్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా(వికెట్ కీపర్), మిన్ను మణి, రాధా యాదవ్, శిఖా పాండే
ముంబై ఇండియన్స్ మహిళలు (ప్లేయింగ్ XI)
యాస్తికా భాటియా(వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), మెలీ కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలిత, సైకా ఇషాక్
Women Cricket Team Wins Gold: మన అమ్మాయిలు బంగారం - ఏసియన్ గేమ్స్ క్రికెట్ ఫైనల్‌లో లంకను ఓడించిన భారత్
Asian Games 2023: గోల్డ్ కొట్టేసిన స్మృతి మంధాన సేన! లంకపై ఫైనల్లో థ్రిల్లింగ్ విక్టరీ
Asian Games 2023 Medal Tally: డబుల్ డిజిట్ దాటిన భారత్ పతకాల సంఖ్య - మెడల్స్ కొల్లగొడుతున్న రోయర్లు
Asian Games 2023: తుదిపోరులో తడబడిన భారత బ్యాటింగ్ - లంక టార్గెట్ ఎంతంటే!
Axar Patel Ruled Out: భారత్‌కు భారీ షాక్ - మూడో వన్డేకూ దూరమైన అక్షర్ - ప్రపంచకప్‌లో అయినా ఆడతాడా?
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు నిర్ణయం
Breaking News Live Telugu Updates: ఆసియా గేమ్స్‌లో మహిళా క్రికెట్ జట్టుకు స్వర్ణం
దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న మరో మహమ్మారి, 5 కోట్ల మంది ప్రాణాలు బలి!
Telangana BJP: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? నేతల రహస్య సమావేశాలు దేని కోసం ?
/body>