DCW Vs MIW: టాప్ 2 జట్ల మధ్య పోరు - టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ!
ముంబై ఇండియన్స్ మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
Delhi Capitals Women vs Mumbai Indians Women, WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం మహిళల ప్రీమియర్ లీగ్ టాస్ గెలిచిన జట్లు 200 దాటడం కామన్ అయిపోయింది. దీంతో ఏ జట్టు టాస్ గెలిచినా టాస్ వైపే మొగ్గు చూపుతున్నాయి.
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ప్రస్తుతం టాప్ 2 స్థానాల్లో ముంబై, ఢిల్లీనే ఉన్నాయి. రెండు జట్లూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు టేబుల్ టాప్‌కు చేరుకోనుంది. దీంతో మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ (ప్లేయింగ్ XI)
మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మారిజాన్ కాప్, జెమిమా రోడ్రిగ్స్, అలిస్ క్యాప్సే, జెస్ జోనాస్సెన్, తానియా భాటియా (వికెట్ కీపర్), మిన్ను మణి, శిఖా పాండే, రాధా యాదవ్, తారా నోరిస్
ముంబై ఇండియన్స్ మహిళలు (ప్లేయింగ్ XI)
హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), నాట్ స్కీవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలితా, సైకా ఇషాక్
ఐపీఎల్ తాజా సీజన్ నుంచి డీఆర్‌ఎస్‌ను మరింత విస్తరించనున్నారు. కేవలం ఔట్, నాటౌట్‌కే కాకుండా ఇకపై నోబాల్, వైడ్ బాల్‌కు ఆటగాళ్లు సమీక్ష కోరుకోవచ్చని తెలిసింది. ప్రస్తుతం విమెన్ ప్రీమియర్ లీగులో దీనిని విజయవంతంగా ఉపయోగిస్తున్నారు.
ఐపీఎల్ (IPL) అంటేనే ఆఖరి వరకు ఏం జరుగుతుందో చెప్పలేం! అంపైర్ తీసుకొనే ఒక తప్పుడు నిర్ణయంతో మ్యాచ్ గమనమే మారిపోతుంది. విజయాలు చేజారుతుంటాయి. గతంలో ఇన్నింగ్స్ ఆఖరి బంతులు నోబాల్ అయినా అంపైర్లు ఇవ్వకపోవడంతో భారీ విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు ఆటగాళ్లు ఔటై పెవిలియన్‌కు చేరారు.
ఇకపై ఇలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకు, ఆటగాళ్లకు మరో అవకాశం ఇవ్వాలని బీసీసీఐ (BCCI) నిర్ణయించింది. ప్రస్తుతం జరుగుతున్న విమెన్ ప్రీమియర్ లీగులో నోబాల్ (No Ball), వైడ్ బాల్ (Wide Ball) కోసం సమీక్ష కోరేలా నిబంధనలు సవరించింది.
'మైదానంలోని అంపైర్లు తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలని క్రికెటర్లు కోరొచ్చు. బ్యాటర్ ఔటయ్యారో లేదో తెలుసుకోవచ్చు. వైడ్ బాల్, నోబాల్ విషయంలోనూ ఆన్‌ఫీల్డ్ అంపైర్ నిర్ణయంపై సమీక్ష అడగొచ్చు' అని విమెన్ ప్రీమియర్ లీగ్ (Women Premier League) నిబంధనల్లో రాశారు.
ముంబయి ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన తొలి మ్యాచులోనే ఈ నిబంధనను జట్లు ఉపయోగించుకోవడం గమనార్హం. సైకా ఇషాకి వేసిన డెలివరీని అంపైర్ వైడ్‌గా ప్రకటించారు. దానిని సవాల్ చేస్తూ ఫీల్డింగ్ జట్టు సమీక్ష కోరింది. దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరులోనూ వాడేశారు. మేఘాన్ షూట్ ఫుల్‌టాస్‌గా వేసిన డెలివరీని అంపైర్ నోబాల్‌గా ప్రకటించలేదు. దాంతో బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ సమీక్ష కోరింది. అయితే సఫలం కాలేదు. యూపీ వారియర్జ్, గుజరాత్ టైటాన్స్ మ్యాచులోనూ ఇలాంటి సమీక్షే కోరారు.