![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
WTC Final 2023: ఓవల్ పిచ్‌పై అలాంటి బౌలింగా!! టీమ్‌ఇండియా కష్టాలకు రీజన్ ఇదే!
WTC Final 2023: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియాను బౌలర్లే వెనక్కి నెట్టేశారని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (Ricky Ponting) అంటున్నాడు.
![WTC Final 2023: ఓవల్ పిచ్‌పై అలాంటి బౌలింగా!! టీమ్‌ఇండియా కష్టాలకు రీజన్ ఇదే! WTC Final Ricky Ponting India let themselves down bowling too short praises siraj WTC Final 2023: ఓవల్ పిచ్‌పై అలాంటి బౌలింగా!! టీమ్‌ఇండియా కష్టాలకు రీజన్ ఇదే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/09/ea0208602d60e620f9cf87cf7b8b8fef1686292853802251_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
WTC Final 2023:
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియాను బౌలర్లే వెనక్కి నెట్టేశారని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (Ricky Ponting) అంటున్నాడు. పుల్లర్ లెంగ్తులు వేయాల్సిన చోట షార్ట్ బాల్స్ వేశారని పేర్కొన్నాడు. అందుకే వాతావరణం అనుకూలంగా ఉన్నా ఎక్కువ వికెట్లు పడలేదని వెల్లడించాడు. మహ్మద్ సిరాజ్ మాత్రం కంగారూలకు కఠినంగా పోటీనిచ్చాడని ప్రశంసించాడు. సరికొత్త డ్యూక్ బంతితో మరింత వ్యూహాత్మకంగా బౌలింగ్ చేయాల్సిందని సూచించాడు.
'ఫైనల్ టెస్టు తొలి రోజు తొలి గంటలోనే టీమ్‌ఇండియా వెనకబడింది. షార్ట్ బౌలింగ్ చేసింది. వాతావరణం చల్లగా ఉంది. వికెట్ స్వభావాన్ని అనుసరించి బ్రాండ్ న్యూ డ్యూక్ బాల్‌తో ఫుల్లర్ లెంగ్తు వేయాల్సింది. లంచ్ సమయానికి కనీసం 4-5 వికెట్లు పడగొట్టాలని భారత్ భావించింది. కానీ వారు రెండే వికెట్లు తీశారు. అది ఆసీస్‌కు అనుకూలంగా మారింది. పిచ్ మాత్రం పేసర్లకు అనుకూలంగానే ఉంది' అని రికీ పాంటింగ్ అన్నాడు.
మహ్మద్ సిరాజ్ (Mohammad Siraj) ఇంటెన్సిటీ బాగుందని పాంటింగ్ ప్రశంసించాడు. ఆసీస్‌కు అతడు అల్టిమేట్ కాంపిటీటర్ అని పేర్కొన్నాడు. ఈ మ్యాచులో అతడు 108 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఉస్మాన్ ఖవాజా (0), ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్ (9), నేథన్ లైయన్ (9)ను ఔట్ చేశాడు. టెస్టుల్లో 50 వికెట్లు మైలురాయి అందుకున్నాడు.
'టీమ్‌ఇండియాలో మహ్మద్ సిరాజ్ నిఖార్సైన పోటీదారుగా కనిపించాడు. కొన్నిసార్లు ఓవర్ ద టాప్ వేశాడు. పరిస్థితులు అనుకూలించనప్పుడు ఇలాంటి బౌలర్లు కచ్చితంగా జట్టులో ఉండాలి. తొలిరోజు మ్యాచ్ గమనం మార్చేది అతడే అనిపించింది. అతడి బౌలింగ్‌లో ఎక్కడా వేగం తగ్గలేదు. ఇన్నింగ్స్ మొత్తం అలాగే వేశాడు. మొదటి రోజు మొదటి బంతి నుంచి రెండో రోజు ఆఖరి వరకు 86-87 మైళ్ల వేగంతో బౌలింగ్ చేశాడు. అందుకే అతడి ఆటిట్యూడ్‌ను మెచ్చుకోక తప్పదు' అని రికీ పాటింగ్ తెలిపాడు.
రవిచంద్రన్ అశ్విన్‌కు జట్టులో చోటివ్వకపోవడంపై రికీ స్పందించలేదు. అయితే వాతావరణం చల్లగా ఉండటం, మబ్బులు పట్టడం, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో నలుగురు పేసర్లను తీసుకుందని వివరించాడు. రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ ఇద్దరూ కలిసే ఈ నిర్ణయం తీసుకున్నారని అంచనా వేశాడు.
ఫైనల్లో రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. క్రీజులో అజింక్య రహానే (29 బ్యాటింగ్: 71 బంతుల్లో, నాలుగు ఫోర్లు), కేఎస్ భరత్ (5 బ్యాటింగ్: 14 బంతుల్లో) ఉన్నారు. అంతకు ముందు ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ఇంకా 318 పరుగులు వెనకబడి ఉంది. కనీసం ఫాలో అప్ తప్పించుకోవాలన్నా 119 పరుగులు చేయాలి.
ఆసీస్ తొలి ఇన్నింగ్సులో ఆసీస్‌లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు కొట్టారు. ట్రావిస్ హెడ్ 174 బంతుల్లోనే 25 బౌండరీలు ఒక సిక్సర్ సాయంతో 163 పరుగులు చేశారు. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 268 బంతులు ఆడి 19 బౌండరీలు కొట్టి 121 పరుగులు చేశాడు. వీరికి తోడుగా అలెక్స్ కేరీ 69 బంతుల్లోనే 48 పరుగులు సాధించాడు. కానీ టీమ్‌ఇండియాలో రోహిత్ శర్మ (15), శుభ్‌మన్ గిల్ (13), చెతేశ్వర్ పుజారా (14), విరాట్ కోహ్లీ (14) వెంటవెంటనే ఔటయ్యారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)